8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

స్త్రీలలో ఒవ్యులేషన్ - అవగాహన

ప్రతి స్త్రీ కీ తల్లి కావాలనే కల ఉంటుంది.తల్లి కాలేని ఆడవాళ్ళు అనుభవించే ఇబ్బందిని వర్ణించటం కష్టం.సమాజ పరంగా ,కుటుంబ పరంగా చాలా ఒత్తిడులు ఎదుర్కొంటారు.సాటి స్త్రీలే తిరస్కరిస్తారు.
తల్లి కావాలని ఉన్నా ,అయేందుకు ఏంచేయాలో తెలియని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.కీలకమైన ఆరోగ్యం,ఆనందం గురించి పట్టించుకోక మిగిలిన అర్థం లేని అంశాలగురించి ఆలోచిస్తారు.వారి నెలవారీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి.రుతుచక్రం సక్రమంగా ఉన్నవారికి సంతానం తప్పకుండా కలుగుతుంది.స్త్రీ తన శరీరంలో ప్రతి నెలా కలిగే మార్పులను అనుభవిస్తుందే కాని అర్థం చేసుకోదు.ప్రతి నెలా హార్మోన్ లు అల్లరి పెడతాయి,చిరాకు,తెలియని ఇబ్బంది,వాటన్నింటినీ తొలగించి ప్రశాంత పరిచే మగతోడు కోసం మనసూ ,శరీరం రెండూ ఎదురుచూస్తాయి.దీనినే వివాహం అన్నారు.ఆ వివాహం తెప్పిచే అంశాలు,అంతర్గతంగా స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలలో జరుగుతుంది.యుక్త వయసులో ఉన్న స్త్రీ శరీరంలో ప్రతి నెలా ఒక అండం విడుదలఔతుంది.ప్రతి అండం మరో జీవికి జన్మనివ్వాలనుకుంటుంది.అందుకే ఆ అండం విడుదల సమయం అమ్మాయిలలో అలజడి కలిగిస్తుంది.పురుషుడితో కలయికకు ప్రోత్సహిస్తుంది.దీనినే వైద్య పరిభాషలో ఒవ్యులేషన్ అంటారు.అంటే స్త్రీ శరీరంలో అండం విడుదలయ్యే సమయం.ప్రతి నెలా ఈ అండం విడుదలయ్యే సమయం స్త్రీకి సంతానం కలిగించే అవకాశం పెంచుతుంది.

బహిష్టుకి ముందు -

తల్లి కావాలని కోరుకునే అమ్మాయి తన అండం విడుదల సమయాన్ని తెలుసుకోవాలి.విడుదలైన అండం పరిమిత కాలం పాటూ పురుయ్షుడి శుక్రకణం కోసం ఎదురుచూస్తుంది.ఆ సమయంలో పురుషుడితో కలవగలిగిన స్త్రీ అద్రుష్టవంతురాలు.తన కడుపులో కొత్త జీవికి ప్రాణం పోస్తుంది.

స్త్రీ ప్రత్యుత్పత్తి అంగం అండాశయం.బాహ్యంగా కనిపించేది యోని ఐతే దాని లోపల ఉంటాయి గర్భాశయం,అండాశయం, అండాశయం నుంచి ఉండే అండనాళం.

ప్రతి నెలా అండాశయం నుంచి ఒక అండం విడుదలఔతుంది.అండాశయంలో అనేక అపరిపక్వ అండాలు ఉన్నప్పటికీ బహిష్టుకి ముందు రోజుల్లో ఒకే ఒక అండం మాత్రం వేగంగా అభివృద్ధి చెంది పరిపక్వ అండంగా మారుతుంది.ఈ అండం మిగతా వాటికంటే వేగంగా పెరిగి పెద్దదౌతుంది.దీనిచుట్టూ ద్రవపదార్థం పోషకపదార్థంగా చేరుతుంది.

హార్మోనుల ప్రభావాన జరిగే ఈ మార్పులతో అండం ఒక అండగుళికగా రూపు దిద్దుకుంటుంది.ఇందుకు 12 నుంచి 14 రోజులు పడుతుంది.పూర్తిగా అభివృద్ధి చెందిన గుళిక బద్ధలై అండం విడుదల చేస్తుంది.ఇది అండనాళికలోనికి ప్రవేశిస్తుంది.

పరిపక్వ అండవిడుదలనే ఒవ్యులేషన్ అంటారు.అండనాళంలో చేరిన అండం శుక్రకణంతో కలిసి పిండంగా మారటానికి సిద్ధంగా ఉంటుంది.

