4, ఏప్రిల్ 2012, బుధవారం

పెరుగుతో డాక్టర్ కొండపల్లి ఆయుర్వేద పరిష్కారాలు

1. అర్శ మొలలు తగ్గడానికి ( FOR PILES )

 నిత్యం పెరుగు సేవిస్తుండాలి రక్తం స్రవించడం ఆగిపోతుంది లేదా మజ్జిగ సైంధవ లవణం, వాము చూర్ణం కలిపి త్రాగించాలి.

2 . నీళ్ల విరేచనాలు తగ్గుటకు ( FOR LOOSE MOTIONS )

a . ) పెరుగు 
దానిమ్మ ఇగుర్లు 

 పెరుగులో దానిమ్మ ఇగుర్లు కలిపి సేవించాలి

b. ) తెల్ల జీలకర్ర  -  1 స్పూన్
      మజ్జిగ

పై వాటిని కలిపి సేవించాలి .

3 . జిగట విరేచనాలు తగ్గుటకు

పెరుగు లేదా మజ్జిగ
తేనె

పై వాటిని కలిపి సేవించాలి.

4 . శరీరం పైన మంటలు తగ్గుటకు  (  FOR WHOLE BODY BURNS )

ఆవు మజ్జిగ
బట్ట

బట్టలు మజ్జిగలో తడిపి శరీరమంతటా రుద్దాలి.

5 . దీర్ఘకాలిక మలబద్ధకం తగ్గుటకు (  FOR LONG LASTING CONSTIPATION )

ఆవు మజ్జిగ
వాము
బిడా లవణం ( నల్ల ఉప్పు )

 పై వాటిని కలిపి తాగించాలి.

6 . పార్శ్వ నొప్పి ( అర తల నొప్పి )  తగ్గుటకు (  FOR MAIGRAINE )

మజ్జిగ అన్నం 
కండ చక్కెర

పై వాటిని కలిపి ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే భుజించాలి.

7 . మూత్రం సరిగ్గా రావడానికి ( FOR IMPROPER URINATION )

మజ్జిగ
శుద్ధి చేసిన గంధకం - 1/2 స్పూన్

 పైవాటిని కలిపి త్రాగించాలి

8 .  అజీర్ణం తగ్గుటకు ( FOR INDIGESTION )

మజ్జిగ
ఉప్పు

పై వాటిని కలిపి సేవించాలి

9 . బలం కలగడానికి (  FOR STRENGTH )

పెరుగు
బెల్లం

పై వాటిని కలిపి రోజు ఉదయమే సేవిస్తుండాలి. 

28, మార్చి 2012, బుధవారం

వివిధ రోగాలు.. డా చిరుమామిళ్ళ ఆయుర్వేద పరిష్కారాలు

1 . ఉబ్బసం తగ్గుటకు ( RECIPE FOR ASTHMA )

పచ్చి జిల్లేడు పువ్వులు
మిరియాలు

 పైవాటిని కలిపి నూరి చిన్న చిన్న మాత్రలుగా చేసుకొని పూటకో మాత్ర తింటే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది.

 ఋతుషూల/ముట్టుకుట్టు నొప్పి తగ్గుటకు ( FOR MENSUS PAIN )

చెంగల్వ కోష్ట్ వేర్లు

వేర్లతో డికాషన్ కాచి ఐదు చుక్కలు రెండు చెవులలోను వేసుకుంటే ఋతు శూల షమిస్తుంది

3 . ఎక్కిళ్ళు తగ్గడానికి ( FOR HICCOUGHS )

శొంఠి
బెల్లం

 పై రెండు కలిపి కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా నూరి బట్టలో కట్టి రెండు లేదా మూడు చుక్కలు ముక్కులో పిండితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

4 . కామెర్లు తగ్గడానికి ( FOR JAUNDICE )

ఆముదం ఆకు ముద్ద  -  అర చెంచాడు
మిరియాల పొడి  - చిటికెడు

 పై రెండింటిని కలిపి మజ్జిగతో తీసుకోవాలి. ఇలా ఐదు రోజులపాటు మూడు పూటలా చేయాలి. కామెర్లు తగ్గిపోతాయి.

