Thursday, 4 April 2013

జుట్టు రాలడం -JUTTU ( VENTRUKALU ) RALUTA ( HAIR FALL ) - AYURVEDAM

జుట్టు రాలడాన్ని నివారించే చికిత్సలు /  రెమెడీస్ -  remedies for hairfall


ప్రతిరోజూ ఉదయం పిడికెడు తెల్ల నువ్వులను తినాలి. నువ్వుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి.

ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును చిటికెడు జీలకర్ర పొడి తో కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున కనీసం మూడు నెలల పాటు తీసుకుంటే శరీరంలో పిత్తం సమస్థితిలోకి వచ్చి వేడి తగ్గి, జుట్టు రాలటం ఆగుతుంది . కలబంద గుజ్జు కు బదులు కలబంద రసం కూడా పావుకప్పు మోతాదులో తీసుకోవచ్చు.

ఆహారంలో డ్రై ఫ్రూట్, పాలు ,పెరుగు, పనీర్, కొబ్బరి, యాపిల్స్, క్యాబేజీ వంటివి ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల జుట్టు ఆరోగ్యం పెంపొంది చక్కగా పెరుగుతుంది.

దశ మూలాల చూర్ణం ఐదు భాగాలు, గుంటగలగరాకు చూర్ణం నాలుగు భాగాల,
 జటామాంసి వేర్ల చూర్ణం మూడు భాగాలు కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు ఈ మిశ్రమాన్ని  అర చెంచా మోతాదుగా కప్పు పాలలో కలిపి  మరిగించి వడపోసుకుని తాగుతూ ఉంటే క్రమంగా జుట్టు రాలడం తగ్గుతుంది.

రాలే జుట్టును అరికట్టుట డానికి సుశ్రుత సంహిత త్రివిధ వ్యూహాలను పేర్కొంది. మొదట స్నేహనం అంటే ఔషధ సిద్ధ నూనెలను తలకు పట్టించడం, రెండవది స్వేదనం అంటే చెమట పట్టేలా చేయడం, తరవాత లేపనం ,అంటే ఔషధాలను మెత్తగా మర్దించి తలకు పూయడం. చేయాలని సుశ్రుత సంహిత సూచించింది.

స్నేహ న చికిత్సలో భాగంగా neelibhringadi తైలం, బ్రాహ్మీ తైలం ,బృంగరాజ తైలం, జపాకుసుమ తైలం వంటి ఔషధ సిద్ధ నూనెలను తలకు పట్టించాలి. తరువాత స్వేదన ప్రక్రియ లో భాగంగా త్రిఫల  కషాయంలో ఉంచిన మందపాటి గుడ్డను చుట్టి చెమట పుట్టించేలా చేయాలి.  చివరగా లేపన చికిత్సను ప్రయోగించాలి .అంటే గుంటగలగరాకు, త్రిఫలాలు ,శీకాయ, కుంకుడు కాయ, kachuralu ,అతిమధురం వంటి ఓషధులను మెత్తగా మర్దించి తలకు లేపనం చేయాలన్నమాట.

మెడ కండరాలను శక్తివంతం చేసే వ్యాయామాలు, శీర్షాసనం , భుజంగాసనం వంటి యోగాసనాల వలన తలకు రక్త ప్రసరణ పెరిగి తద్వారా జుట్టు కుదుళ్లు బలపడతాయి. అలాగే శిరోధార శిరోవస్తి శిరో భ్యంగనం వంటి ఆయుర్వేద చికిత్స ప్రక్రియల వల్ల కూడా అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది.


రజోనివృత్తి ,థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, రక్తహీనత, పిట్యుటరీ గ్రంథిలో పెరుగుదలలు, ఏర్పడటం, ఆటోఇమ్యూన్ వ్యాధులు, సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ,దీర్ఘకాలపు జ్వరాలు వంటి వాటి వల్ల జుట్టు రాలుతున్న అప్పుడు ప్రధాన కారణానికి చికిత్స తీసుకుంటే జుట్టు తిరిగి వచ్చేస్తుంది.