అండవిడుదల సమయం స్త్రీలలో కొన్ని స్పష్టమైన మార్పులు తెస్తుంది.వీటిని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు.గర్భాశయ ముఖద్వారం దగ్గర ద్రవ పదార్థాలు పెరగడం కనిపిస్తుంది.ఇది అంతర్గతంగా జరిగే మార్పు ఐనా దాని ప్రభావం బయటకు కనిపిస్తుంది.తమ బహిష్టుచక్రం మధ్యలో యోనిలో నుంచి ద్రవాలు అతిగా వస్తాయి.ఇది అండం విడుదలను సూచిస్తుంది.

అండం విడుదల సమయంలో - 

పొత్తి కడుపు భాగంలో నొప్పి వస్తుంది.బహిష్టుకి ముందు వచ్చే నొప్పి అండం విడుదలకు సంకేతం.అండం విడుదలకు కొంచెం ముందుయ్గా లేదా విడుదల సమయంలో బాధ ఏర్పడుతుంది.ఐతే ఇది అందరిలో కనిపించదు.ఇది కనిపించిందంటే అండం విడుదలైంది అనె సంకేతం అందుకున్నట్లే.
శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పు కనిపిస్తుంది.ఒళ్ళు వేడెక్కడం అనె మాట వినే ఉంటాం.అది పురుషుడితో కలవమని హార్మోనులు రెచ్చగొట్టడం. అండం వృధా కాకుండా 
పిండంగా మారాలన్న శారీరక తహతహ అలా చేయిస్తుంది.శ్రీర ఉష్ణోగ్రతలో కొంచెం తేడా చేస్తుంది.శరీరం కింది భాగంలో వేడిగా,పైభాగంలో చల్లగా ఉంటుంది.తర్వాత కింది నుచి పైకి క్రమంగా వేడి వ్యాప్తి చెందుతుంది.అంతా సలుపుతుంది అంటారు.ఇది కూడా అండం విడుదలను సూచించేదే.
ఈ మార్పు కొందరిలో ప్రస్ఫుటంగా ఉంటుంది.కొందరిలో అంత తేడా కనిపించదు.ఇలా అండం విడుదలను8 గుర్తించి ఆ రోజులలో తప్పకుండా సెక్ష్ లో పాల్గొంటే తల్లి అయ్యే అవకాశం బాగా పెరుగుతుంది.అండాశయం నుంచి విడుదలైన పరిపక్వ అండం అండ నాళం లోకి చేరుతుంది.అక్కడ దాదాపు 24 గంటలపాటు పురుషుడి నుంచి వచ్చే శుక్రకణం కోసం వేచి ఉంటుంది.

బహిష్టు తర్వాత - 

ఇది సాధారణంగా గత బహిష్టు తర్వాత 14 వ రోజున అయి ఉంటుంది.ఐతే ఇక్కడ కూడా అందరు స్త్రీలలో రుతుచక్రం ఒకేలా ఉండదు.కొందరిలో ఇది 28 రోజుల చక్రంగా ఉంటుంది.ఇది ఉండాల్సిన రీతిలో ఉన్న రుతుచక్రం.ఇటువంటి సక్రమ రుతుచక్రం ఉన్నవారిలో 14 వ రోజున కలయిక గర్భం వచ్చే అవకాశం పెంచుతుంది.కొందరిలో బహిష్టు చక్రం మరీ అంత స్పష్టంగా ఉండదు.అటువంటివారిలో అండం విడుదల తేదీని స్పష్టంగా చెప్పడం కష్టం.

ఎలా జరుగుతున్నా రుతుచక్రమనేది ఒక వయసులో మొదలై మెనోపాజ్ వరకు కొనసాగుతుంది.ప్రతినెలా ఒక అండం విడుదల ఉంటుంది.అప్పుడప్పుడు రుతుచక్రంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు.

కొద్దిగా ముందే బహిష్టు రావడం లేదా ఆలస్యం అవటం వంటివి జరుగుతాయి.కొందరిలో 31 రోజుల రుతుచక్రం ఉంటుంది.వారికి అండం విడుదల 17 వ రోజున జరుగుతుంది.కాబట్టి 14 నుంచి 17 రోజుల మధ్యలో సెక్ష్ లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఎక్కువ.కొంతమందిలో 26 రోజులకు ఒకసారి అండం విడుదల అవుతుంటుంది.అటువంటి వారు గత బహిష్టు తర్వాత 12 వ రోజు కలవటం ద్వారా గర్భం వస్తుంది.క్రమం తప్పక సెక్ష్ లో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గర్భం వస్తుంది.కాని కొంతమంది అంత త్వరగా గర్భం దాల్చరు.అలాంటివారు ఈ రోజులను లెక్కపెట్టుకుని సెక్ష్ లో పాల్గొనటం అవసరమే.