5 . కీళ్ల నొప్పులు తగ్గడానికి ( FOR JOINT PAINS )

a . ) పల్లేరు చెట్టు పొడి - 1 భాగం 
శొంఠి పొడి  -  1 భాగం

 పల్లేరు చెట్టును సమూలంగ తెచ్చిగాలికి ఆరబెట్టి మెత్తటి పొడిగా దంచాలి . సొంటి పొడి కలిపి పూటకు అర చెంచా మోతాదుగా రెండు పూటలా వేడి నీటితో తీసుకోవాలి. కీళ్లనొప్పులు తగ్గుతాయి.

b . ) వావిలి వేర్ల చూర్ణం  - 1 గ్రాము
నువ్వుల నూనె  - 2 గ్రాములు

 పై రెండింటిని కలిపి రోజు తింటుండాలి


6 . కాలిలో ముళ్ళు రావడానికి ( THORN IN THE LEG )

బొక్కెన ఆకు - 1 భాగం
బెల్లం  - 1 భాగం

పై వాటిని కలిపి కుంకుడు గింజంత తినాలి. అలాగే దీనిని పైన కట్టు కడితే ముళ్ళు దానంతట అదే బయటకు వచ్చేస్తుంది.
7  .గుండె నొప్పి తగ్గడానికి ( FOR HEART PAIN )

మోడి - 1 భాగం
ఎలక గింజల పొడి  - 1 భాగం

పై వాటిని కలిపి తేనెతో కలిపి తీసుకోవాలి. గుండె నొప్పి ఉపశమిస్తుంది. దీనికి ముందు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకోవడం మంచిది.

8 . చర్మ వ్యాధులు తగ్గడానికి సున్ని పిండి ( FOR SKIN DISEASES )

పెసర్లు ( green gram )  - 1 kg
బావంచాలు - 50 gm
కచ్చురాలు  -  50 gm
పసుపు  -  50 gm

పై అన్నింటిని కలిపి సున్ని పిండి తయారు చేసుకొని స్నానానికి వాడుకోవాలి

9 . చుండ్రు తగ్గడానికి ( FOR DANDRUFF )

a . ) నంది వర్ధనం ఆకుల పొడి లేదా  బంతి ఆకుల పొడి 

 పొడిని కొద్ది నీటితో కలిపి  తలకు పట్టించి కొద్దిసేపు అయ్యాక స్నానం చేయాలి. చుండ్రు పోతుంది.

b . ) సపోటా గింజల పొడి 

 పొడిని తలకు పట్టించి స్నానం చేస్తే చుండ్రే కాకుండా పేలు కూడా తగ్గుతాయి.

10 . చెవిలో చీము తగ్గుటకు  (  PUS IN THE EAR )

a . ) మల్లె ఆకుల రసం 
తేనె - కొంచెం

ఆకుల రసాన్ని వడపోసి తేనె కలిపి చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.

b . ) రావి ఆకుల రసం 

ఆకులను మెత్తగా నూరి రసం తీసి చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.

11 . చెవి నొప్పి తగ్గుటకు ( FOR EARACHE )

a . ) నీరుల్లిపాయల రసం

రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవుల్లో చుక్కలుగా వేయాలి.
 నొప్పి, హోరు తగ్గుతాయి.

.b . ) తులసి ఆకుల రసం

 రసాన్ని చెవిలో వేస్తే పోటు తగ్గుతుంది.

12 . దంతాలు గట్టిపడడానికి ( FOR STRONG TEETH )

వెదురు చెట్టు బూడిద

వెదురు చెట్టును సమూలంగా తెచ్చి మండించి కాల్చి తెల్లటి బూడిద అయిన తర్వాత పండ్లు తోముకుంటే దంతాలు గట్టి పడతాయి.

13 . నరాల బలహీనత తగ్గడానికి..  ( FOR NERVOUS WEAKNESS )

a . ) పేను వేప గింజల నూనె  - 10 - 15 చుక్కలు
పాలు

నూనెను పాలలో కలిపి తాగుతుండాలి

b . ) మాల్కంగణి గింజల తైలం - 10 - 15 చుక్కలు
పాలు 

పై రెండింటిని కలిపి తీసుకోవాలి.

