బలం కోసం టానిక్ లు కొనలేని వారు ఉసిరికాయ తొక్కుడు పచ్చడి తింటే అంతకన్నా బలకరమైనది లేదు.ముదిరిన ఉసిరి కాయలను తొక్కి తయారు చేసే తొక్కుడు పచ్చడి చాలా ఆరోగ్యకరమైనది.దీనినే నల్ల పచ్చడి అంటారు.ఇది పాతబడిన కొద్దీ ఆరోగ్యవంతంగా ఉంటుంది.గతసంవత్సరం తయారు చేసి ,జాడీలో పెట్టి గుడ్డ వాసెన కట్టి అట్టే పెట్టిన పచ్చడిని ఈ ఏడాది తింటే బాగా ఉపయోగకరం.ఒక వారానికి సరిపడా పచ్చడిని ఇవతలకు తీసుకుని ,తిరగమూత పెట్టి,బాగా ఎక్కువగా కొత్తిమీర,కరివేపాకు వంటివి కలుపుకొని అన్నంలో మొదటి ముద్దగాతింటూ ఉంటే దీని ప్రయోజనాలు కనిపిస్తాయి.కమ్మగా నెయ్యి వేసుకుని తినాలి.
వేడిని తగ్గిస్తుంది,షుగర్ వ్యాధిలో రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించి మేలు చేస్తుంది.మూత్రపిందాలవ్యాధులన్నింటిలోనూ తినడం మంచిది.బిపి ఉన్నవారికి దీన్ని రోజూ తప్పనిసరిగా పెట్టాలి.రక్తంలో టెన్షన్ పెరగకుండా కాపాడుతుంది.వాతవ్యాధులన్నింటినీ తగ్గించడానికి తోడ్పడుతుంది.వీర్యానికి చలవనిస్తుంది.వీర్యం మంటగా వెడుతూ మూత్రాశయం అంతా మంట పుట్టిస్తున్న వ్యాధిలో ఇది మేలు చేస్తుంది.
No comments:
Post a Comment