COMMON NAMES -
telugu - ఊడుగ చెట్టు
english - sage leaved alangium
hindi - తేరా , డేరా
sanskrit - అంకోలా
దీని వేరు చెక్క మిక్కిలి చేదుగా , వెగటుగా, కారంగా ఉండి వేడి చేస్తుంది. రక్త విరేచనాలు , క్రిమి రోగం , కుష్టు ,వ్రణాలు,సుఖరోగాలు, చర్మ రోగాలు, వుడువని జ్వరాలు, ఉబ్బు రోగాలు, పాము విషం, పిచ్చి కుక్క విషం, ఎలుక విషం మొదలైన అనేక సమస్యలను అద్భుతంగా నివారిస్తుంది. మొండి చర్మ రోగాలకు ఇది పెట్టింది పేరు,ఐతే ,తెలియకుండా అజాగ్రత్తగా వాడ కూడదు.ఇది అతి బలమైన చెట్టు,కాబట్టి రోగి బలాన్ని బట్టి చాలా కొద్ది మోతాదుగా మాత్రమే ఇస్తూ వాడుకోవాలి.
1 . ఎలుక విషం విరిగిపోవడానికి( FOR RAT POISON )
ఊడుగ వేరు
గొర్రె మూత్రం
ఆవు నెయ్యి - 1 స్పూన్
ఊడుగ వేరునుగొర్రె మూత్రంతో మెత్తగా నూరి రసం పిండాలి .ముద్దను కాటు పైన వేసి కట్టు కడుతూ, రసాన్ని నాలుగైదు చుక్కల మోతాదుగా మాత్రమే ఒక స్పూన్ ఆవు నెయ్యి కలిపి సేవించాలి.
uses - ఎలుక విషం విరిగిపోతుంది.
2 . సుఖ రోగపు పుండ్లు , మచ్చలు తగ్గడానికి ( FOR WOUNDS AND MARKS OF SEXUAL DISEASES )
ఊడుగ వేరు పొడి - 1 భాగం
శుద్ధి చేసిన మహిసాక్షి గుగ్గిలం పొడి - 1 భాగం
పై వాటిని కలిపి బఠానీ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. రోజు రెండు పూటలా ఒక మాత్ర మంచినీటితో సేవిస్తుండాలి.
uses - సుఖరోగాల వల్ల కలిగిన పుండ్లు ,మచ్చలు మాడిపోతాయి.
3 . శరీరం చెడిన వారికి ( FOR SPOILED BODY )
ఊడుగా వేరు పై బెరడు పొడి - 2 చిటికెలు
తేనె - 1 చెంచా
పై వాటిని కలిపి , రెండు పూటలా ఆహారానికి 1 గంట ముందు సేవించాలి.
uses - ఈ కారణం వల్ల చెడిపోయిన శరీర తత్వమైన తిరిగి బాగుపడుతుంది. శరీరానికి బలం వస్తుంది.
4 . అర్శ మొలలు తగ్గడానికి( FOR PILES )
ఊడుగ వేరు బెరడు - 30 gm
దోరగా వేయించిన మిరియాలు - 10 gm
పై వాటిని కలిపి కొంచెం మెత్తగా నీటితో నూరి బటాని గింజలంత గోలీలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. .పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచిిినీటితో సేవించాలి.
uses - 40 రోజుల్లో మొలలు కరిగిపోతాయి
5 . తేలు కాటు కొరకు ( FOR SCORPION BITE - POISON )
ఊడుగ గింజలు - 1 భాగం
ముషిని చెట్టు గింజలు - 1 భాగం
పొంగించిన ఇంగువ - 1 భాగం
అశ్వగంధ దుంపలు - 1 భాగం
గచ్చకాయల లోపలి పప్పు - 1 భాగం
చిత్రమూలం వేరు పై బెరడు - 1 భాగం
తెల్ల జిల్లేడు వేరు పై బెరడు - 1 భాగం
జిల్లేడు పాలు - తగినంత
పై అన్నింటినీ కలిపి మెత్తగా నూరి చిటికెన వేలంతా బారుగా కనికలు చేసి నీడలో బాగా గాలికి ఆరబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత నిలువ చేసుకోవాలి. తేలు పుట్టినప్పుడు ఈ కనికను నీటితో అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట పోసి గుడ్డ పొగ వేయాలి.
uses - క్షణంలో తేలు విషము విరిగిపోతుంది.