14 . ) నీళ్ల విరేచనాలు తగ్గడానికి (  FOR LOOSE MOTIONS )

ఆవాలు
నీరు లేదా తేనె 

ఇనుప గరిటె లో ఆవాలను మాడ్చి , నీళ్లతో గానీ , లేదా తేనె తో కలిపి గానీ  తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

15 . పరిణామ శూల తగ్గడానికి ( FOR STOMACH PAIN AFTER MEAL )

వెల్లుల్లి ఆకుల రసం
తేనె 

 ఆకులను దంచి రసం తీసి, తేనెతో కలుపుకొని తాగాలి. దీనితో పాటు కొన్ని రోజులపాటు కేవలము మజ్జిగ అన్నం మాత్రమే తినాలి.

16 . బలం రావడానికి ( FOR STRENGTH )

చిట్టుడుకు నీళ్ళు
పటిక బెల్లం 

పసి పిల్లలలో బలం పెరగడానికి అన్నం వండేటప్పుడు పొంగే చిట్టుడుకు నీళ్ళను గ్రహించి , తగినంత కండ చక్కెర కలిపి తాగిస్తే చక్కని టానిక్ గా పని చేస్తుంది.


17 . మడిమ శూల తగ్గడానికి (  FOR HEEL PAIN )


నిమ్మ రసం  - 1 భాగం
నువ్వుల నూనె  -  1 భాగం


ప్రతి రోజూ రాత్రి వేడి నీళ్లతో కాళ్ళు, చేతులు కడుక్కొని, తడి లేకుండా తుడుచుకొని , నిమ్మ రసం , నువ్వుల నూనె లను కలిపి పై పూతగా రాసుకోవాలి.

18 . పులి త్రేన్పులు తగ్గడానికి 


శొంఠి పొడి  - 1 భాగం
మిరియాల పొడి  - 1 భాగం
 వేప చెక్క పొడి  -  1 భాగం


పై అన్నింటిని కలిపి, ప్రతి రోజూ అర గ్రాము చొప్పున నీళ్లలో కలుపుకొని  తీసుకోవాలి.

19 . తల నొప్పి తగ్గడానికి  (  FOR HEADACHE  )

పుదీనా పువ్వు  -  1 భాగం
ఓమ పువ్వు  -  1 భాగం
కర్పూరం  - 2 భాగాలు
సోంపు గింజల నూనె -  1 భాగం

పై అన్నింటిని కలిపి నుదురు పైన రాస్తే తల నొప్పి , పడిశం తగ్గుతాయి.

20  . మూత్రంలో మంట తగ్గడానికి (  FOR URINE BURN )

ముత్తవ పులగం ( బల , ముద్ర బెండ ) గింజల  చూర్ణం  -  1/4 స్పూన్

చూర్ణాన్ని నీళ్లతో కలిపి కషాయం కాచి తీసుకోవాలి. 

26, మార్చి 2012, సోమవారం

రేగు పండు తో డా చిరుమామిళ్ళ ఆయుర్వేద ఉపయోగాలు

1 . బహిష్టులో అధిక రక్తస్రావం తగ్గుటకు (  RECIPE FOR EXCESSIVE MENSUS BLEEDING )

రేగు పండ్ల పొడి  - 1 స్పూన్
నీరు  -  1/2 కప్ 

బాగా పండి , ఎండిన రేగు పండ్లను పొడిగా తయారు చేసిన చూర్ణాన్ని ,రోజుకి 1 స్పూన్ చొప్పున  అర కప్పు నీటిలో కలిపి తీసుకోవాలి.

ఉపయోగాలు  -  బహిష్టులో అధిక రక్తం పోవడం తగ్గుతుంది

2 . పిల్లలలో చిరాకు, పెంకి తనం  తగ్గడానికి ( TO CONTROL NOISE OF THE CHILDREN AND TONIC TO THE CHILDREN'S NERVOUS SYSTEM )

ఎండు రేగు కాయలు  -  10 gm
నీరు

కాయలను  నీటిలో వేసి ఉడికించి కషాయం తయారు చేయాలి. దీనిని వడపోసి , ప్రతి రోజూ  ఒక కప్ మోతాదుగా  పిల్లల చేత తాగిస్తుండాలి.

