ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్. ఈ నెల రోజుల కాలంలో ప్రార్థనలు, ఉపవాసాలు వంటివి ఆరోగ్యవంతమైన ప్రతి ముస్లింకు తప్పనిసరి. వైద్యపరమైన సమస్యలు ఉన్న వ్యక్తులు అంటే మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మినహాయింపు అయినా అధిక శాతం మంది వైద్య సలహాలు అధిగమించి మరీ ఈ ఉపవాసాలు చేస్తుంటారు .ఈ కారణం చేతనే అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్, డయాబెటిస్ అండ్ రమదాన్ తో కలిసి మధుమేహరోగులు ఉపవాస సమయంలో పాటించ వలసిన నియమాలపై మార్గ నిర్దేశకత్వం చేసింది. ఈ మార్గ నిర్దేశకాలను ప్రధానంగా రోగులకు అవగాహన కల్పించడంతోపాటు ఉపవాస సమయంలో మధుమేహం నియంత్రణ గురించి తెలిపేందుకు రూపొందించారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మరింత అత్యాధునిక సమాచారంతో సలహాలు ఇవ్వడం సాధ్యం కావడంతో పాటుగా తమ రోగులకు రంజాన్ సమయంలో సహకరించడం సాధ్యమవుతుంది.
2001లో ఎపీడీయాఆర్ అధ్యయనంలో వెళ్లడైన సమాచారం ప్రకారం 42 శాతం మంది రోగులు టైప్ వన్ మధుమేహంతో బాధపడుతుంటే 78.7% మంది టైప్ టు మధుమేహంతో బాధపడుతూ కనీసం రంజాన్ సమయంలో 15 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో అంటే 2010 క్రీడ్ అధ్యయనంలో తేలింది ఏమిటంటే తమ అధ్యయనం కోసం నమోదు చేసుకున్న వారిలో 94.2% మంది టైప్ టు డయాబెటిస్తో బాధపడుతున్న రోగులు అయితే వారంతా కూడా కనీసం 15 రోజులు రంజాన్ సమయంలో ఉపవాసం ఉన్నారు. వీరిలో 63.6% మంది ప్రతి రోజు ఉపవాసం చేశారు. ఈ అధ్యయనాలు ప్రతి వ్యక్తికి రంజాన్ మాసంలో ఉపవాసం ఎంత ముఖ్యమో తెలుపుతుంది. అధ్యయనాలు తెలిపే దాని ప్రకారం రమదాన్ కౌన్సిలింగ్ తో హైపోగ్లసీమియా కేసులను తగ్గించడం సాధ్యమవుతుంది .ఇటీవల యూకే, పాకిస్తాన్లలో చేసిన అధ్యయనాలు వెల్లడించిన దాని ప్రకారం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ప్రభావంతమైన విద్య అందించడం ద్వారానే ఇది సాధ్యమైంది .అందువల్ల రంజాన్ సమయంలో మధుమేహాన్ని నియంత్రించడంలో అత్యంత కీలకంశం.. రోగికి గ్లూకోజ్ నియంత్రణ, పర్యవేక్షణ, పౌష్టికాహారం ,వ్యాయామం, మందుల డోస్ ని సరి చేసుకోవడం, రిస్క్ తగ్గించుకోవడం ,ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులలో ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ,హాని జరగకుండా ఏ సమయంలో ఉపవాసాన్ని విరమించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించడం అవసరం .ఉపవాస సమయంలో అతి ప్రమాదకరమైన అంశాలు అంటే హైపోగ్లసిమియా, హైపర్ గ్లైసిమియా, డిహైడ్రేషన్ వంటివి ఉంటాయి. ఉపవాసం చేయాలనుకునే మధుమేహ రోగులు రంజాన్ కు ముందుగానే పరిశీలన, కౌన్సిలింగ్ ను హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వద్ద తీసుకోవడంతో పాటుగా డైటీషియన్ సలహాలు తీసుకోవడం అతి కీలకం.