6 . కాటుకలో పెట్టిన విషం విరిగిపోవడానికి
ఊడుగ పువ్వులు
పువ్వులను బట్టలో వేసి మూసిన కళ్ళ పైన పెట్టి కొద్దిసేపు ఉంచి తీసిిిిిివేస్తుండాలి.
uses - విషం విరిగిపోతుంది.
7 . కుక్క కాటు విషం విరుగుటకు ( FOR DOG BITE )
ఊడుగ వేరు ( root of sage leaved alangium )
ఆవు పాలు ( cow milk )
వేరును పాలతో నూరి బట్టలో వడగట్టి రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా రోగి శరీర బలాన్ని బట్టి సేవిస్తుండాలి.
uses - కుక్క కాటు విషం విరిగిపోతుంది.
8 . ఉబ్బసం తగ్గుటకు ( FOR ASTHMA )
ఊడుగ లేత చిగుర్లు ( young shoots )
చిగుర్లను మెత్తగా నూరి శనగ గింజంత గోలీలు కట్టి గాలికి ఆరబెట్టాలి. రోజు రెండు పూటలా ఆహారానికి పావుగంట ముందు ఒక గోలి మంచినీటితో వేసుకోవాలి.
uses - ఉబ్బసం,క్షయ అన్ని రకాల దగ్గులు తగ్గిపోతాయి.
* ఈ గోళీలు వేసుకుంటే ఎవరికీ ఇమడక వాంతి అవుతుందో వారు ఆవు నేతితో కలిపి 20 రోజులు వాడుకోవచ్చు.
9 . సర్వ విషాలు తగ్గుటకు( RECIPE FOR SNAKE AND OTHER POISONS )
తెల్ల ఊడుగ చెట్టు వేరు ముక్కలు
చెట్టుకు పూజ చేసి చిన్న వేరు ముక్కను తెచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న సీసాలో పోసి నిలువ చేసుకోవాలి.
పాములున్న ప్రాంతాలలో తిరిగేవారు ఆ సీసాను జేబులో పెట్టుకోవచ్చు. ఏ విషజంతువైనా కాటు వేస్తే వెంటనే ఒక చిన్న ముక్కను నొట్లో వేసుకుని బుగ్గన పెట్టి,నిదానంగా నములుతూ ఆ రసం మింగుతుండాలి.
ఉపయోగాలు - విషం హరించిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా కూడా ఉపయోగపడి ప్రాణాలను కాపాడుతుంది.
10 . వాత నొప్పులు , వాపులు తగ్గుటకు( FOR BODY PAINS AND SWELLINGS )
ఊడుగ ఆకులు
ఆకులను ముద్దలాగా నూరి నొప్పులపైన వేసి బట్టతో కట్టు కడుతూ ఉండాలి.
ఉపయోగాలు - నొప్పులు , వాపులు తగ్గిపోతాయి.
11 . సమస్త చర్మ రోగాలు తగ్గుటకు ( FOR ALL TYPES OF SKIN DISEASES )
తెల్ల ఊడుగ చెట్టు వేర్ల బెరడు పొడి
జాజికాయ పొడి
జాపత్రి పొడి
లవంగాల పొడి
పై నాల్గింటిని సమాన భాగాలుగా కలిపి పలుచని నూలు బట్టలో వస్త్ర ఘాళితం చేసి నిలువ ఉంచుకోవాలి.
పూటకు 1 గ్రాము మోతాదుగా , 1 చెంచా తేనె తో కలిపి , వ్యాధి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు పూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అలవాటైన తర్వాత క్రమంగా కొద్ది కొద్దిగా పెంచుతూ 1 గ్రాము నుండి 2 లేక 2 1/2 గ్రాముల చూర్ణం వరకు పెంచుకుంటూ వాడుతుండాలి.
ఉపయోగాలు - అన్ని రకాల చర్మ రోగాలు క్రమంగా అద్రుశ్యమై పోయి చర్మ సౌందర్యం కల్గుతుంది.