గృహ చికిత్సలు / హోమ్ రెమెడీస్


మిరియాలను మెత్తగా నూరి జుట్టు రాలిన చోట రుద్దితే నిద్రాణ స్థితిలో కి వెళ్ళిన వెంట్రుకల కుదుళ్ళు ప్రేరేపితమై తిరిగి చైతన్యవంతంగా మారుతాయి.

పసుపు, మాను పసుపు లను మెత్తగా పొడిచేసి వెన్న తో సహా ముద్దగా నూరి తలకు పట్టించి  గంట సేపు ఉంచి తలస్నానం చేస్తే వెంట్రుకలు నిలువుగా  చీలడంతగ్గుతుంది.

మినుములు ఒక కిలో, ఉసిరిక వరగు అరకిలో, సీకా కాయలు పావు కిలో, మెంతులు పావు కిలో చొప్పున తీసుకుని విడివిడిగా నూరి కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని తడవకు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున అరగ్లాసు నీళ్లలో నానబెట్టి పావుగంట పాటు ఉంచి తలకు హెయిర్ ప్యాక్ చేసుకోవాలి .అరగంట తర్వాత తల స్నానం చేయాలి.


మర్రిచెట్టు వేళ్లను పావుకిలో సేకరించి ఆరబెట్టాలి. తడిలేకుండా ఆరిపోయిన తర్వాత లీటర్ కొబ్బరి నూనెకు కలిపి పదిహేను రోజుల పాటు నానబెట్టి వడపోసి శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి .దీనిని ప్రతిరోజు తల నూనెగా రాత్రి నిద్రపోయేటప్పుడు రాసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.

చేదు పొట్ల ఆకుల రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట రుద్దుతుంటే అయిదారు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఉమ్మెత్త ఆకుల రసాన్ని గాని లేదా బొప్పాయి పువ్వుల రసాన్ని గాని లేదా మంగ చెట్టు పువ్వుల రసాన్ని గాని మాడుపైన రాసుకుంటే జుట్టు పెరుగుతుంది.

ఉసిరి వలుపు, అతిమధురం వేరు చూర్ణాలను మెత్తగా నూరి ముద్దగా చేసి దానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె ను ,నూనెకు నాలుగు రెట్లు ఆవుపాలను,నాలుగు రెట్లు నీళ్లను చేర్చి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు చిన్న మంట మీద మరిగించి వడపోసి శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి .దీనిని ప్రతి నిత్యం రెండు ముక్కు రంధ్రాల్లో ను నస్యంగా రెండేసి చుక్కల చొప్పున వేసుకుంటే జుట్టు పెరుగుతుంది అని సారంగధర సంహిత చెబుతోంది.

మందార పువ్వులతో జుట్టు ఊడిన భాగాన్ని వేడి పుట్టే లాగా బాగా రుద్దాలి, తరవాత గురివింద గింజల పొడిని ,నల్ల జీడి గింజల పొడిని, నేలములక పండ్ల రసాన్ని కలిపి మర్ద్ ఇస్తే మొండి పేనుకొరుకుడు రోగాల్లో కూడా మంచి గుణం కనిపిస్తుంది.

పల్లేరు ఆకులు ,నువ్వు చెట్టు పూలను ,తేనె ,నెయ్యి ల తో కలిపి నూరి లేపనం చేస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది .

ఏనుగు దంతం ని కాల్చి మసి చేసి  పాలలో కలిపి నూరి జుట్టు ఊడిన చోట ప్రయోగిస్తే  చక్కని ఫలితం కనిపిస్తుంది. హస్తి దంత మసి గా ఈ ఔషధం ఆయుర్వేద వైద్య వర్గాల్లో పేరుగాంచింది . మరీ మొండి కేసుల్లో ఏనుగుదంత మసి ని రసాంజనం (మాను పసుపు ఘనం ) తో కలిపి మేక పాలతో నూరి వెంట్రుకలు ఊడిన చోట ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

గురివింద గింజల ను గాని లేదా గురువింద వేరును గాని మంచినీళ్లతో ముద్దగా నూరి వెంట్రుకలు ఊడిన చోట ప్రయోగిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

 ములక / వాకుడు పండ్లను గానీ లేదా వాకుడు వేరును గానీ ముద్దగా దంచి రసం పిండి తేనె కలిపి జుట్టు ప్యా చ్ లుగా ఊడిన చోట రుద్దుతుంటే మంచి ఫలితం లభిస్తుంది.

