21, జనవరి 2012, శనివారం

ఉల్లిగడ్డ.. ఆయుర్వేద ఉపయోగాలు

1 

ఒక స్పూను ఉల్లి రసం, ఒక స్పూను  తేనె కలిపి తీసుకుంటూ ఉంతే  అధిక రక్త పోటు ఉన్నవారికి కొద్ది  ఉపశమనం కలుగుతుంది.


2 . నోటి దుర్వాసన తగ్గడానికి ( AYURVEDIC   FOR BAD ODOUR OF THE MOUTH )

భోజనానంతరము రెండు ఉల్లి కాడలు నమలడం  వల్ల నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు.

3 . జీర్ణ కోశ శుభ్రతకు , వ్యాధి నిరోధకత పెరుగుటకు.( AYURVEDIC RECIPE FOR CLEANSING OF DIGESTIVE SYSTEM AND IMPROVE IMMUNITY )

ఉల్లి పాయ ముక్కలు
దోస
టమోట
క్యారెట్
నిమ్మ
కొత్తి మీర

పై వాటిని సమంగా తీసుకొని బాగా చితక్కొట్టి , ముద్దగా నూరి కొద్దిగా  ఉప్పు కలిపి   ప్రతిరోజూ సేవించాలి.

ఉపయోగాలు  -  జీర్ణకోశం పరిశుభ్రంగా ఉంటుంది.వ్యాధి నిరోధకత పెరుగుతుంది.


4 . జీర్ణ శక్తి  పెరుగుటకు (  TO IMPROVE DIGESTION CAPACITY )


ఉల్లిపాయ ముక్కలు
వెనిగర్


ఉల్లిపాయలను  ముక్కలుగా తరిగి వెనిగర్ తో కలిపి  భోజనానంతరం తింటుండాలి.


ఉపయోగాలు  -  జీర్ణశక్తి పెరుగుతుంది.


5 . ఆయాసం , దగ్గు, ఆకలి లేకపోవడం తగ్గుటకు( AYURVEDIC RECIPE  ADYNAMIA , COUGH , LOSS OF APPETITE )


ఉల్లి లేదా వెల్లుల్లి రసం  -  2 తులాలు ( 20 gm )
తేనె  - 2 టీ స్పూనులు
అల్లం రసం  - 1 టీ స్పూను


పై వాటిని కలిపి భోజనానంతరం ప్రతి రోజూ తీసుకుంటుండాలి.


ఉపయోగాలు  - ఆయాసం , దగ్గు , ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.


6  . దగ్గు , జలుబు , టాన్సిల్స్ వాపు  తగ్గుటకు( AYURVEDIC RECIPE FOR COUGH , COLD, TONSILS SWELLING )


ఉల్లి పాయ రసం  -  1 టీ స్పూను
తేనె  -  1 పెద్ద స్పూను

పై  రెండింటిని కలిపి , 3 భాగాలుగా చేసుకుని , పూటకు ఒక భాగం చొప్పున   రోజుకు  మూడు పూటలా  సేవిస్తుండాలి.


ఉపయోగాలు  - దగ్గు , జలుబు , గొంతులో ఉండే టాన్సిల్స్  వాపుకు  మంచి మందుగా పని చేస్తుంది.


7.కీళ్ళ నొప్పులు  తగ్గుటకు (  AYURVEDIC RECIPE FOR JONIT PAINS ).


ఉల్లి
ఆవ నూనె


ఉల్లిని మెత్తగా నూరి  కొద్దిగా వేడి చేసిన ఆవ నూనెతో కలిపి  కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాయాలి.

ఉపయోగాలు  -  కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.


8. చర్మం పైన లేచిన గడ్డలు పగలడానికి (  AYURVEDIC RECIPE FOR CYSTS ON THE BODY )


నెయ్యి  - కొంచెం
ఉల్లి


శరీరంలో ఏ భాగంలోనైనా గడ్డలు లేస్తే  దానిపై కొద్దిగా  నెయ్యి వేడి చేసి ఆ  గడ్డల మీద రాసి  , ఉడికించిన ఉల్లిని  నూరి  పట్టు వేయాలి.


ఉపయోగాలు  - గడ్డలు మెత్తబడి  పగిలిపోతాయి.






9.ముక్కు నుండి కారే రక్తం ఆగుటకు (  AYURVEDIC RECIPE FOR NOSE BLEEDING )


ఉల్లిపాయ రసాన్ని ముక్కులో వెస్తే రక్తం కారడం ఆగిపోతుంది.


10. చెవినొప్పి ( కర్ణ శూల ) తగ్గడానికి 


ఉల్లిపాయల రసం  -  5 ,6 చుక్కలు

రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవిలో పోయాలి.


ఉపయోగాలు -  చెవినొప్పి తగ్గుతుంది.


11 .అల్బుమిన్ పోవుట తగ్గుటకు


ఉల్లి రసం
ఏలకుల పొడి

పై రెండింటిని కలిపి తాగాలి.


ఉపయోగాలు  -  అల్బుమిన్ ఎక్కువగా పోవడం తగ్గుతుంది.
12 . కాళ్ళు పగిలితే ( AYURVEDIC RECIPE FOR CRACKED LEGS )

ఉల్లి బద్దను ఆ పగుళ్ళ మీద రాయాలి

ఉపయోగాలు  -  కాళ్ళు మృదువుగా మారతాయి.

13 .చెవిలో ధ్వనులు తగ్గుటకు ( AYURVEDIC RECIPE FOR TINNITUS ( RINGING SOUNDS IN THE EAR ))

ఉల్లి రసం
దూది

దూదిని ఉల్లి రసంలో ముంచి చెవిలోపెట్టుకోవాలి.