సెక్ష్ లో పాల్గొన్నప్పుడు శారీరకంగా ,మానసికంగా ఆనందం ,తృప్తి కలుగుతుంది.అదే సమయంలో సెక్ష్ తర్వాత స్త్రీ శరీరంలో సంభవించే మార్పుల మీద అవగాహన అవసరం.

ఫలదీకరణం -  

సెక్ష్ లో పాల్గొన్నప్పుడు పురుషుడు తన అంగం స్త్రీ యోని లోకి ప్రవేశపెట్టి స్ఖలిస్తాడు.అపుడు వృషణాలలో తయారైన శుక్ర కణాలు పురుషాంగానికి చేరి,ప్రొస్టేట్ గ్రంధి స్రావాలతో కలిసి యోనిలో వదలబడతాయి.ఒకసారి స్ఖలిస్తే పురుషుడు 60 నుంచి 500 మిలియన్ శుక్రకణాలు స్త్రీ యోనిలోకి వదులుతాడు.అటువంటి కణం కోసం అండం ఎదురుచూస్తుంటుంది.అన్నిచోట్లా శుక్రకణాలు యోనిలోకి వదలబడినా చివరికి అండం సమీపానికి చేరేవి కేవలం 200 కన్నా ఎక్కువ ఉండవు.వీటిలో ఏదో ఒక కణమే చివరికి అండాన్ని ఫలదీకరణం చేయగలుగుతుంది.శుక్రకణం కొరడా వంటి తోకను కలిగి ఈదుతుంది.వె ఈతతో వెతుక్కుని వెళ్లి అండాన్ని తాకి అండంతో కలుస్తుంది.  ఆండంతో కలిసే  ముందు తోకను వదిలేస్తుంది.అండం శుక్రకణం కోసం 24 గంటలు మాత్రమే వేచి ఉండగలదు.కాని శుక్రకణం యోనిలో వదలబడిన తర్వాత 48 గంటల వరకు చైతన్యవంతంగా ఉంటుంది.కలయిక తర్వత ఏర్పడిన సమ్యుక్తబీజం నుంచే కొత్త జీవి ఏర్పడటం మొదలవుతుంది.అందుకు తగిన ఏర్పాటు గర్భాశయంలో ప్రతినెలా చేయబడుతుంది.ఫలదీకరణ చెందిన అండం నెమ్మదిగా గర్భాశయం చేరి గర్భాశయ గోడలోకి చేరుతుంది.ఆ సమ్యుక్త బీజం వచ్చి స్థిరపడేందుకు అవసరమైన సౌకర్యం గర్భాశయంలో   జరుగుతుంది.  ఈవన్నీ హార్మోన్ ళా ప్రభావాన జరిగే మార్పులే. ఘర్భాశయ గోడలో చేరిన సమ్యుక్త బీజం తల్లి నుంచి ఆహారం తీసుకునేదుకు వీలైన పేగును ఏర్పరచుకుని గోడ నుంచి వెలుపలికి వచ్చి ఎదగటం మొదలుపెడుతుంది.9 నెలలు ఎదగటానికి అవసరమైన ద్రవతిత్తిని గర్భాశయం పిండంలో ఏర్పరచుకుంటుంది.

హార్మోన్ లు సక్రమంగా ఉండాలి.- 
ఆండ విడుదలకు ముందు  ఒక పుటికలో ఉంటుంది.ఆ పుటిక పగిలి అండం బయటకు వస్తుంది.పుటిక పగిలినపుడు ప్రొజెస్టిరోన్ కూడా విడుదల చేయబడుతుంది.ఇది గర్భంలో పిండం ఎదుగుదలకు సహకరిస్తుంది.

24 గంటలలోపు ఫలదీకరణకు నోచుకోలేకపోయిన అండం దానితోపాటే ఫలదీకరణం జరిగినపుడు దానిని అందుకోవడానికి గర్భాశయంలో జరిగిన ఏర్పాట్లు కలగలిపి బయటకు పంపబడతాయి.యోని ద్వారా అలా అవి బయటకు పంపబడినప్పుడు రక్తం,పలుచని కండరాలు బయటకు పడతాయి.వీటినే బహిష్టు రక్తం అంటారు.ఇలా ఒకసరి బహిష్టు అయిపోగానే తిరిగొచ్చే నెలలో ఫలదీకరణం అవకాశం కోసం స్త్రీ శరీరంలో  మార్పులు మొదలౌతాయి.

