తిప్ప తీగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తిప్ప తీగ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, నవంబర్ 2016, శనివారం

తిప్పతీగ - ఆయుర్వేదం

తిప్పతీగ తో ప్రయోజనాలు.

తిప్పతీగ పేరును బట్టే ఇది లత అని అర్థమవుతుంది.
సన్నటి కాండంతో వేరొక చెట్టు మీదగానీ లేదా దేనినైనా
ఆసరా చేసుకుని, చుట్టుకుని పాకే మొక్క. దీని ఆకులు ఇంచుమించు తమలపాకుల ఆకారంలో (గుండె ఆకారంలో)ఉంటాయి. బెరడు నూగు (ధూళి)పూసిన ఆకుపచ్చరంగులోఉంటుంది. బెరడు అంతా కంతులు కలిగి ఉంటుంది. వేసవిలో పువ్వులు, శీతాకాలంలో పండ్లు ఉంటాయి. ఈ పండ్లు చిన్నగా,ఎర్రగా ఉంటాయి. వృక్షశాస్త్రంలో దీని పేరు 'టైనోస్పోరా కార్డి
ఫోలియా'. దీనికి 'అమృత, గుడూచీ, చక్రాంగీ, మధుపర్డీ'
అనే పర్యాయపదాలుంటాయి. హిందీలో 'గిలోయా'
అంటారు. దీని రుచి చేదు, కారంగా ఉంటుంది.

ఔషధ గుణాలు : 

ఇది వాత, పిత్త, కఫ వికారాలన్నింటినీతగ్గిస్తుంది. అన్ని రకాల జ్వరాలనూ తగ్గిస్తుంది. ఆకలిపుట్టించి, జీర్ణక్రియను పెంచుతుంది. అమ్మపిత్త (ఎసిడిటీ)వికారాన్ని పోగొడుతుంది. వాంతులు, దప్పికను తగ్గిస్తుంది.
రక్తశుద్ధి చేసి చర్మరోగాలను దూరం చేస్తుంది. శరీర భాగాల్లోనిమంట, మూత్రంలో మంట, దగ్గు, కీళ్లనొప్పుల వంటి వివిధబాధలను తగ్గిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. హీమోగ్లోబిన్ ను పెంచుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. మూలశంకను కూడా తగ్గిస్తుంది. మధుమేహ నివారణ, చికిత్సలకు ఉపయోగపడుతుంది.

భావప్రకాశ :

 దోషత్రయామ తృట్ దాహమేహకాసాంశ్చ
పాండుతాం: కామలా కుష్ట వాతాస్త్ర జ్వరకృమి
వమీన్ హరేత్ ..... హృద్రోగవాతనుత్"

వాడుకునే విధానం : 

దీని ఆకులు, పువ్వులు, పండ్లు,కాండం, దుంప... అన్నీ ఉపయోగకరమే.స్వరసం ( పసరు) : పైన చెప్పిన భాగాలలో లభ్యమైనవాటిని పరిశుభ్రంగా నీటితో కడిగి, పచ్చివాటిని దంచి స్వరసంతీయాలి.  ఒకటి రెండు చెంచాల మోతాదులో తేనెతో రెండుపూటలా సేవించాలి.

చూర్ణం:

 లభించిన భాగాలను బాగాఎండబెట్టి పొడి చేయాలి. మోతాదు :3నుంచి 5 గ్రాములు నీటితో లేక తేనెతో
రెండుపూటలా సేవించాలి. చూర్ణాలనుతయారు చేసి ఆరు నెలల లోపు వాడుకోవాలి.

కషాయం:

 లభించిన భాగాలనుపచ్చివిగానీ, ఎండువిగానీ లేక
చూర్ణాన్నిగానీ ఉపయోగింయచి కషాయంతయారు చేసుకోవాలి (పది గ్రాములద్రవ్యానికి సూమారు 120 మిల్లీలీటర్లనీటిని కలిపి, నాల్గవ వంతు మిగిలేవరకు
మరిగించి, వడగట్టుకోవాలి. (మోతాదు ఐదారు చెంచాలు (3మి.లీ.)రెండు పూటలా ఖాళీ కడుపునతాగాలి.

సత్వం : 

దీన్నే సత్తుఅంటారు. ఈ ద్రవ్యానికిసంబంధించి తిప్పసత్తు. లభించిన భాగాలన్నింటినీ, పచ్చివాటినీ, పరిశుభ్రంగా కడిగి,బాగా దంచి, నీటిలో 12గంటల పాటు నానబెట్టి, ఆ
తర్వాత, పైన తేలిన నీటిని పారబోసి, అడుగున ఉన్న
ముద్దను, నీడలో ఆరబెట్టాలి. అప్పుడు మెత్తగా
నూరితే 'సత్వం' తయారవుతుంది. ఇది ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. మోతాదు -1-3గ్రాములు తేనెతోగానీ, నీటితోగాని రెండుపూటలా సేవించాలి.

అమృతారిష్ట (ద్రావకం):

 ఇది ఆయుర్వేదమందుల షాపులలో లభిస్తుంది. 'ఆసవ, 'ఆరిష్ఠరూపంలో మందుల్ని తయారు చేయడం ఇళ్లలో
సాధ్యం కాదు. ఫార్మశీలలో తయారు చేయాలి.

మోతాదు : 3 లేక 4 చెంచాలకు సమానంగా నీళ్లుకలిపి మూడు పూటలా తాగాలి.

గమనిక : . ఈ లతను ఇళ్లల్లో, పెరళ్లలో లేదాకుండీలలో పెంచుకోవచ్చు. ఈ వ్యాధులను బట్టిదీనితో పాటు ఇతర మూలికల్ని కూడా కలుపుకొని వాడతారు.


Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...