ఉపయోగాలు  - చెవిలో రింగ్ మనే ధ్వని తగ్గిపోతుంది.

14. దోమలు రాకుండా ( TO AVOID MOSQUITO PROBLEM )
నీరుల్లిపాయలు

ఉల్లిపాయలను చితక్కొట్టి మంచం వద్ద పెడితే దోమలు రావు. 



15 . బాలింతలకు పాలు పెరగాలంటే ( MILK IMPROVEMENT IN THE LACTATING MOTHERS )
ఉల్లిపాయలు
మెంతికూర
కొబ్బరి బెల్లం
పై వాటితో చేసిన కిచిడీ ని నెల్లాళ్ళపాటు తినాలి.

ఉపయోగాలు - తల్లులలో పాలు పెరుగుతాయి.

16 .చిన్నపిల్లల నులిపురుగుల సమస్యకు ( AYURVEDIC RECIPE FOR CHILDREN STOMACH WORMS )

ఉల్లి రసం - టీ స్పూన్
వెనిగర్  -  టీ స్పూన్
తేనె  - తగినంత

పై వాటిని కలిపి వారం రోజుల పాటు  రాత్రిపూట నాకించాలి.

ఉపయోగాలు  - నులిపురుగుల సమస్య తగ్గిపోతుంది.


17. దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, బ్రాంఖైటిస్ ( రొమ్ము పడిశం ) ( AYURVEDIC RECIPE FOR COUGH,BRONCHITIS ETC LUNG DISEASES )

ఉల్లిపాయ
పంచదార

ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ,అందులో తగుమాత్రం పంచదార కలిపి ,రాత్రంతా కదల్చకుండా ఉంచితే దానిపై ఒక చిక్కని ద్రవం ఏర్పడుతుంది. దాని పై తేటను తీసుకుని ,రోజుకు మూడుసార్లు చొప్పున సేవిస్తుండాలి.

ఉపయోగాలు  - పై సమస్యలు తగ్గుతాయి. 


18. తాత్కాలిక నపుంసకత్వం తగ్గుటకు ( AYURVEDIC RECIPE FOR TEMPORARY IMPOTENCY )

i.)
ఉల్లిపాయ రసం  - ఒక కప్పు
తేనె  -  కొద్దిగా

పై వాటిని కలిపి బాగా మరగ కాచి భద్రపరచుకోవాలి.

రోజుకొక చెంచా చొప్పున ప్రతిరోజూ ఆరునెలల పాటు సేవించాలి.

ఉపయోగాలు  -  తాత్కాలిక నపుంసకత్వం తగ్గిపోయి అంగం స్తంభిస్తుంది. 


ii.)

ఉల్లి రసం  -  3 స్పూనులు
అల్లపు రసం  -  2 స్పూనులు
తేనె  -  2 స్పూనులు
నెయ్యి  -  2 స్పూనులు
చింత గింజల పొడి   -  20 గ్రాములు
పై అన్నింటిని కలిపి  సరిగా  వంద రోజులపాటు  క్రమం తప్పకుండా లోపలికి తీసుకుంటుండాలి.

ఉపయోగాలు  - పుట్టుకతోనే నపుంసకులు కాని వారికి , సెక్స్ పట్ల అనాసక్తత కలిగినవారికి ,రతి సామర్థ్యం తీవ్రమైన స్థాయిలో  కలిగంచి రతి పట్ల అనురక్తుల్ని చేయగలదు. స్త్రీలకు సెక్స్ లో జడత్వం  కూడా దీనితో నయం కాగల అవకాశం ఉంది.  


19 . గాయం సెప్టిక్ కాకుండా ( AYURVEDIC RECIPE TO AVOID SEPTIC OF THE WOUND )

నువ్వుల నూనె
ఉల్లిపాయ

నూనెను వేడి చేస్తూ , కొద్దికొద్దిగా ఉల్లిపాయను కలుపుతూ  ,పొగ వచ్చే దాకా వేడి చేయాలి.దీనిని గాయం పైన వేసి కట్టు కట్టాలి.

ఉపయోగాలు  -  గాయం సెప్టిక్ కాదు.  


20 . రక్త మొలలు, అజీర్ణం, నులిపురుగుల సమస్య తగ్గుటకు.

ఉల్లిపాయ ముక్కలు
వెనిగర్ - కొంచెం
రాతి ఉప్పు  - కొంచెం
కొత్తి మీర  - కొంచెం

ముక్కలను బాగా ఉడికించి , వెనిగర్, రాతి ఉప్పు , కొత్తి మీరలను కలిపి  20 రోజుల పాటు ప్రతి రోజూ తీసుకోవాలి.

ఉపయోగాలు  -  రక్త మొలలు, అజీర్ణం, నులిపురుగుల సమస్య తగ్గుతాయి.


21  . వడదెబ్బ సమస్యకు (  AYURVEDIC RECIPE FOR SUNSTROKE )

పచ్చి మామిడి కాయలు  -  2
పెద్ద ఉల్లి పాయలు  - 2
ఉప్పు  - చిటికెడు      

మామిడి కాయలను , ఉల్లిపాయలను  కలిపి దంచి రసం తీసి  , చిటికెడు ఉప్పు చేర్చి తీసుకోవాలి.

ఉపయోగాలు  -  వడదెబ్బ ప్రభావం తగ్గిపోతుంది. 