ప్రతి నెలలో అండం ఆశగా పిండం అవగలనని ఎదురుచూస్తుంది.ఆ ఆశ ఫలించనపుడు విచ్చిన్నమౌతుంది.అండం విడుదల తీరునుంచి పురుషుడి నుంచి శుక్రకణం అందుకునేంతవరకు ఎక్కడ ఏ లోపం ఏర్పడినా ఆమెకు గర్భం రాదు.హార్మోన్ ల లోపంతో అండాలు సక్రమంగా విడుదల కాకపోయినా ,విడుదలయిన అండం గర్భాశయం వైపు ప్రయాణం చేయడానికి వీలులేకుండా అనండనాళాలు మూసుకుపోయినా సమస్యే .ఫలదీకరణం చెందిన అండం గర్భాశయాన్ని చేరి స్థిరపడాలంటే హార్మోన్ ల పాత్ర సక్రమంగా ఉండాలి.అవి సక్రమంగా పని చేసినప్పుడు అండం పిండంగా మారుతుంది.అమ్మాయి అమ్మవుతుంది.

1, జనవరి 2013, మంగళవారం

పసుపు తో ఆయుర్వేద ఉపయోగాలు.

హిందూ సంస్కృతిలో పసుపుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.సౌభాగ్యానికి ,ఆరోగ్యానికి సంకేతాలు పసుపు కుంకుమలు.ఆడవారి ఐదోతనానికి , ముత్తైదువల మాంగళ్యానికి రక్ష పసుపు కుంకుమలు.

క్రిమిసంహారిణి గా , ఆరోగ్యప్రదాయిని గా కొన్ని వేల ఏళ్ళనుండీ పసుపు విరాజిల్లుతోంది.మతవిశ్వాసాలకు , శాస్త్రీయ పరిశోధనలు తోడవడంతో పసుపు అంతర్జాతీయ ఖ్యాత్రి గాంచింది.

పసుపు శాస్త్రీయనామం కుర్ కుమ లొంగ,ఇది జింజిబరేసి కుటుంబానికి చెందింది.అల్లం వలె ఇది భూమ్యాంతర కాండాలుగా పెరుగుతుంది.

పసుపుపై అంతర్జాతీయంగా కొన్ని వేల సంఖ్యలో పరిశోధన పత్రాలు వెలువడుతున్నాయి.వాపులు , క్యాన్సర్ , కీళ్ళవాతం వంటి వ్యాధులను అరికట్టడమే  కాకుండా , బ్యాక్టీరియా , వైరస్ లను అదుపు చేయడం లో , రోగ నిరోధక శక్తి పెంచడంలో విశేష ఖ్యాతి గడించింది.క్యానసర్ వ్యాధి నివారణలోనూ , మాలిగ్నెంట్ కణజాలాల పెరుగుదలను నిరోఢించడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. 

భారత దేశంలో సుమారు 5000 సంవత్సరాలకు పూర్వమే అయుర్వేద వైద్యంలో పసుపు విశిష్టతను గుర్తించారు.జీర్ణాశయ సమస్యలకు, గాయాలు,దెబ్బలు మానడానికి పసుపును విరివిగా వాడేవారు.ఎలుకల్లోని కొలెస్టరాల్ పరిమాణంపై ప్రభావం చూపుతుందని 40 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు.1990 దశకంలో జరిగిన ప్రయోగాల్లో పసుపులోని కుర్కుమిన్ క్యాన్సర్ పై ప్రభావం చూపుతుందని తెలిసింది.

వాపులు ,దెబ్బలు, పాంక్రియాస్ కు వచ్చే క్యాన్సర్ ,అల్జిమీర్స్ వ్యాధి , చక్కెర వ్యాధి ,కొలైటిస్, గాస్ట్రైటిస్,జ్వరాలు, ఎలర్జీ , హృద్రోగాలు,వంటి అనేక వ్యాధుల నిర్మూలన , అదుపులో పసుపు తోడ్పడుతుందని ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది.

పసుపులో ఉండే కుర్కుమిన్ అనేక వ్యాధులను నయం చేస్తుందని తెలిసింది.ఎలుకల్లో వచ్చే కీళ్ళ వాతం , కీళ్ళ క్షీణత, వాపులను , పసుపు వేర్ల నుండి సంగ్రహించిన పదార్థం అడ్డుకుంది.అల్జిమీర్స్ వ్యాధి కారకాలను బలహీన పరిచేలా కురుకుమిన్ పని చేసింది.కొలాన్ క్యాన్సర్ ను వేగిర పరిచే హార్మోనులను నియంత్రిస్తుంది కొలాన్ , రిక్టంలలో కలిగే పాలిప్స్ , సీజు , సంఖ్యలను , కుర్కుమిన్ మరియు , క్వర్సెటిన్ లను కలిపి వాడి తగ్గించగలిగారు.మైలాయిడ్ ల్యుకేమియా ఉన్నవారికి కుర్కుమిన్ పెద్ద మోతాదులో ఇవ్వగా క్యాన్సర్ కణాల విభజన్ ఆపడం , లెక చంపడం జరిగింది.కొలాన్ క్యాన్సర్ , బ్రెస్ట్ క్యాన్సర్ లపై కుర్కుమిన్ వ్యతిరేక ప్రభావం చూపింది. 