రోగి స్థితిని పరీక్షించి ,ప్రమాదకారకాలయ్యే అంశాలను గుర్తించి ,స్వీయ నియంత్రణ పట్ల రోగి ని ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది .అలాగే రోగికి సంబంధించిన ప్రత్యేక ట్రీట్మెంట్ ప్రణాళిక సైతం సమర్పించాలి. హైపోగ్లీసిమియా ప్రమాదం అధికంగా కలిగిన రోగులు, మధుమేహాన్ని సరిగ్గా నియంత్రించలేని రోగులు, అధిక లేదా స్వల్ప మధుమేహాల కారణంగా ఇటీవల కాలంలో హాస్పిటల్లో చేరిన వారు, కొద్దిగా లేదంటే తీవ్ర స్థాయి మధుమేహం కలిగిన గర్భవతులైన మహిళలు, దీర్ఘకాల కిడ్నీ బాధితులు లేదా గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు, మధుమేహ సంబంధిత సమస్యలు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఉపవాసాన్ని వదిలివేయడమే మంచిది. ఫిజీషియన్ సలహాల మేరకు తప్పకుండా మందులు తీసుకోవాలి.
ముఖ్యమైన ఆహార పద్ధతులు..
సేహర్ ,ఇఫ్తార్ నడుమ మీరు తీసుకునే రోజువారీ కేలరీలను విభజించుకోవాలి .అవసరమైతే ఒకటి నుండి రెండు స్నాక్స్ తప్పనిసరి .భోజన సమతుల్యత సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. మీరు తీసుకునే భోజనంలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్స్, 20 నుండి 30% ప్రోటీన్స్, 35 శాతం కన్నా తక్కువ ఫ్యాట్స్ ప్రధానంగా మోనో పాలీ శాచూరేటెడ్
ఫ్యాట్స్ ఉండాలి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తో పాటుగా ఫైబర్ ఫుడ్స్ అందునా ఉపవాసానికి ముందు, తర్వాత నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారాన్ని జోడించాలి ఉదాహరణకు బీన్స్, రైస్, బ్రెడ్. అధికంగా పళ్ళు కూరగాయలు సలాడ్స్ జోడించాలి. అధికంగా ఉండే ఆహారం తగ్గించుకోవాలి. ఉదాహరణకు నెయ్యి, సమోసాలు ,పంచదార అధికంగా ఉండే స్వీట్లు తగ్గించుకోవాలి. అతి తక్కువ వంట నూనె వాడాలి. ఆలివ్, రాప్ సీడ్ లాంటివి మంచిది. సంధ్యా సమయం, సూర్యోదయానికి నడుమ హైడ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నించాలి .అధికంగా నీళ్లు తాగడంతో పాటుగా ఇతర స్వీట్ లేని బేవరేజెస్ తీసుకోవాలి. కెఫినెటెడ్ డ్రింక్ తాగొద్దు.. మధుమేహ రోగులకు రంజాన్ సమయంలో రెగ్యులర్ గా తప్పనిసరిగా ఎస్ఎంబిఐ తప్పనిసరి.
సూర్యోదయానికి మునుపే తినేందుకు ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే తర్వాత రోజు ఉపవాసం ప్రారంభం చేయగలరు.
హైపో లేదా హైపర్ గ్లైసిమియా పరిస్థితి తలెత్తినప్పుడు ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి .గ్లూకోజ్ స్థాయి 80ఎంజి /డిఎల్ కన్నా తగ్గినప్పుడు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను ఏదైనా ఈ దిగువ మార్గాలలో తీసుకోండి. మూడు టీ స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ లేదా అరకప్పు యాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ లేదా ఒక సర్వింగ్ గ్లూకోజ్ జెల్ లేదా మూడు ,నాలుగు గ్లూకోజ్ టాబ్లెట్స్ లేదా ఐదు, ఆరు పీసులు హార్ట్ క్యాండీ లేదా ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా తేనె తీసుకోవాలి .15 నిమిషాలు ఆగి గ్లూకోజ్ స్థాయిని పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఈవినింగ్ మీల్ తీసుకోవడానికి ఒక గంట కన్నా ఎక్కువ లేదనుకున్న సమయంలో స్నాక్స్ తీసుకోవాలి.