నిమ్మతో.. ఆయుర్వేద ఉపయోగాలు


1 . ఒళ్ళు తగ్గడానికి

గోరు వెచ్చని నీరు  -  1 గ్లాసు
ఒక నిమ్మకాయ రసం
కొంచెం ఉప్పు

రోజూ పరగడుపున  పై వాటిని కలిపి తాగాలి.

ఉపయోగాలు  -  ఊబకాయం తగ్గి సన్న బడతారు.

2. లావు పెరగకుండా బరువు పెరగడానికి (  FOR WEIGHT IMPROVEMENT WITHOUT FAT )

నిమ్మ రసం - 1 స్పూను
తేనె - 1 స్పూను

పై వాటిని కలిపి రోజూ తీసుకోవడం వల్ల లావు పెరగకుండా , బరువు మాత్రమే పెరిగే అవకాశం ఉంది.


3 . తెల్లని పలువరస కొరకు (  FOR WHITE TEETH )


ఉప్పు - కొంచెం
నిమ్మ రసం  - కొంచెం
పసుపు  -  కొంచెం


పై వాటిని కలిపి  వారానికి  రెండు సార్లైనా  పళ్ళు తోముకుంటే తెల్లని పలువరుస సాధ్యం.


4 . మెరిసే  దంతాల కొరకు  (  FOR BRIGHT TEETH )


నిమ్మ రసం

రోజూ బ్రష్ చేసుకునే ముందు  బ్రష్ పై  కాస్త  నిమ్మ రసం పిండుకొని , ఆ పైన టూత్ పౌడర్ ను గాని, పేస్టును గాని వేసి  పళ్ళు తోముకోవాలి.


ఉపయోగాలు  - దంతాలకు  చక్కని మెరుపు వస్తుంది.


5 . ప్రయాణాల్లో వాంతులతో బాధపడే  వారికి (  RECIPE FOR VOMITING SENSATION DURING JOURNEY )


నిమ్మ కాయను  వాసన చూడడం , నిమ్మ చెక్కను కొద్ది కొద్దిగా  చప్పరిస్తూ ఉండడం చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి.

16, జనవరి 2012, సోమవారం

తమలపాకుల తో డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు




COMMON NAMES -


telugu - తమలపాకు తీగ చెట్టు 
english - betel leaves
hindi - పాన్ 
sanskrit - తాంబూలి,నాగవల్లి

1 . కురుపులు , కత్తి గాయాలు తగ్గుటకు ( FOR BOILS ,KNIFE WOUNDS )

తమలపాకుల రసం

ఆకులను దంచి రసం తీసి ,గాయాలపైన పోసి ,తమలపాకులతో కట్టు కట్టాలి.

uses - కురుపులు , కత్తి గాయాలు తగ్గిపోతాయి.

2 .గొంతు బొంగురు తగ్గడానికి ( FOR VOICE DISTURBANCE )

తమలపాకు తీగ వేరు చిన్న ముక్క 

వేరు ముక్కను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తుండాలి 

uses - గొంతు బొంగురు తగ్గిపోయి ,చక్కటి గొంతు వస్తుందీ

3 . శరీరం చేదు వాసన తగ్గుటకు ( FOR BAD BODY ODOUR )

తమలపాకులు - 1 భాగం
కరక్కాయ బెరడు - 1 భాగం
చెంగల్వకోష్ట్ - 1 భాగం

పై అన్నింటిని పొడి చేసి కలిపి ,3 gm పొడి ని రెండు పూటలా మంచి నీటితో సేవించాలి.

uses - దుర్వాసన తగ్గిపోయి శరీరం ఘుమ ఘుమ లాడుతుంది

4 . నోటి దుర్వాసన తగ్గుటకు ( FOR BAD MOUTH ODOUR )

తమలపాకు తీగ వేర్లు - 5 gm
తుంగ గడ్డలు - 5 gm

పై వాటిని కలిపి మెత్తగా నూరి , తర్వాత కొంచెం తేనె కలిపి మళ్ళీ నూరి , బటాని గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. అవసరమైనప్పుడల్ల 1 ,2 మాత్రలు బుగ్గన పెట్టుకొని చప్పరిస్తుండాలి.

uses - నోటి చెడు వాసన తగ్గిపోయి నోరు ఘుమ ఘుమ లాడుతుంది.

5 . అధిక ఆవలింతలు తగ్గుటకు ( FOR EXCESSIVE YAWNING )

తమలపాకులు

తమలపాకులతో తయారుచేసిన తాంబూలం వేసుకోవాలి

uses - అకారణంగా మాటిమాటికి వచ్చే ఆవలింతలు తగ్గిపోతాయి

6  .  శరీర బలానికి, మనసు ప్రసన్నత కు (  FOR BODY STRENGTH AND GOOD MOOD )

100 తమలపాకుల రసం  (  1 betel leaves juice )
పటిక బెల్లం పొడి  ( sugar candy powder )  -  120 gm

100  తమలపాకులను దంచి వడపోసి రసం తీయాలి. పటిక బెల్లం పొడి కలిపి కరిగించి సన్న మంటపైన తీగ పాకం వచ్చేవరకు మరిగించి దించి గాజు పాత్రలో నిలువ ఉంచుకోవాలి.