సకల శుభకరమైనది పసుపు.బిడ్డ పుట్టినది మొదలు , అనేక శుభకార్యాలలో పసుపు ప్రముఖ పాత్ర వహిస్తోంది.

1. పసుపుతో పురిటి స్నానం.

2.పసికందు ముసముసలాడుతుంటే మాడున పసుపు అద్దుతారు.

3.ఆడబిడ్డలకు ఒంటి నిండా పసుపు , సున్ని పిండిలతో నలుగు స్నానం.

4.ప్రతి హిందు స్త్రీ పూర్వకాలంలో ముఖానికి పసుపు రాసుకునేవారు .తరువాతె స్నానం.

5.కొత్త పెళ్ళికూతురు పాదాలకు పసుపు పారాణి , మంగళ స్నానంలో పసుపు.

6.పెళ్ళి పనులకు నాంది రోకలికి ,రోటికి పసుపు కొమ్ము కట్టడం.రోలులో పసుపు కొమ్ములను ముత్తైదువలు దంచడం.
7. పసుపులో తడిసిన మధుపర్కాలు వధూవరులు ధరిస్తారు.

8.మంగళసూత్రాలను ఎంతటి ధనవంతులైనా పసుపుతాడుతో ముడి వేస్తారు/

9.కొత్త బట్టలకు పసుపు పెడతారు.

10.కొత్త పుస్తకాలపై ఓం , శ్రీ అనే అక్షరాలు పసుపుతో రాస్తారు.

11.ఆడవారికి పెళ్ళైన తర్వాత పసుపుకుంకుమల కింద కొంత భూమి లేక డబ్బు ఇస్తారు దీనినే స్త్రీ ధనం అంటారు.

12. అపవిత్రమైన వస్తువులపై పసుపు నీరు చల్లి శుద్ధి చేస్తారు.

13.గడపలకు పసుపు పూసి రక్షణ కల్పించుకుంటారు.

14.పేరంటాలలో కాళ్ళకు పసుపు పూసుకుంటారు.

15.అన్ని రకాల శుభపత్రాలకు చివర పసుపు రాస్తారు.

16.ఏ పూజ చేసినా, శుభకార్యం జరిగినా ముందుగా వినాయకుడిని పసుపుతో తయారుచేసి పూజిస్తారు.

17. పూజలో హర్ద్రాక్షతలు వాడతారు.

18.కైలాసగిరి నోములో 5 కుంచాల పసుపు ,5 కుంచాల కుంకుమను అమ్మవారికి పూజ చేసి తర్వాత ముత్తైదువలకు పంచుతారు.

19.కుంకుమ నోములో ఊరిలోని వివాహితులందరికీ పసుపుకుంకుమలను పంచుతారు.

20. బాలింతలకు వేడిచేయడం కోసం కాళ్ళకు పసుపు రాసి, ఒళ్ళంత పసుపు , సున్ని పిండిలతో నలుగు పెడతారు.

21.అక్షయబొండాల నోములో ఐదుగురు ముత్తైదువలకు ఏడాదిపాటు ఐదేసి పసుపు ఉండలను బొట్టుపెట్టి ఇచ్చుకుంటారు.

22.పసుపు ఉపయోగించకుండా ఏదీ శుద్ధి అవదు.


ఆయుర్వేద ఉపయోగాలు - 

1. పిష్ట మేహం   - పసుపు, మాను పసుపు ( దారు హరిద్ర ) చూర్ణాల మిశ్రమాన్ని నీళ్ళలో కలిపి తీసుకోవాలి.

2.చర్మ వ్యాధులు ,గజ్జి,ఎక్జిమా తగ్గడానికి  - పసుపును శుద్ధి చేసిన గోమూత్రం తో కలిపి ఒక నెల పాటు తీసుకోవాలి.

3.రక్త హీనత - పసుపు, త్రిఫలా చూర్ణం,నెయ్యి,తేనె ల మిశ్రమాన్ని టీ స్పూన్ మోతాదులో ప్రతి రోజూ తీసుకోవాలి.

