తిప్పతీగ తో ప్రయోజనాలు.
తిప్పతీగ పేరును బట్టే ఇది లత అని అర్థమవుతుంది.
సన్నటి కాండంతో వేరొక చెట్టు మీదగానీ లేదా దేనినైనా
ఆసరా చేసుకుని, చుట్టుకుని పాకే మొక్క. దీని ఆకులు ఇంచు
మించు తమలపాకుల ఆకారంలో (గుండె ఆకారంలో)
ఉంటాయి. బెరడు నూగు (ధూళి)పూసిన ఆకుపచ్చరంగులో
ఉంటుంది. బెరడు అంతా కంతులు కలిగి ఉంటుంది. వేసవిలో
పువ్వులు, శీతాకాలంలో పండ్లు ఉంటాయి. ఈ పండ్లు చిన్నగా,
ఎర్రగా ఉంటాయి. వృక్షశాస్త్రంలో దీని పేరు 'టైనోస్పోరా కార్డి
ఫోలియా'. దీనికి 'అమృత, గుడూచీ, చక్రాంగీ, మధుపర్డీ'
అనే పర్యాయపదాలుంటాయి. హిందీలో 'గిలోయా'
అంటారు. దీని రుచి చేదు, కారంగా ఉంటుంది.
ఔషధ గుణాలు : ఇది వాత, పిత్త, కఫ వికారాలన్నింటినీ
తగ్గిస్తుంది. అన్ని రకాల జ్వరాలనూ తగ్గిస్తుంది. ఆకలి
పుట్టించి, జీర్ణక్రియను పెంచుతుంది. అమ్మపిత్త (ఎసిడిటీ)
వికారాన్ని పోగొడుతుంది. వాంతులు, దప్పికను తగ్గిస్తుంది.
రక్తశుద్ధి చేసి చర్మరోగాలను దూరం చేస్తుంది. శరీర భాగాల్లోని
మంట, మూత్రంలో మంట, దగ్గు, కీళ్లనొప్పుల వంటి వివిధ
బాధలను తగ్గిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. హీమోగ్లో
బిన్ ను పెంచుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. మూలశం
కను కూడా తగ్గిస్తుంది. మధుమేహ నివారణ, చికిత్సలకు ఉప
యోగపడుతుంది.
భావప్రకాశ : దోషత్రయామ తృట్ దాహమేహకాసాంశ్చ
పాండుతాం: కామలా కుష్ట వాతాస్త్ర జ్వరకృమి
వమీన్ హరేత్ ..... హృద్రోగవాతనుత్"
వాడుకునే విధానం : దీని ఆకులు, పువ్వులు, పండ్లు,
కాండం, దుంప... అన్నీ ఉపయోగకరమే.
స్వరసం ( పసరు) : పైన చెప్పిన భాగాలలో లభ్యమైనవా
టిని పరిశుభ్రంగా నీటితో కడిగి, పచ్చివాటిని దంచి స్వరసం
తీయాలి. ఒకటి రెండు చెంచాల మోతా
దులో తేనెతో రెండుపూటలా సేవించాలి.
చూర్ణం: లభించిన భాగాలను బాగా
ఎండబెట్టి పొడి చేయాలి. మోతాదు :3
నుంచి 5 గ్రాములు నీటితో లేక తేనెతో
రెండుపూటలా సేవించాలి. చూర్ణాలను
తయారు చేసి ఆరు నెలల లోపు వాడుకో
వాలి.
కషాయం: లభించిన భాగాలను
పచ్చివిగానీ, ఎండువిగానీ లేక చూర్ణాన్ని
గానీ ఉపయోగింయచి కషాయం
తయారు చేసుకోవాలి (పది గ్రాముల
ద్రవ్యానికి సూమారు 120 మిల్లీలీటర్ల
నీటిని కలిపి, నాల్గవ వంతు మిగిలేవరకు
మరిగించి, వడగట్టుకోవాలి. (మోతాదు
ఐదారు చెంచాలు (3మి.లీ.)
రెండు పూటలా ఖాళీ కడుపున
తాగాలి.
సత్వం : దీన్నే సత్తు
అంటారు. ఈ ద్రవ్యానికి
సంబంధించి తిప్పసత్తు. లభిం
చిన భాగాలన్నింటినీ, పచ్చివా
టినీ, పరిశుభ్రంగా కడిగి,
బాగా దంచి, నీటిలో 12
గంటల పాటు నానబెట్టి, ఆ
తర్వాత, పైన తేలిన నీటిని పారబోసి, అడుగున ఉన్న
ముద్దను, నీడలో ఆరబెట్టాలి. అప్పుడు మెత్తగా
నూరితే 'సత్వం' తయారువుతుంది. ఇది ఎంతకా
లమైనా నిల్వ ఉంటుంది. మోతాదు -1-3
గ్రాములు తేనెతోగానీ, నీటితోగాని రెండుపూ
టలా సేవించాలి.
అమృతారిష్ట (ద్రావకం): ఇది ఆయుర్వేద
మందుల షాపులలో లభిస్తుంది. 'ఆసవ, 'ఆరిష్ఠ
రూపంలో మందుల్ని తయారు చేయడం ఇళ్లలో
సాధ్యం కాదు. ఫార్మశీలలో తయారు చేయాలి.
మోతాదు : 3 లేక 4 చెంచాలకు సమానంగా నీళ్లు
కలిపి మూడు పూటలా తాగాలి.
గమనిక : . ఈ లతను ఇళ్లల్లో, పెరళ్లలో లేదా
కుండీలలో పెంచుకోవచ్చు. ఈ వ్యాధులను బట్టి
దీనితో పాటు ఇతర మూలికల్ని కూడా కలుపు
కొని వాడతారు.