ఉపయోగాలు  - మానసిక చికాకు తగ్గుతుంది. పిల్లల నాడీ మండలానికి టానిక్ లాగా పని చేస్తుంది.

 3 . జలుబు , తల నొప్పి తగ్గడానికి  (  RECIPE FOR COLD AND HEADACHE )

రేగు పండ్ల రసం  -  1 స్పూన్
మిరియాల పొడి  - చిటికెడు  (  1 pinch )

రేగు పండ్ల గుజ్జు పిసికి  , రసం తీసి , మిరియాల పొడి కలిపి  తీసుకోవాలి.

ఉపయోగాలు  -  జలుబు , తల నొప్పి తగ్గుతాయి. 

బఠాణీలతో.. డా చిరుమామిళ్ళ ఆయుర్వేద పరిష్కారాలు

1 . చికెన్ పాక్స్ మచ్చలు తగ్గడానికి  ( FOR CHICKEN POX MARKS AND PIMPLE MARKS  )

బఠాణీలు  -  50 gm
నీరు  - తగినంత


బఠాణీలను పలుకులుగా  నూరి , సరిపడా నీటిలో కలిపి మరిగించి కషాయం తయారు చేసి  , వడపోసి  , నులివెచ్చని కషాయంతో  ముఖాన్ని శుభ్రం చేసుకుంటుండాలి.

ఉపయోగాలు  - పిల్లల్లో చికెన్ పాక్స్ మచ్చలు తగ్గి, మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి

2 . అధిక కొలెస్ట్రాల్ తగ్గుటకు  (  FOR EXCESSIVE CHOLESTEROL  )

పచ్చి బఠాణీలు  -  50 gm
నీరు -  తగినంత

దాల్చిన చెక్క పొడి -  పావు చెంచా
ఉప్పు  -  అర చెంచా
మిరియాలు  -  అర చెంచా


బఠానీలను పలుకులుగా నూరి నీటికి కలిపి మరిగించి కషాయం తయారు చేసుకొని దాల్చిన చెక్క పొడి, ఉప్పు, మిరియాలు పై మోతాదులో కలిపి చారు తయారు చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఉపయోగాలు  -  కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

3 .  కోపం , ఆందోళన తగ్గడానికి (  FOR ANGRY , ANXIETY )

బఠాణీలు

బటానీలను దోరగా వేయించి కొద్దికొద్దిగా నమిలి తింటుండాలి.

ఉపయోగాలు  -  మనసు తేలిక పడి , ఆందోళన , కోపం తగ్గుతాయి.

4 .  బలం కలగడానికి  (  BODY STRENGTH )

పచ్చి బఠాణీలు లేదా 24 గంటలపాటు నానబెట్టిన మామూలు బఠాణీలు

బఠాణీలు ఉడికించి తీసుకోవాలి.

ఉపయోగాలు - శక్తి వస్తుంది. 

జొన్నలతో.. డా చిరుమామిళ్ళ ఆయుర్వేద పరిష్కారాలు.

1 .ఎండ వేడికి కలిగే నీరసం తగ్గుటకు ( FOR TIREDNESS DUE TO SUMMER HEAT )

జొన్నల పిండి 
చక్కెర
నీరు

జొన్నలను తడిపి వేయిస్తే పేలాలు గా తయారవుతాయి.పేలాలను విసిరి మెత్తని పిండిగా తయారు చేసి , అందులో తగినంత చక్కెర, నీళ్ళు కలిపి జావ మాదిరిగా చేసి తింటుండాలి. జొన్నలను తడిపి వేయిస్తే పేలాలుగా తయారవుతాయి పేలాలను విసిరి మెత్తని పిండిగా తయారుచేసి అందులో తగినంత చక్కెర నీళ్లు కలిపి జావ మాదిరిగా చేసి తింటుండాలి.