4.కామెర్లు  - పసుపును , స్వర్ణ గైరికాన్ని ( కావి రాయి ) మెత్తగా నూరి కలపాలి.ఈ మిశ్రమానికి ఉసిరి రసం చేర్చి నూరాలి.దీనిని అంజంగా కళ్ళకు పెట్టుకుంటే కామెర్లలో హితకరంగా ఉంటుంది.

5. కడుపు నొప్పి - పసుపు ( 5 భాగాలు ) ,వాము ( 5 భాగాలు )సైంధవ లవణం  ( 1 భాగం ) కలిపి , ఈ మిశ్రమాన్ని నెయ్యితో కలిపి వేడి చేసి తీసుకోవాలి.
6 . పొక్కులు , బొబ్బలు , విసర్పం తగ్గడానికి  - పసుపును , గుంటగలగర ( భృంగరాజ ) వేరును కలిపి నీరు చేర్చుతూ ముద్దగా నూరి బాహ్యంగా వాడాలి.
7. వాత రక్తం తగ్గడానికి - పసుపును ,తిప్ప తీగను కలిపిముద్దగా నూరి అరకప్పు కషాయాన్ని  తేనె చేర్చి తీసుకోవాలి.

8.మూత్రమార్గంలో ఇసుక వంటి రేణువులు వస్తున్నప్పుడు  - పసుపును కాంజికంతో ( బియ్యానికి నాలుగు రెట్లు నీళ్ళు కలిపి ఉడకబెట్టిన పదార్థం ) కలిపి తీసుకోవాలి.

9. గోరుచుట్టు తగ్గడానికి  - పచ్చి పసుపు స్వరసానికి కరక్కాయ పెచ్చులను  కలిపి ఇనుప రోలులో ముద్దగా దంచి గోరుచుట్టూ మీద లేపనంగా రాస్తే చీము పక్వమై పగిలి ఉపశమనం లభిస్తుంది.

10 . అర్శమొలలు తగ్గడానికి  - పసుపును జెముడు పాలతో కలిపి ముద్దగా నూరి బాహ్యంగా ప్రయోగించాలి.పసుపు,పిప్పళ్ళూ, గోపిత్తం ( ఆక్స్ బైల్ ) వీటిని కలిపి మెత్తగా నూరి బాహ్యంగా ప్రయోగించాలి.
11 . ఒళ్ళు నొప్పులు తగ్గడానికి - చెంచాడు పసుపును రెండు కప్పుల పాలకు చేర్చి మరిగించి ఉదయం ఒక కప్పు , రాత్రి ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.

12 . మొటిమలు , బ్లాక్ హెడ్స్ తగ్గడానికి - చిటికెడు పసుపును ,కొత్తిమీర ఆకుల కషాయంతో కలిపి బాహ్యంగా ముఖ చర్మం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.
13. కాలిన గాయాలు తగ్గడానికి - చెంచాడు పసుపును ,చెంచాడు కలబంద గుజ్జును కలిపి కాలిన గాయం మీద రాయాలి.

14.ముఖ వర్చస్సు పెరగడానికి - పసుపు , మీగడ , చందనం , చిరు శనగల పిండి ,వీటి మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.
15. దీర్ఘ కాలపు వ్రణాలు తగ్గడానికి - పసుపుకు వేప నూనెను కలిపి వ్రణం తయారైన చోట బాహ్యంగా ప్రయోగించాలి.

16. రక్త మొలలు తగ్గడానికి - పసుపు , ఆవనూనె , ఉల్లి రసం మిశ్రమాన్ని మొలల మీద నేరుగా ప్రయోగించాలి.రక్త స్రావాన్ని ఆపడానికి 1-2 చెంచాల పసుపును రక్తస్రావం ఆగిపోయేవరకు తీసుకోవాలి.సాధారణంగా ఒక గంటలో రక్తస్రావం ఆగిపోతుంది.
17. గర్భధారణలో రక్తస్రావం కనిపిస్తుంటే  - మరిగే నీళ్ళకు 2 చెంచాలు పసుపును చేర్చి ప్రతి రోజూ , రక్తస్రావం ఆగిపోయేంతవరకు తీసుకోవాలి.

18. రక్త హీనత తగ్గడానికి - ప్రతి రోజూ చెంచాడు పసుపును , తేనెతో కలిపి తీసుకుంటే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
పసుపు ,త్రిఫలా చూర్ణం ,నెయ్యి ,తేనె వీటి మిశ్రమాన్ని టీ స్పూన్ మోతాదుగా ప్రతిరోజూ తీసుకుంటే రక్తం పెరుగుతుంది.
24. దగ్గుతో కూడిన ఉబ్బసం తగ్గడానికి - పచ్చి పసుపు కొమ్మును 21 రోజుల పాటు ఉప్పు నీళ్ళలో ఊరేసి బాగా ఆరబెట్టి ,నిప్పుల మీద వేడి చేసి నోటిలో ఉంచుకొని రసం పీల్చాలి.