రోజు రెండు పూటలా పూటకు ఒకటి లేదా రెండు చెంచాల పాకాన్ని అర గ్లాసు మంచినీటిలో కలిపి తాగుతూ ఉండాలి.

uses  -  చాలా రుచికరంగా ఉండి శరీరానికి బలాన్ని మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

7 . స్త్రీల స్థనాల వాపు , పోటు తగ్గుటకు  (  FOR WOMEN  BREAST SWELLING AND PAIN )

తమలపాకులు

పురిటి లోనే బిడ్డలు చనిపోయిన స్త్రీలకు తల్లిపాలు స్థనాలలో పేరుకుపోయి బాధ కలుగుతుంది. మరికొంతమందికి గర్భాశయ సమస్యల వల్ల స్థనాలలో గడ్డలు పుట్టడం లేదా పాలు గడ్డ కట్టడం, వాపు రావడం, పోటు పుట్టడం జరుగుతుంది. అలాంటివారు తమలపాకులను నిప్పు సెగ పైన కొంచెం వేడిిి చేసి స్థనాల  పైన కట్టు కడుతుండాలి.

uses  -   స్థనాల వాపు, పోటు తగ్గిపోవడమే కాకుండా, వాటి అంతట అవే కారిపోయే పాలు కూడా కట్టుకుంటాయి.

8  .  గొంతు వాపు ,పోటు తగ్గడానికి  (  FOR THROAT SWELLING AND  THROAT PAIN )

తమలపాకుల రసం  -  2 స్పూన్స్

తమలపాకులు దంచి తీసిన రసం రెండు చెంచాల మోతాదుగా రోజు మూడు లేదా నాలుగు పూటలా మెల్లమెల్లగా తాగుతుండాలి.

uses  -  గొంతు పుండు , వాపు తగ్గిపోతాయి

9 . రేచీకటి వ్యాధి తగ్గుటకు  (  FOR NIGHT BLINDNESS )

తమలపాకు రసం (  betel leaves juice )

ఆకు దంచి రసం తీసి వడ పోయాలి. రాత్రి నిద్రించే ముందు రెండు చుక్కల రసం కళ్ళల్లో వేసుకుని తర్వాత నీటితో కళ్ళు కడగాలి.

uses  -  వారం రోజుల్లో రేచీకటి తగ్గిపోతుంది

10 . పసి పిల్లల జలుబు తగ్గుటకు  (  FOR LITTLE CHILDREN COLD )

తమలపాకులు (  betel leaves )
ఆముదం

ఆకులకు ఆముదం రాసి నిప్పుల పైన వేడిచేసి నులివెచ్చగా ,బిడ్డల రొమ్ము పైన, పొట్ట పైన, తల పైన ఆకులను వేసి కట్టు కడుతూ ఉండాలి.
.uses  -  జలుబు , రొమ్ము, పడిశం తగ్గి పోతాయి.

ఉమ్మెత్త తో.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు




COMMON NAMES -


telugu - ఉమ్మెత్త చెట్టు 
english - దతూర 
hindi - దతూర , తతుర 
sanskrit - ఉన్మత్త ,దత్తూర

1 . ఉబ్బసం ,దగ్గు మొదలైన శ్వాస రోగాలు తగ్గడానికి ( FOR ASTHMA ,COUGH LIKE LUNG DISEASES )

ఎండిన ఉమ్మెత్త ఆకులు 

చిలుము గొట్టం / హుక్కాలో పొగాకు బదులుగా ఉమ్మెత్త ఆకులు వేసి అంటించి పొగను పీల్చాలి.

uses - దగ్గు , దమ్ము,ఆయాసం,ఉబ్బసం తగ్గిపోతాయి.

2 . తలలో కురుపులు తగ్గడానికి ( FOR BOILS IN THE HEAD )

నల్ల ఉమ్మెత్త ఆకులు
ఆముదం

ఆకులను నలగగొట్టి ,ఆముదంతో నూరి ఉడకబెట్టి ఆ ముద్దను కురుపుల పైన లేపనం చేయాలి.

uses -  తల కురుపులు తగ్గి పోతాయి.

3 . కాళ్ళ పగుళ్లు తగ్గడానికి ( FOR LEG , FOOT  CRACKS )

ఉమ్మెత్త విత్తనాలు - 1 భాగం 
నల్ల నువ్వులు - 1 భాగం
పసుపు - 1 భాగం

పై అన్నింటినీ కలిపి మెత్తగా నూరి ఉంచుకోవాలి .రోజు రాత్రి నిద్రించే ముందు, కొద్ది పొడి తీసుకుని తగినంత గేదె వెన్న కలిపి పగుళ్లకు లేపనం చేస్తుండాలి.

uses - క్రమంగా పగుళ్లు ,పుండ్లు , ఒరుపులు తగ్గిపోయి పాదాలు అందంగా తయారవుతాయి

4 . అన్ని చెవి రోగాలకు ( FOR ALL EAR PROBLEMS )

ఉమ్మెత్త ఆకు రసం - 100 gm
నువ్వుల నూనె - 20 gm
జిల్లేడు ఆకులు - 7 

 రసం, నూనె కలిపి చిన్న మంటపైన మరిగిస్తూ దానిలో ఏడు జిల్లేడు ఆకులు వేయాలి రసాలన్నీ ఇగిరిపోయి తైలం మిగలగానే దించి వడపోసి నిలువ ఉంచుకోవాలి. రెండు, మూడు చుక్కల తైలం గోరువెచ్చగా చేసి చెవిలో వేస్తుండాలి.

uses -  చెవికి సంబంధించిన అన్ని సమస్యలు తగ్గిపోతాయి.

5 . వీర్య స్థంభన కొరకు ( FOR PENIS ERECTION )

నల్ల ఉమ్మెత్త వేరు 
మంచి నీరు 

వేరును నీటితో సానరాయిపై అరగదీయాలి .గంధాన్ని అంగానికి లేపనం చేసుకొని ఆరిన తర్వాత సంభోగంలో పాల్గొనాలి.
.
uses - ఎక్కువ సేపు అంగం స్తంభిస్తుంది.

