ఆయుర్వేద మిత్రులారా! మన పవిత్ర భారతభూమిపై పుట్టిన అపురూప ఔషధ మొక్కల్లో నేలవేము
మహా గొప్పది. ఇది చూడటానికి చిన్న మొక్కలా కనిపించినా కూడా దీని ఔషధ విలువలు మాత్రం అనంత
మైనవి. దీని అసలుపేరు నేలవేప. ప్రజల వాడుకలో క్రమంగా అది నేలవేముగా మారిపోయింది. దాదాపుగా
వేపచెట్టుకున్న అన్ని గుణాలు దీనిలో వుండటమే గాక, వేపచెట్టులో లేని అదనపు ప్రత్యేక ఔషధగుణాలుకూడా
ఈ నేలవేములో వున్నయ్. ఇది అన్ని మెట్టప్రాంతాలలో విశేషంగా లభిస్తుంది. ఆకు నల్లగా కోలగా వుంటుంది.
ఘాటైన చేదుతో అనేక విషరోగాలను తిరిగి తలెత్తకుండా తొక్కివేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. మీ
ప్రాంతంలో పెరిగే ఇంత గొప్ప ఔషధ మొక్క గురించి మీకు తెలియకపోతే మీరెంతో సౌభాగ్యాన్ని కోల్పోయినట్లే.
నేలవేము - పేర్లు..
సంస్కృతంలోభూనింబ,కిరాతతిక్త,జ్వరాంతకఅని,హిందీలో చిరాయత, కాలమేఘ అని, తెలుగులోనేలవేము అని, లాటిన్లో Sucerits Chirats,Gentiana Cheryta అంటారు.
నేలవేము - రూప గుణ ప్రభావాలు..
ఇది భూమిమీద అరమీటరునుండి ఒకమీటరుఎత్తువరకు పెరుగుతుంది. ఆకులు మిరపాకులాగాకోలగా వుంటయ్. తెల్లరంగుపూలుపూస్తయ్.కాయలుచీలికకలిగిపేలుడుకాయల్లాగా వుంటయ్లోపలిగింజ బద్దలాగా గట్టిగా వుంటుంది. ఇందులోదేశవాళినేలవేము, సీమ నేలవేము అనే రెండు రకాలున్నయ్.
ఇది చౌడునేలల్లో మెట్ట ప్రాంతాల్లో విస్తారంగా మొలుస్తుంది. మనదేశవాళీనేలవేముమొక్కంతాకారునలుపుగావుంటుంది. ఉపయోగాలు తెలుసుకుందాం.
తల్లిపాల శుద్ధికి - నేలవేము..
ఏకారణం వల్లనైనా తల్లిపాలు రోగకారకమైతేవెంటనే రెండుకప్పుల నీటిలో అయిదుగ్రాములునేలవేమువేసి ఒకకప్పుకషాయం మిగిలేవరకుమరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాతఒక చెంచా తేనెకలిపి రెండుపూటలా సేవిస్తుంటేమాతృక్షీరదోషం హరించి స్తన్యశుద్ధి అవుతుంది.
రక్తంలో పైత్యంచేరితే - నేలవేము..
శరీరంలో పైత్యం ప్రకోపించినప్పుడు అది బలవంతంగా రక్తంలోకి చొచ్చుకుపోయి రక్తాన్ని ఉద్రేకపరుస్తుంది. అప్పుడు శరీరమంతా మంటలు, కురుపులు, పుండ్లు, మొదలైన అనేక ఉపద్రవాలు కలుగుతయ్.
అలాంటివారికి నేలవేము సమూలచూర్ణంమూడుగ్రాములు, మంచిగంధంచూర్ణు మూడుగ్రాములు ఒకకప్పు నీటిలో కలిపి రెండుపూటలా తాగిస్తూవుంటే రక్తపైత్య ఉపద్రవాలు తగ్గిపోతయ్.
అన్నిరకాల ఉబ్బురోగాలకు - నేలవేము..
నేలవేము 10గ్రా, శొంఠి 10గ్రా, నలగొట్టి పావులీటరు మంచినీటిలో వేసి సగానికి మరిగించి వడపోసు
కోవాలి.అందులో ఒక చెంచా కండచక్కెర కలిపి రెండు
పూటలా సేవిస్తూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ,
పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో
చెడునీరు చేరిన ఉబ్బురోగం తప్పక హరించిపోతుంది.
విషజ్వరాలకు - నేలవేముమాత్రలు..
నేలవేముఆకు తులసి ఆకురసం సమంగా కలిపి'రోటిలో వేసి రెండు పదార్థాలు బాగా కలిసి ముద్దలాగాఅయ్యేవరకు మెత్తగా నూరి ఆ ముద్దను కందిగింజలంత గోలీలుగా తయారుచేసి నీడలో గాలి తగిలేచోటపూర్తిగా ఎండించి నిలువచేసుకోవాలి.
ఈమాత్రలను రెండు గంటలకు ఒకసారి ఒకమాత్రను ఒక చెంచా తమలపాకురసంతో రోజుకుమూడునాలుగుసార్లు సేవిస్తూవుంటే విషజ్వరాలుహరించిపోతయ్.
ముదిరిన చర్మరోగాలకు - నేలవేము..