 నల్ల జీడి గింజల రసాన్ని పేను కొరుకుడు ప్యా చ్ మీద రాస్తే తిరిగి జుట్టు పెరుగుతుంది. ఇది చాలా ఉగ్ర పదార్థం కనుక నిద్రాణ స్థితిలో కి వెళ్ళిన వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి తిరిగి చైతన్యపరుస్తుంది. అయితే కొంతమందికి సరిపడదు దీనితో  దురద ,రసి కారడం, దద్దుర్లు వంటి ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు దీనిని రాయడం ఆపేసి కొబ్బరి నూనెను బాహ్యంగా ప్రయోగిస్తే సరిపోతుంది.

 జాజి ఆకు,గన్నేరు ఆకు ,గన్నేరు వేరు, చిత్రమూలం అనే మూలిక వేరును, కానుగా కు ,ఉలిమిరి పట్ట సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరాలి ఈ ముద్దకు నాలుగింతలు నల్ల నువ్వుల నూనెను , ఆ నూనెకు నాలుగింతలు నీళ్ళను కలిపి చిన్న మంట మీద వేడిచేసి నీరు ఆవిరి అయిపోయి అంతవరకు ఉంచి
 వడపోసి నిల్వచేసుకోవాలి. దీనిని జుట్టు ఊడిన చోట తలపై రాసుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

చుండ్రు వల్ల జుట్టు ఊడుతు న్నప్పుడు  మామిడి టెంక లోని జీడిని, కరక్కాయల వలుపుని సమపాళ్లలో తీసుకుని పాలతో సహా నూరి ప్రయోగిస్తే చుండ్రు తగ్గిపోతుంది .జుట్టు తిరిగి పెరుగుతుంది.

జుట్టు పల్చబడుతున్నప్పుడు మందార పువ్వులను మెత్తగా నూరి నల్ల నువ్వుల నూనె లో తైలపాక విధానంలో కాచి తల నూనెగా వాడుతుంటే మంచి గుణం కనిపిస్తుంది..

ఉసిరి చెట్టు వేరును మర్రి ఊడలను జటామాంసి వేరును కలిపి నూరి తల మీద బాహ్యంగా ప్రయోగిస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

 అతిమధురం, నల్ల కలువ (నీలోత్పల ) ,ద్రాక్షలను కలిపి నువ్వుల నూనె ,ఆవుపాలు ,నెయ్యి ల తో సహా నూరి తలకు లేపనం చేసుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి.

 జెముడు పాలు ( స్నూహి ),  జిల్లేడు పాలు (అర్క), పొత్తి దుంప (లాంగ లి), గురివింద గింజలు, చేదు పుచ్చ తెల్ల ఆవాలు వసకొమ్ము మేక మూత్రం వీటన్నింటిని కలిపి మెత్తని ముద్దగా నూరి నువ్వుల నూనెలో విధానంలో కాచి తైలం తీసి తలకు రాసుకుంటే మొండిగా ఇబ్బంది పెట్టే పేను కొరుకుడులో సైతం మంచి ఫలితం కనిపిస్తుంది.

 మణి శిల, కాసీసం, మైలుతుత్తం వీటిని సంహితా కారులు అంటారు. ఖా లిత్య వ్యాధిలో లేపన ద్రవ్యాలుగా వాడవచ్చునని సూచించారు. వీటి ఉగ్ర స్వభావం వలన తలమీద బాహ్యంగా ప్రయోగించినప్పుడు నిద్ర స్థితిలోకి వెళ్లిన వెంట్రుకల కుదుళ్ళు తిరిగి ప్రేరేపితమై చైతన్య స్థితిలోకి వచ్చి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

 గుర్రపు గిట్టలను కాల్చి మసి చేసి
 వెన్నె లో కలిపి పేనుకొరుకుడు మీద ప్రయోగించినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది.


