28, మార్చి 2012, బుధవారం

వివిధ రోగాలు.. డా చిరుమామిళ్ళ ఆయుర్వేద పరిష్కారాలు

1 . ఉబ్బసం తగ్గుటకు ( RECIPE FOR ASTHMA )

పచ్చి జిల్లేడు పువ్వులు
మిరియాలు

 పైవాటిని కలిపి నూరి చిన్న చిన్న మాత్రలుగా చేసుకొని పూటకో మాత్ర తింటే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది.

 ఋతుషూల/ముట్టుకుట్టు నొప్పి తగ్గుటకు ( FOR MENSUS PAIN )

చెంగల్వ కోష్ట్ వేర్లు

వేర్లతో డికాషన్ కాచి ఐదు చుక్కలు రెండు చెవులలోను వేసుకుంటే ఋతు శూల షమిస్తుంది

3 . ఎక్కిళ్ళు తగ్గడానికి ( FOR HICCOUGHS )

శొంఠి
బెల్లం

 పై రెండు కలిపి కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా నూరి బట్టలో కట్టి రెండు లేదా మూడు చుక్కలు ముక్కులో పిండితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

4 . కామెర్లు తగ్గడానికి ( FOR JAUNDICE )

ఆముదం ఆకు ముద్ద  -  అర చెంచాడు
మిరియాల పొడి  - చిటికెడు

 పై రెండింటిని కలిపి మజ్జిగతో తీసుకోవాలి. ఇలా ఐదు రోజులపాటు మూడు పూటలా చేయాలి. కామెర్లు తగ్గిపోతాయి.

5 . కీళ్ల నొప్పులు తగ్గడానికి ( FOR JOINT PAINS )

a . ) పల్లేరు చెట్టు పొడి - 1 భాగం 
శొంఠి పొడి  -  1 భాగం

 పల్లేరు చెట్టును సమూలంగ తెచ్చిగాలికి ఆరబెట్టి మెత్తటి పొడిగా దంచాలి . సొంటి పొడి కలిపి పూటకు అర చెంచా మోతాదుగా రెండు పూటలా వేడి నీటితో తీసుకోవాలి. కీళ్లనొప్పులు తగ్గుతాయి.

b . ) వావిలి వేర్ల చూర్ణం  - 1 గ్రాము
నువ్వుల నూనె  - 2 గ్రాములు

 పై రెండింటిని కలిపి రోజు తింటుండాలి


6 . కాలిలో ముళ్ళు రావడానికి ( THORN IN THE LEG )

బొక్కెన ఆకు - 1 భాగం
బెల్లం  - 1 భాగం

పై వాటిని కలిపి కుంకుడు గింజంత తినాలి. అలాగే దీనిని పైన కట్టు కడితే ముళ్ళు దానంతట అదే బయటకు వచ్చేస్తుంది.
7  .గుండె నొప్పి తగ్గడానికి ( FOR HEART PAIN )

మోడి - 1 భాగం
ఎలక గింజల పొడి  - 1 భాగం

పై వాటిని కలిపి తేనెతో కలిపి తీసుకోవాలి. గుండె నొప్పి ఉపశమిస్తుంది. దీనికి ముందు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకోవడం మంచిది.

8 . చర్మ వ్యాధులు తగ్గడానికి సున్ని పిండి ( FOR SKIN DISEASES )

పెసర్లు ( green gram )  - 1 kg
బావంచాలు - 50 gm
కచ్చురాలు  -  50 gm
పసుపు  -  50 gm

పై అన్నింటిని కలిపి సున్ని పిండి తయారు చేసుకొని స్నానానికి వాడుకోవాలి

9 . చుండ్రు తగ్గడానికి ( FOR DANDRUFF )

a . ) నంది వర్ధనం ఆకుల పొడి లేదా  బంతి ఆకుల పొడి 

 పొడిని కొద్ది నీటితో కలిపి  తలకు పట్టించి కొద్దిసేపు అయ్యాక స్నానం చేయాలి. చుండ్రు పోతుంది.

b . ) సపోటా గింజల పొడి 

 పొడిని తలకు పట్టించి స్నానం చేస్తే చుండ్రే కాకుండా పేలు కూడా తగ్గుతాయి.