ఉపయోగాలు  - అతి వేడి తగ్గడమే కాకుండా , వివిధ వ్యాధులనుండి కోలుకునే పిల్లలకు , వృద్ధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

2 . మధుమేహం లో ఆహారం( FOOD FOR DIABETIC PATIENTS )

పచ్చ జొన్నల రవ్వ

రవ్వతో చేసిన అన్నాన్ని తింటుండాలి.

ఉపయోగాలు  -  వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

3 . దేహ దారుఢ్యం కోసం ( FOR STRONG BODY  )

జొన్న రొట్టెలు

రొట్టెలను క్రమం తప్పకుండా తింటుండాలి.

ఉపయోగాలు  - శరీరం లో కొవ్వు చేరడం తగ్గి , శరీరం గట్టిపడుతుంది.

4 . శరీరం లో వేడి తగ్గడానికి (  TO REDUCE HEAT IN THE BODY  )

నీరు
ఉడికించిన బియ్యం
జొన్న పిండి
ఉప్పు

ఒక గిన్నెలో నీటిని మరిగించి   , అందులో ఉడికించిన బియ్యాన్ని, జొన్న పిండిని, ఉప్పునూ  ,ముద్దగా అయ్యేవరకు కలుపుతూ  , ఆ తర్వాత గోరువెచ్చని ముద్దలుగా చేసుకుని లేదా విడిగానైనా తింటుండాలి

ఉపయోగాలు  -  అతి వేడి తగ్గిపోతుంది. 

25, ఫిబ్రవరి 2012, శనివారం

గాఢ నిద్రకు ఆయుర్వేద పరిష్కారాలు - డా. పెద్ది రమాదేవి.

నిద్రలేమికి డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ గారి సూచనలు.

నిద్రలేమికి శారీరక ,మానసిక రుగ్మతలు, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు ,మధ్యాహ్న నిద్ర ,ఆహార అలవాట్లలో మార్పులు, ఎక్కువగా భోంచేయడం, ఉపవాసం ఉండడం, అతిగా టీ ,కాఫీలు తీసుకోవడం, కీళ్ళ నొప్పులు ,మధుమేహం వంటి కారణాలు ఎన్నో. శరీరంలో నీటి శాతం బాగా తగ్గినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది.  నిద్రాల్పత వల్ల కలిగిన లక్షణాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే  క్రమంగా దూరమవుతాయి. వేసవిలో తప్ప, ఇతర కాలాల్లో మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు. గర్భిణులు, పెద్దలు, అనారోగ్యంతో ఉన్నవారు తప్పనిసరిగా పడుకోవాలి. అలానే వ్యాయామం చేసిన తర్వాత వెంటనే కాకుండా, గంట తర్వాత తిని నిద్రకు ఉపక్రమిస్తే సరిపోతుంది. నిద్రలేమితో బాధపడేవారు పాలు ,పెరుగు ,చెరుకు రసం, అరటి ,ఆపిల్ ,నారింజ, దానిమ్మ ,తీయటి పదార్థాలు వంటివి
 తీసుకుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది. నలుగు పెట్టుకోవడం, గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, నూనెతో తలకు మర్దన చేసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది . అరిపాదాలను ,లావెండర్ నూనె లేదా తేనెతో గానీ మర్దన చేసినా చక్కగా నిద్ర పడుతుంది.

గోరువెచ్చటి పాలను అరచెంచా అశ్వగంధ చూర్ణం కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. రాత్రి భోజనానంతరం పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం లేదా బాదంపప్పు ,దాల్చిన చెక్క ,యాలకుల పొడి వేసి తాగాలి .గసగసాలను వస్త్రంలో కట్టి వాసన పీల్చినా ప్రయోజనం ఉంటుంది. జాజిపూలను దిండు కింద పెట్టుకొని 
 పడుకుంటే నిద్ర పడుతుంది. తరచూ ఈ తైలం లేదా బాదం నూనెతో తలకు మర్దన చేసినా ఫలితం ఉంటుంది. ఎన్ని నియమాలు పాటించినా సమస్య తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాలి.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...