6 . గొంతు గడ్డలు ( గండ మాల ) తగ్గుటకు ( CYSTS ON THE THROAT )

నల్ల ఉమ్మెత్త ఆకు ( black coloured dathura leaves )  - 1 భాగం
ఆవు పేడ  ( cow dung )  -  1 భాగం 

ఆకును నలగగొట్టి, ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి ఉడకబెట్టి దానిని గోరువెచ్చగా గండమాలల పైన వేసి కట్టు కడుతుండాలి.

uses  - ఆపరేషన్ అవసరం లేకుండా గడ్డలు పగిలి మానిపోతాయి

7 . నారి కురుపులు తగ్గుటకు  (  FOR BOILS )

ఉమ్మెత్త ఆకులు ( datura leaves )
నూనె ( oil )

ఆకులకు నూనె రాసి, వేడి చేసి కురుపుల పైన వేసి కట్టు కట్టాలి.

uses  -  నారి కురుపులు నశించిపోతాయి.

8 . అన్ని రకాల వాపులు తగ్గుటకు  (  FOR ALL TYPES OF BODY SWELLINGS , JOINT PAINS, BURNS  )

ఉమ్మెత్త ఆకులు  (  dathura leaves )
ఆముదం ( castor oil )

ఆకులకు ఆముదం రాసి ,కొంచెం వెచ్చగా చేసి వాపుల పైన వేసి కట్టు కడుతుండాలి.

uses  - అన్ని రకాల వాపులు, కీళ్ల నొప్పులు, మంటలు తగ్గిపోతాయి.

9 . మలేరియా జ్వరం ( చలి జ్వరం ) తగ్గుటకు ( RECIPE FOR MALARIA FEVER )

తెల్ల ఉమ్మెత్త చెట్టు వేరు

ఆదివారం నాడు తెల్ల ఉమెత్త చెట్టుకు పూజ చేసి విధిపూర్వకంగా దాని వేరును తీసుకొచ్చి మలేరియా జ్వరంతో బాధ పడే రోగి కుడి చేతికి  దారంతో  కట్టు కట్టాలి.

ఉపయోగాలు  - ఒక్క రోజులో జ్వరం మాయమవుతుంది.

10 . అరికాళ్ళ మంటలు తగ్గడానికి (  AYURVEDIC RECIPE FOR FOOT BURNS )

నల్ల ఉమ్మెత్తాకు రసం
దొండాకు రసం
చిక్కుడాకు రసం

పై వాటిని సమంగా కలిపి అరికాళ్ళకు మర్దనా చేస్తుండాలి.

ఉపయోగాలు  -  అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి.

ఊడుగ చెట్టుతో.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు




COMMON NAMES -


telugu - ఊడుగ చెట్టు 
english - sage leaved alangium
hindi - తేరా , డేరా 
sanskrit - అంకోలా 


దీని వేరు చెక్క మిక్కిలి చేదుగా , వెగటుగా, కారంగా ఉండి వేడి చేస్తుంది. రక్త విరేచనాలు , క్రిమి రోగం , కుష్టు ,వ్రణాలు,సుఖరోగాలు, చర్మ రోగాలు, వుడువని జ్వరాలు, ఉబ్బు రోగాలు, పాము విషం, పిచ్చి కుక్క విషం, ఎలుక విషం మొదలైన అనేక సమస్యలను అద్భుతంగా నివారిస్తుంది. మొండి చర్మ రోగాలకు ఇది పెట్టింది పేరు,ఐతే ,తెలియకుండా అజాగ్రత్తగా వాడ కూడదు.ఇది అతి బలమైన చెట్టు,కాబట్టి రోగి బలాన్ని బట్టి చాలా కొద్ది మోతాదుగా మాత్రమే ఇస్తూ వాడుకోవాలి.


1 . ఎలుక విషం విరిగిపోవడానికి( FOR RAT POISON )


ఊడుగ వేరు 
గొర్రె మూత్రం
ఆవు నెయ్యి - 1 స్పూన్

ఊడుగ వేరునుగొర్రె మూత్రంతో మెత్తగా నూరి రసం పిండాలి .ముద్దను కాటు పైన వేసి కట్టు కడుతూ, రసాన్ని నాలుగైదు చుక్కల మోతాదుగా మాత్రమే ఒక స్పూన్ ఆవు నెయ్యి కలిపి సేవించాలి.
uses - ఎలుక విషం విరిగిపోతుంది.

2 . సుఖ రోగపు పుండ్లు , మచ్చలు తగ్గడానికి ( FOR WOUNDS AND MARKS OF SEXUAL DISEASES )

ఊడుగ వేరు పొడి - 1 భాగం
శుద్ధి చేసిన మహిసాక్షి గుగ్గిలం పొడి - 1 భాగం


పై వాటిని కలిపి బఠానీ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. రోజు రెండు పూటలా ఒక మాత్ర మంచినీటితో సేవిస్తుండాలి.

uses - సుఖరోగాల వల్ల కలిగిన పుండ్లు ,మచ్చలు మాడిపోతాయి.

3 . శరీరం చెడిన వారికి ( FOR SPOILED BODY )

ఊడుగా వేరు పై బెరడు పొడి - 2 చిటికెలు
తేనె - 1 చెంచా

పై వాటిని కలిపి , రెండు పూటలా ఆహారానికి 1 గంట ముందు సేవించాలి.

uses -  ఈ కారణం వల్ల చెడిపోయిన శరీర తత్వమైన తిరిగి బాగుపడుతుంది. శరీరానికి బలం వస్తుంది.