25 . కఫం వల్ల దప్పిక కలిగితే - పసుపు కషాయానికి తేనె , పంచదార కలుపుకొని తాగితే ' ఎడినాయిడ్స్ ' వంటి సమస్యల కారణంగా నోరెండి పోవటం ,దప్పికగా అనిపించటం వంటి సమస్యలు తగ్గుతాయి.

26 . మూత్రాధిక్యత , మూత్రం కలకబారటం సమస్యకు - పసుపు పొడిని ఉసిరిక స్వరసానికి కలిపి కొద్దిగా తేనె చేర్చి తీసుకోవాలి.
19. కళ్ళకలక తగ్గడానికి - స్వచ్చమైన పసుపు నీటిలో శుభ్రమైన నూలు గుడ్డను ముంచి కళ్ళను తుడుచుకోవాలి.

20. బోదకాలు తగ్గడానికి - పసుపుకు బెల్లం కలిపి ముద్దగా నూరాలి. 5 గ్రాముల మోతాదులో ,శుద్ధి చేసిన గోమూత్రంతో   తీసుకోవాలి.
21 . పొడి దగ్గు తగ్గడానికి  - పసుపును అడ్డసరం ( వాస ) ఆకుల స్వరసంతో కలిపి మెత్తగా నూరి మీగడతో కలిపి  1 టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

22 . ఉబ్బసం తగ్గడానికి - పసుపు మసిని ( క్లోజ్డ్ హీటింగ్ ) తేనెతో కలిపి తీసుకోవాలి.1 గ్రాము పసుపు మసి ని 1 స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి.

23. పిల్లి కూతలతో కూడిన ఉబ్బసం, చాతీలో పట్టేయడం తగ్గడానికి - పసుపు , ఆకుపత్రి , ఆముదపు వేళ్ళు ,లక్క , మణీశిల ( రియల్ గార్ ) ,తాళకం ( ఆర్పిమెంట్ ) ,దేవదారు , జఠామాంసి వీటితో ధూమవర్తిని తయారు చేసుకొని పొగ పీల్చాలి,లేదా వీటి పొడిని హుక్కా మాదిరిగా పీల్చాలి.

24. దగ్గుతో కూడిన ఉబ్బసం తగ్గడానికి - పచ్చి పసుపు కొమ్మును 21 రోజుల పాటు ఉప్పు నీళ్ళలో ఊరేసి బాగా ఆరబెట్టి ,నిప్పుల మీద వేడి చేసి నోటిలో ఉంచుకొని రసం పీల్చాలి.ఉబ్బసంగా అనిపించినప్పుడు పసుపు కొమ్మును నిప్పుల మీద వేడి చెయ్యాలి.తరువాత నోటిలో ఉంచుకొని రసం పీల్చాలి.

25 . కఫం వల్ల దప్పిక కలిగితే - అర కప్పు  పసుపు కషాయానికి తేనె , పంచదార కలుపుకొని తాగితే ' ఎడినాయిడ్స్ ' వంటి సమస్యల కారణంగా నోరెండి పోవటం ,దప్పికగా అనిపించటం వంటి సమస్యలు తగ్గుతాయి.

26 . మూత్రాధిక్యత , మూత్రం కలకబారటం సమస్యకు - అర టీ స్పూన్ పసుపు  పొడిని  2 టీ స్పూన్ ల ఉసిరిక స్వరసానికి కలిపి కొద్దిగా తేనె చేర్చి తీసుకోవాలి.ఎక్కువ సార్లు మూత్రం రావడం, మూత్రంలో మడ్డి రావడం తగ్గుతాయి.

27 .చికెన్ పాక్స్ తగ్గడానికి - అర టీ స్పూన్ పసుపును గుప్పెడు చింతాకుతో కలిపి నూరాలి.చల్లటి నీళ్ళతో కలిపి తీసుకుంటే చికెన్ పాక్స్ లో ఉపశమనం కలుగుతుంది.
28.మొటిమలు తగ్గడానికి - జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి.

29.కఫం తగ్గడానికి - వేడి పాలలో కొద్దిగా పసుపును కలిపి తాగాలి.

30.జీర్ణశక్తి పెరగడానికి - పెరుగు లేదా తేనెలో పసుపు కలిపి తాగాలి.

31.రక్తం శుద్ధి కావడానికి - ఆహార పదార్థాలలో  పసుపును కొద్దిగా వాడాలి.