జానపద వైద్యం గిరిజన వైద్యం 

మోదుగ గింజలను మెత్తగా నూరి నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

 నల్లుల ను చంపి ఆ రక్తాన్న
 పేనుకొరుకుడు మీద ప్రయోగిస్తే ఫలితం లభిస్తుంది.

 గురివింద గింజలు నీటితో సహా నూరి ఎండబెట్టి కొబ్బరి నూనెలో కాచి తలనూనె గా వాడుకుంటే పేను కొరుకుడు వ్యాధి తగ్గుతుంది.

ములగ పండు ,గురివింద వేరు ,గింజలు నూరి తేనె కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట పూయాలి.

గన్నేరు వేరును అర కిలో మోతాదులో తీసుకుని అరలీటరు నీటిలో వేసి గేదె పాలలో మరిగించి తోడు పెట్టి పెరుగు తయారు చేసుకోవాలి. దీన్ని చిలికి వెన్న తీసి నెయ్యి తయారు చేయాలి. చెంచాడు మోతాదుగా తమలపాకు రసంతో కలిపి తీసుకోవాలి.

 పిల్లిపీచర గడ్డలను అనగా శతావరి వేర్లు మెత్తగా దంచి ముద్ద చేసి పాలతో కలిపి మూడు నెలల పాటు  తలకు ప్రయోగిస్తే జుట్టు దట్టంగా పెరుగుతుంది.

ఆయుర్వేద ఔషధాలు /ayurvedic medicines for hair fall.

జుట్టు రాలడం అనే సమస్యకు ఆయుర్వేదంలో అనేక ఔషధాలు ఉన్నాయి. సమస్య తీవ్రత ,వ్యక్తిగత ప్రకృతి, ఇతర వ్యాధుల ప్రభావం వంటి వి దృష్టిలో ఉంచుకొని ఔషధాలను సూచించాల్సి ఉంటుంది .ఉదాహరణకు గంధక రసాయనం, సప్త అమృతా లోహం ,arogyavardhini vati ,మంజిష్యాద్యారిష్ట, శివ గుటిక ,వసంత మాలతీ రసం ,ముక్తా పిష్టి పొడి , పునర్నవ మండూరం , శంఖ భస్మం ,చంద్రప్రభావటి ,చ్యవన్ ప్రాశ అవలేహ్యం ,ద్రాక్షరిష్టం తదితర ఔషధాలు ఈ సమస్య లో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి సూచించడం జరుగుతుంది. బాహ్యంగా మరిచ్యాది తైలం ,మహా బృంగరాజ తైలం ,జాత్యాది తైలం,  త్రిఫలాది తైలం వంటివి కూడా సమాంతరంగా వాడాల్సి ఉంటుంది.

 నీలి చెట్టును సమూలంగా తెచ్చి ఆరబెట్టి మండించి బూడిద చేయాలి. ఈ బూడిద ను సోయాచిక్కుడు నూనె తో కలిపి స్థానికంగా జుట్టు ఊడిన చోట ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 దొండ ఆకులను దంచి రసం తీసి తలకు పూస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

రేగు ఆకులను ,వేపాకులను ఒక్కోటి ఒక్కో కిలో చొప్పున తీసుకొని ,ఐదు లీటర్ల నీళ్లు కలిపి కేవలం 1  లీటర్ నీళ్ళు మాత్రమే మిగిలే వరకు మరిగించి తరువాత పిప్పి ని కషాయం తో సహా మెత్తగా నూరి పేస్టులాగా చేసి తలకు లేపనం చేస్తుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

పేనుకొరుకుడు ఉన్నచోట నల్ల ఉమ్మెత్త / దతుర పువ్వులను, పండ్లను మెత్తగా దంచి కొబ్బరి నూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగించాలి.

No comments:

Post a Comment