4 . అర్శ మొలలు తగ్గడానికి( FOR PILES )

ఊడుగ వేరు బెరడు - 30 gm
దోరగా వేయించిన మిరియాలు - 10 gm

పై వాటిని కలిపి కొంచెం మెత్తగా నీటితో నూరి బటాని గింజలంత గోలీలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. .పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచిిినీటితో సేవించాలి.

uses - 40 రోజుల్లో మొలలు కరిగిపోతాయి


5 . తేలు కాటు కొరకు ( FOR SCORPION BITE - POISON )

ఊడుగ గింజలు - 1 భాగం
ముషిని చెట్టు గింజలు - 1 భాగం
పొంగించిన ఇంగువ - 1 భాగం
అశ్వగంధ దుంపలు - 1 భాగం
గచ్చకాయల లోపలి పప్పు - 1 భాగం
చిత్రమూలం వేరు పై బెరడు - 1 భాగం
తెల్ల జిల్లేడు వేరు పై బెరడు - 1 భాగం
జిల్లేడు పాలు - తగినంత
పై అన్నింటినీ కలిపి మెత్తగా నూరి చిటికెన వేలంతా బారుగా కనికలు చేసి నీడలో బాగా గాలికి ఆరబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత నిలువ చేసుకోవాలి. తేలు పుట్టినప్పుడు ఈ కనికను నీటితో అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట పోసి గుడ్డ పొగ వేయాలి.

uses -  క్షణంలో తేలు విషము విరిగిపోతుంది.

6 . కాటుకలో పెట్టిన విషం విరిగిపోవడానికి

ఊడుగ పువ్వులు

 పువ్వులను బట్టలో వేసి మూసిన కళ్ళ పైన పెట్టి కొద్దిసేపు ఉంచి తీసిిిిిివేస్తుండాలి.

uses  -  విషం విరిగిపోతుంది.

7 . కుక్క కాటు విషం విరుగుటకు (  FOR DOG BITE  )

ఊడుగ వేరు  ( root of sage leaved alangium )
ఆవు పాలు ( cow milk )

వేరును పాలతో నూరి బట్టలో వడగట్టి రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా రోగి శరీర బలాన్ని బట్టి సేవిస్తుండాలి.

uses  -  కుక్క కాటు విషం విరిగిపోతుంది.

8 . ఉబ్బసం  తగ్గుటకు  ( FOR ASTHMA )

ఊడుగ లేత చిగుర్లు ( young shoots )

చిగుర్లను మెత్తగా నూరి శనగ గింజంత గోలీలు కట్టి గాలికి ఆరబెట్టాలి. రోజు రెండు పూటలా ఆహారానికి పావుగంట ముందు ఒక గోలి మంచినీటితో వేసుకోవాలి.

uses  -  ఉబ్బసం,క్షయ అన్ని రకాల దగ్గులు తగ్గిపోతాయి.

* ఈ గోళీలు వేసుకుంటే ఎవరికీ ఇమడక వాంతి అవుతుందో వారు ఆవు నేతితో కలిపి 20 రోజులు వాడుకోవచ్చు.

9 . సర్వ విషాలు తగ్గుటకు( RECIPE FOR SNAKE AND OTHER POISONS )

తెల్ల ఊడుగ చెట్టు వేరు ముక్కలు

చెట్టుకు పూజ చేసి చిన్న వేరు ముక్కను తెచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న సీసాలో పోసి నిలువ చేసుకోవాలి.

పాములున్న ప్రాంతాలలో తిరిగేవారు ఆ సీసాను జేబులో పెట్టుకోవచ్చు. ఏ విషజంతువైనా కాటు వేస్తే వెంటనే ఒక చిన్న ముక్కను నొట్లో వేసుకుని బుగ్గన పెట్టి,నిదానంగా నములుతూ ఆ రసం మింగుతుండాలి.

ఉపయోగాలు  -  విషం హరించిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా కూడా ఉపయోగపడి ప్రాణాలను కాపాడుతుంది.  

10 . వాత నొప్పులు , వాపులు తగ్గుటకు( FOR BODY PAINS AND SWELLINGS )

ఊడుగ ఆకులు

ఆకులను ముద్దలాగా నూరి నొప్పులపైన వేసి బట్టతో కట్టు కడుతూ ఉండాలి.

ఉపయోగాలు  - నొప్పులు , వాపులు తగ్గిపోతాయి.


11 . సమస్త చర్మ రోగాలు తగ్గుటకు (  FOR ALL TYPES OF SKIN DISEASES )

తెల్ల ఊడుగ చెట్టు వేర్ల బెరడు పొడి
జాజికాయ పొడి
జాపత్రి పొడి
లవంగాల పొడి

పై నాల్గింటిని సమాన భాగాలుగా కలిపి పలుచని నూలు బట్టలో వస్త్ర ఘాళితం చేసి నిలువ ఉంచుకోవాలి.

పూటకు 1 గ్రాము మోతాదుగా , 1 చెంచా తేనె తో కలిపి , వ్యాధి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు పూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అలవాటైన తర్వాత క్రమంగా కొద్ది కొద్దిగా పెంచుతూ 1  గ్రాము నుండి 2 లేక 2 1/2  గ్రాముల చూర్ణం వరకు పెంచుకుంటూ వాడుతుండాలి.