నేలవేము 10గ్రా, మానుపసుపు 10గ్రా, చండ్రచెక్క 10 గ్రా, ఈమూడింటినినలగొట్టిపావులీటరునీటిలోవేసిసగంకషాయం మిగిలేవరకు చిన్నమంటపైన మరగబెట్టి దించి వడపోసుకోవాలి.
ఈకషాయాన్ని సగంసగం మోతాదుగా రెండుపూటలా సేవిస్తూవుంటే రక్తశుద్ధిజరిగి ముదిరిన చర్మరోగం హరించిపోతుంది.
నిండుబలానికి - నేలవేము..
నేలవేము 20గ్రా తీసుకొని అరలీటరు మంచినీటిలో వేసి ఆరుగంటలపాటు మూతబెట్టి నానబెట్టాలిఆతరువాత వేరేపాత్రలోకివడపోసిపూటకు50గ్రాచొప్పునమూడుపూటలా ఒకచెంచా తేనె లేక కండచక్కెర కలిపి సేవించాలి.
ఇదితాగినవెంటనేరెండుగ్రాములదాల్చినచెక్కనమిలిమింగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా శరీరంలోఅజీర్ణం, అరుచి హరించిపోయి దేహానికి నిండుబలం,దారుఢ్యంసంపూర్ణంగా కలుగుతయ్.
అన్నిరకాల జ్వరాలకు - నేలవేము..
నేలవేము, వేపచెట్టుబెరడు, కటుకరోహిణి,తిప్పతీగ, కరక్కాయలబెరడు, తుంగగడ్డలు,ధనియాలు, అడ్డసరపుఆకులు, కానుగబెరడు, వాకుడుపండ్లు, కర్కాటకశృంగి, శాంతి, ప్పటకం, చేదుపొట్ల, పిప్పళ్ళు, కచ్చూరాలు, వీటిని సమభాగాలుగాసేకరించాలి. వీటిలో కరక్కాయలు, ధనియాలు,శొంఠి, పిప్పళ్ళు వీటిని దోరగా వేయించి పొడిచేసిమిగతా పొడులలో కలిపి పూటకు 3గ్రా చొప్పునమంచినీటితో రెండుపూటలా సేవిస్తూవుంటే సకల
జ్వరాలు సమసిపోతయ్.
పిల్లలజ్వరానికి - నేలవేము..
రెండుకప్పుల నీటిలో అయిదు గ్రాముల నేలవేముఅరకప్పు కషాయానికి మరిగించి అది గోరువెచ్చగా అయిన తరువాత అరచెంచా తేనె కలిపి బిడ్డలతాగిస్తూవుంటే బాలజ్వరాలు హరించిపోతయ్.
దారుణ ఉదరశూలకు - నేలవేము పట్టు..
నేలవేము, పప్పళ్ళు, కరక్కాయ, కటుకరోహిణి,కలబంద గుజ్జు వీటిని సమంగా కలిపి తగినన్ని నీటితోబాగా మెత్తగా నూరి ఆ ముద్దను కొంచెం వేడిచేసి పొట్టపైన చిక్కగా పట్టువేస్తే దీని ప్రభావానికి రెండు మూడువిరేచనాలై దారుణమైన ఉదరశూల మాయమైపోతుంది.
ప్రాణాంతక సన్నిపాతానికి - నేలవేము..
నేలవేముఆకులు ,ఉలిమిడి చెక్క, కొడిశపాలగింజలు, తుంగగడ్డలు, దేవదారు చెక్క, శొంఠి, గజపిప్పళ్ళు, ధనియలు, దశమూలాలు వీటన్నింటినిసమానభాగాలుగా తీసుకొని దంచి పలుచనిబట్టలోవస్త్రఘాళితంబట్టి ఆ అతిమెత్తనిచూర్ణాన్ని ఒకగాజుసీసాలోనిలువవుంచుకోవాలి.
ఈ మార్గాన్ని పూటకుమూడుగ్రాముల మోతాదుగా
రెండు లేదా మూడుపూటలా వేడినీటిలో కలిపితాగిస్తుంటే దారుణమైన దగ్గు ఆయాసంతో కూడుకొనివచ్చే ప్రాణాంతక సన్నిపాత జ్వరం వారం లేకపదిరోజులలో తగ్గిపోయి ప్రాణాలు కాపాడబడతయ్.
ఆమవాతజ్వరానికి - నేలవేము కషాయం..
నేలవేము, తిప్పతీగ, తుంగగడ్డలు, శాంతి ఒక్కొక్కటి పదిగ్రాముల చొప్పున అరలీటరు నీటిలోవేసిపావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి ఉదయం సాయంత్రం సగంసగం కషాయంసేవిస్తూవుంటే ఆమవాత జ్వరం హరించిపోతుంది.
జ్వర నీరసానికి - నేలవేము..
అరలీటరుమంచినీటిలో నేలవేము 20 గ్రాకలిపిపావులీటరు కషాయం మిగిలేవరకు మరిగించి, వడపోసి పూటకు అరకప్పు కషాయం మోతాదుగా మూడుపూటలా ఒకచెంచా తేనెకలిపి తాగుతూవుంటే జ్వరంవల్ల వచ్చిన నీరసం బలహీనత అజీర్ణం హరించిపోతయ్.