10 . చెవిలో చీము తగ్గుటకు  (  PUS IN THE EAR )

a . ) మల్లె ఆకుల రసం 
తేనె - కొంచెం

ఆకుల రసాన్ని వడపోసి తేనె కలిపి చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.

b . ) రావి ఆకుల రసం 

ఆకులను మెత్తగా నూరి రసం తీసి చెవిలో వేస్తే చీము తగ్గుతుంది.

11 . చెవి నొప్పి తగ్గుటకు ( FOR EARACHE )

a . ) నీరుల్లిపాయల రసం

రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవుల్లో చుక్కలుగా వేయాలి.
 నొప్పి, హోరు తగ్గుతాయి.

.b . ) తులసి ఆకుల రసం

 రసాన్ని చెవిలో వేస్తే పోటు తగ్గుతుంది.

12 . దంతాలు గట్టిపడడానికి ( FOR STRONG TEETH )

వెదురు చెట్టు బూడిద

వెదురు చెట్టును సమూలంగా తెచ్చి మండించి కాల్చి తెల్లటి బూడిద అయిన తర్వాత పండ్లు తోముకుంటే దంతాలు గట్టి పడతాయి.

13 . నరాల బలహీనత తగ్గడానికి..  ( FOR NERVOUS WEAKNESS )

a . ) పేను వేప గింజల నూనె  - 10 - 15 చుక్కలు
పాలు

నూనెను పాలలో కలిపి తాగుతుండాలి

b . ) మాల్కంగణి గింజల తైలం - 10 - 15 చుక్కలు
పాలు 

పై రెండింటిని కలిపి తీసుకోవాలి.

14 . ) నీళ్ల విరేచనాలు తగ్గడానికి (  FOR LOOSE MOTIONS )

ఆవాలు
నీరు లేదా తేనె 

ఇనుప గరిటె లో ఆవాలను మాడ్చి , నీళ్లతో గానీ , లేదా తేనె తో కలిపి గానీ  తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

15 . పరిణామ శూల తగ్గడానికి ( FOR STOMACH PAIN AFTER MEAL )

వెల్లుల్లి ఆకుల రసం
తేనె 

 ఆకులను దంచి రసం తీసి, తేనెతో కలుపుకొని తాగాలి. దీనితో పాటు కొన్ని రోజులపాటు కేవలము మజ్జిగ అన్నం మాత్రమే తినాలి.

16 . బలం రావడానికి ( FOR STRENGTH )

చిట్టుడుకు నీళ్ళు
పటిక బెల్లం 

పసి పిల్లలలో బలం పెరగడానికి అన్నం వండేటప్పుడు పొంగే చిట్టుడుకు నీళ్ళను గ్రహించి , తగినంత కండ చక్కెర కలిపి తాగిస్తే చక్కని టానిక్ గా పని చేస్తుంది.


17 . మడిమ శూల తగ్గడానికి (  FOR HEEL PAIN )


నిమ్మ రసం  - 1 భాగం
నువ్వుల నూనె  -  1 భాగం


ప్రతి రోజూ రాత్రి వేడి నీళ్లతో కాళ్ళు, చేతులు కడుక్కొని, తడి లేకుండా తుడుచుకొని , నిమ్మ రసం , నువ్వుల నూనె లను కలిపి పై పూతగా రాసుకోవాలి.

18 . పులి త్రేన్పులు తగ్గడానికి 


శొంఠి పొడి  - 1 భాగం
మిరియాల పొడి  - 1 భాగం
 వేప చెక్క పొడి  -  1 భాగం


పై అన్నింటిని కలిపి, ప్రతి రోజూ అర గ్రాము చొప్పున నీళ్లలో కలుపుకొని  తీసుకోవాలి.

19 . తల నొప్పి తగ్గడానికి  (  FOR HEADACHE  )

పుదీనా పువ్వు  -  1 భాగం
ఓమ పువ్వు  -  1 భాగం
కర్పూరం  - 2 భాగాలు
సోంపు గింజల నూనె -  1 భాగం

పై అన్నింటిని కలిపి నుదురు పైన రాస్తే తల నొప్పి , పడిశం తగ్గుతాయి.

20  . మూత్రంలో మంట తగ్గడానికి (  FOR URINE BURN )

ముత్తవ పులగం ( బల , ముద్ర బెండ ) గింజల  చూర్ణం  -  1/4 స్పూన్

చూర్ణాన్ని నీళ్లతో కలిపి కషాయం కాచి తీసుకోవాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...