ఉపయోగాలు  - అన్ని రకాల చర్మ రోగాలు క్రమంగా అద్రుశ్యమై పోయి చర్మ సౌందర్యం కల్గుతుంది.

ఖర్జూరపు చెట్టుతో.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు




COMMON NAMES -


telugu - ఖర్జూరం పండు 
english - date fruit
hindi - sulemani chokra
sanskrit - ఖర్జూ, రాజ ఖర్జూరి, పెండ ఖర్జూరి,భూఖర్జురి

ఖర్జూరంలో ఎండు ఖర్జూరం, పిండఖర్జూరం, రాజ ఖర్జూరం అనే రకాలున్నాయి.ఇది వేడి చేసి మేహ శాంతినిస్తుంది. ఆలస్యంగా జీర్ణమవుతుంది. బలం, వీర్య వ్రుద్ధి చేస్తుంది  పైత్యం , మొలలు , అతిసారం, జ్వరం, తాపం, దాహం, వాతం, పాండురోగం, కఫం, ఉబ్బసం, దగ్గు, క్షయ పోగొట్టి గుండె , మూత్ర పిండాలకు బలమిస్తుంది.

1 . నడుం నొప్పి తగ్గుటకు ( FOR LUMBAGO )

ఎండు ఖర్జూరం కాయ 
గుగ్గిలం పొడి
గోధుమ పిండి
పాలు - 1 కప్

ఖర్జూరపు కాయలోని గింజలు తీసివేసి, ఆ కాయ లోపల శుద్ధి చేయబడిన గుగ్గిలం పొడిని నింపి కాయను మూసి పైన గోధుమపిండితో మెత్తి ఆ కాయలను నిప్పులపైన ఎర్రబడే వరకు పొర్లించి తీసి పిండిని గీకివేసి కాయతో పాటు గుగ్గిలాన్ని మెత్తగా నూరి ఒక గ్రాము బరువు ఉండే గోలీలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. రోజు రెండు పూటలా ఒక మాత్ర ఒక కప్పు పాలతో సేవిస్తుండాలి

uses - ఏ విధమైన నడుము నొప్పి అయినా 20 రోజులలో తగ్గిపోతుంది.

2 . అతి సంభొగంతో క్షీణించిన పురుషులకు( FOR WEAK MEN DUE TO EXCESSIVE SEX )

గింజలు తీసేసిన ఖర్జూరపు పండ్లు - 20 gm
మర్రి ఊడల కొనలు- 10 gm
పాలు - 1/4 లీటరు

పండ్లు, కొనలు మెత్తగా నూరి పాలలో వేసి మరగబెట్టి రెండు పూటలా సేవిస్తుండాలి.

uses - వీర్య హీనత హరించిపోయి ,వీర్యవృద్ది కలుగుతుంది.

3 . రక్త వృద్ధి,శక్తి వృద్ధి  కొరకు , నోటి నుండి రక్తం పడుట తగ్గుటకు (  FOR BLOOD IMPROVEMENT AND TO STOP BLEEDING THROUGH MOUTH )

ఎండు ఖర్జూరం కాయల ముక్కలు - 1 భాగం
సీమ బాదం పప్పు ముక్కలు - 1 భాగం
ఎండు ద్రాక్ష పండ్లు - 1 భాగం
పటిక బెల్లం - 1 భాగం
పట్టు తేనె 

పై వాటిని ఒక పాత్రలో వేసి అన్ని మునిగే వరకు పట్టు తేనె పోసి పైన మూత పెట్టి గుడ్డ వేసి తాడుతో బిిిిగించి కదిలించకుండా 21 రోజులు ఉంచాలి. ఆ తర్వాత అందులోని పదార్థాన్ని వేరే గాజు పాత్రలోకి మార్చుకొని పూటకు 10 గ్రాముల మోతాదుగా ఆహారానికి గంట ముందు తింటూ ఉండాలి.

uses - అమితమైన శక్తి, రక్త వృద్ధి కలుగుతాయి. ఇదే పొడిని సేవిస్తే నోటి నుండి రక్తం పడడం ఆగిపోతుంది.

4 . పొట్ట ఉబ్బరం తగ్గడానికి ( FOR GASTRITIS )

ఖర్జూర పండులోని గింజ 

గింజను ఎల్లవేళలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ దాని రసాన్ని మింగుతూ ఉండాలి.

uses - పొట్ట ఉబ్బరం తగ్గిపోతుంది.

5 . కడుపు ,ప్రేగులోని పురుగుల సమస్యకు ( FOR STOMACH AND INTESTINE WORMS )

గింజలు తీసిన ఖర్జూరపు పండ్లు - 3
3 నిమ్మ పండ్ల రసం 

పై వాటిని కలిపి మెత్తగా నూరి కొద్దిి కొద్దిగా రోజంతా తింటూ ఉండాలి.

uses - క్రిములు చచ్చి పడిపోతాయి

6 . ఎక్కిళ్ళు తగ్గడానికి  ( FOR HICCOUGHS )

ఖర్జూర పండు ( date fruit )

ఖర్జూర పండు బుగ్గన పెట్టుకొని చప్పరిస్తుండాలి.

uses  -  ఎక్కిళ్ళు తగ్గిపోతాయి

7 . కంటి పువ్వులు తగ్గడానికి  (  FOR CATARACT )

ఖర్జూర గింజ (  date seed )
తేనె ( honey )

ఎండు ఖర్జూరం పండులో ఉండే గింజను తీసి శుభ్రంగా కడిగి ఎండబెట్టి రోజు రాత్రి నిద్రించే ముందు ఆ గింజను సాన రాయి మీద తేనెతో అరగదీసి కంది బద్ద అంత గంధాన్ని కళ్ళలో పెట్టుకుంటుండాలి.


