టీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2016, శుక్రవారం

అంజూర ఆకులతో గ్రీన్ టీ



అంజూర ఆకులతో గ్రీన్ టీ!

ఆరోగ్యదాయకమైన గ్రీన్ టీనితయారు చేసుకోవడానికి కుండీల్లోపెంచుకునే వివిధ మొక్కల ఆకులపొడి శ్రేష్టమని నిపుణులు చెబుతున్నారు. తులసి, మునగ, స్టీవియా
ఆకుల పొడితో టీ తయారు చేసుకోవడం తెలిసిందే. అదే జాబితాలోఅంజూర కూడా చేరింది. అంజూర ఆకుల టీ తాగితే మధుమేహం,రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.పెద్ద ఆకులను కోసి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన ఆకులను నలిపి పొడి చేసి పెట్టుకోవాలి. లీటరు నీటిలో రెండు చెంచాలపొడిని వేసి 15 నిమిషాలు.. నీరు సగం ఆవిరయ్యే వరకు మరగబెట్టి..
వడకడితే టీ సిద్ధమైనట్లే. ఇలా తయారు చేసుకున్న టీని ఫ్రిజ్ లో నిల్వఉంచుకొని కూడా వాడుకోవచ్చు.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...