uses  -  కంటి పూలు కరిగిపోతాయి

8 . వీర్య బలం , వీర్య స్థంభన కొరకు ( FOR STRONG PENIS ERECTION )

ఎండు ఖర్జూర పండు ముక్కలు ( dry date fruit pieces )
నాటు ఆవు నెయ్యి ( cow ghee )

ఎండు ఖర్జూర కాయలను పగుల కొట్టి లోపలిిిిి గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేసి అవి మునిగే వరకు నాటు ఆవు నెయ్యి పోయాలి .ఆ పాత్రను 21 రోజులపాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత పూటకు రెండు ముక్కలు రెండు పూటలా నేయితో తింటుుండాలి.

uses  -  అమితమైన వీర్య బలం కలిగి రతిలో వీర్యం స్తంభిస్తుంది.

9 . ఆగిన బహిష్టు మరలా వచ్చుటకు ( RECIPE FOR ABSENT MENSUS )

గింజలు తీసిన ఎండు ఖర్జూరాల పొడి  -  100 గ్రాములు
ఓమ ( వాము )పొడి - 100 గ్రాములు 
శొంఠి పొడి - 100 గ్రాములు

శొంఠి , ఓమ లను వేయించి , దంచి పొడి చేయాలి.మొత్తం చూర్ణాలను కలిపి నిలువ ఉంచుకోవాలి.

రెండు పూటలా అర చెంచా నుండి  1 చెంచా వరకు చూర్ణాన్ని ఒక కప్పు వేడి పాలలో కలుపుకొని తాగుతుండాలి.

ఉపయోగాలు  -  బహిష్టు మరలా వస్తుంది.

10 . తల రోగాలు ,అతి వేడి , నరాల బాధలు తగ్గడానికి ( RECIPE FOR HEAT IN THE BRAIN , NERVOUS PROBLEMS, BRAIN DISEASES ETC )

గింజలు తీసిన ఎండు ఖర్జూరం పండ్లు  - 30 గ్రాములు
దోరగా వేయించిన గసగసాల పొడి  - 30 గ్రాములు
బాదం పప్పు పొడి  - 20 గ్రాములు
చిన్న ఏలకుల గింజల పొడి - 5 గ్రాములు
పటిక బెల్లం పొడి  - 50 గ్రాములు
ఆవు నెయ్యి  - 70 గ్రాములు

పై అన్నింటిని కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి.

రోజూ పూటకు ఉసిరి కాయంత ముద్ద రెండు పూటలా తింటూ ఉండాలి.

ఉపయోగాలు  -   అతి వేడి , తల రోగాలు , నరాల బాధలు , మెదడు రోగాలు , ఉడుకు రోగాలు  తగ్గుతాయి.

11 . అన్ని రకాల నీళ్ళ విరేచనాలు తగ్గుటకు (  RECIPE FOR ALL TYPES OF LOOSE MOTIONS )

ఖర్జూరపు గింజల బూడిద - 1 లేక 2 గ్రాములు
కండ చక్కెర పొడి  -  అర చెంచా

ఖర్జూరపు కాయలలోని గింజలను కాల్చి బూడిద చేసి , ఆ బూడిదను కండ చక్కెర తో కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి.

ఉపయోగాలు  -  3 రోజుల్లో అన్ని రకాల నీళ్ళ విరేచనాలు కట్టుకుంటాయి.

12 .గొంతు బొంగురు తగ్గడానికి ( RECIPE FOR DISTURBED VOICE )

ఎండు ఖర్జూరం పండు ( dry date fruit )
పాలు ( milk )

పండును విత్తనాలు తీసి నలగగొట్టి , పాలలో వేసి ,మరగబెట్టి , దించి చల్లర్చిన తర్వాత , ఆ పాలు కొద్ది కొద్దిగా తాగుతుండాలి.

ఉపయోగాలు  -  గొంతు బొంగురు తగ్గిపొయి , గొంతు బాగా , చక్కగా , శ్రావ్యంగా తయారవుతుంది.

13  .  స్త్రీల అతి ఋతు రక్త స్రావం తగ్గుటకు (  RECIPE FOR EXCESSIVE MENSUS BLEEDING )

గింజలు తీసిన ఖర్జూరపు పండ్లు( seedless dried date fruits )  - 10 గ్రాములు
ఎండు ద్రాక్ష పండ్లు (  kissmiss ) -  10 గ్రాములు
చలువ మిరియాలు  (  peppers ) -  10 గ్రాములు
కండ చక్కెర  (  sugar candy powder ) -   10 గ్రాములు

పై అన్నింటిని మెత్తగా దంచి , కలిపి , పూటకు ఒక మోతాదుగా , రెండు పూటలా తిని మంచి నీరు తాగుతుండాలి.

ఉపయోగాలు  -  స్త్రీల ఎర్ర  కుసుమ రోగం తగ్గిపోతుంది

14  .  మూత్రం ధారాళంగా వచ్చుటకు (  RECIPE FOR FREE FLOW OF URINE )

ఖర్జూరపు గింజల గంధం  - 2 గ్రాములు
నీరు  -  అరగ్లాసు

గింజలను  సానరాయి పైన నీళ్ళతో అరగదీసి ఆ గంధం 2 గ్రాముల మోతాదుగా అరగ్లాసు నీటిలో కలిపి  తాగుతుండాలి.

ఉపయోగాలు  - మూత్రం ధారాళంగా వస్తుంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...