32.దగ్గు ,జలుబు తగ్గడానికి - మరుగుతున్న నీటిలో పసుపును కలిపి ఆవిరి పట్టాలి.

33.నొప్పులు , బెణుకులు తగ్గడానికి - పసుపు , ఉప్పు , సున్నం కలిపి రాయాలి.

34.డయాబెటిస్ తగ్గడానికి - ఉసిరి పొడిలో పసుపు కలిపి , నీటిలో కరిగించి తాగాలి.

35.తల తిరుగుడు తగ్గడానికి - పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి.

36.ముక్కు దిబ్బడ ,జలుబు తగ్గడానికి - నిప్పులపై పసుపు వేసి ఆ పొగను పీల్చాలి.

37.పంటి నొప్పి , దుర్వాసన, అరుచి తగ్గడానికి - పసుపులో మెత్తటి ఉప్పు కలిపి పళ్లు తోముకోవాలి.

38.స్థూలకాయం తగ్గడానికి - పసుపును వాడితే కొవ్వు పెరగకుండా చేసి స్థూలకాయాన్ని అదుపు చేస్తుంది.

39.అల్జీమర్స్ / మతిమరుపు వ్యాధి తగ్గడానికి - పసుపులో ఉండే కుర్కుమిన్ అల్జీమర్స్ వ్యాధిలో వచ్చే గ్నాపక శక్తి తగ్గుదల, వాపులు , మానసిక నిస్త్రాణ తగ్గిస్తుంది.

40.గుండె సంబంధిత వ్యాధులు తగ్గడానికి - రక్తాన్ని శుభ్రపరుస్తుంది, ఎల్.డి.ఎల్ కొలెస్టరాల్ ని బయటకు పంపే కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

41.క్యాన్సర్ తగ్గడానికి - పసుపులోని యాంటి ఆక్సిడెంట్లు పిల్లల ఆరోగ్యం కాపాడి ల్యుకేమియా రాకుండా చేస్తుంది.క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

42.కేశ సంబంధ సమస్యలు తగ్గడానికి - పసుపు వాడితే చుండ్రు తగ్గుతుంది.కేశ సంబంధ వ్యాధులకు వాడే పదార్థాలలో పసుపును ఉపయోగిస్తారు.

43.చర్మ ఆరోగ్యానికి - చర్మం పై ఏర్పడే తట్టు , ఎక్జిమా వంటివి, చర్మం శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపే ప్రక్రియ , దీనిలో పసుపు సాయపడడం వల్ల కాలేయం మరింత సమర్థంగా పని చేస్తుంది.
44.జ్వరం తగ్గడానికి - పసుపును పాలలో లేదా తేనెలో కలిపి తీసుకోవాలి.దీనివల్ల దయేరియా , ఋతుసంబంధ సమస్యలు కూడా నయమవుతాయి.

45.ఆస్త్మా తగ్గడానికి - ఒక కప్పు పాలలో ఒక టీ స్పూన్ పంచదార కలిపి మరిగించి తాగాలి.

46.ఎనీమియా / రక్తహీనత తగ్గడానికి - ఒక స్పూన్ పసుపు జ్యూస్ ను తేనెలో కలిపి ప్రతి రోజూ తాగాలి.

47.కొలాన్ క్యాన్సర్ తగ్గడానికి - పసుపు , ఉల్లి కలిపి వాడినట్లయితే కొలాన్ క్యాన్సర్ తగ్గించవచ్చునని కొన్ని పరిశోధనల సారాంశం.

48.ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గించడానికి - క్యాలిఫ్లవర్ ,క్యాబేజి, బ్రొకోలి వంటి వాటితో పసుపు కలిపినప్పుడు ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా చెయ్యడమే కాకుండా ,అప్పటికే ఉన్న క్యాన్సర్ మరింతగా వ్యాప్తి చెందకుండా చేస్తుందని ఒక పరిశోధన సారాంశం.

49.ఆరోగ్యం , ఆనందం కలగడానికి - ఈ రెండింటిని కలిగించే పోషకాలు, విటమినులు దీనిలో ఉన్నాయి.

50.ఎమిలాయిడ్ ఫ్లేక్స్ తగ్గడానికి - మెదడులో తయారయ్యే ఈ నోడ్స్ ను పసుపు తగ్గిస్తుంది.

51.ఆయుర్వేద వైద్యంలో  - వేడి చేస్తుంది.పైల్స్ కు మంచి మందు.ల్యుకేరియాపై పని చేస్తుంది.కఫం తగ్గిస్తుంది.మంచి యాంటి ఆక్సిదెంట్ గా పని చేస్తుంది.

పసుపు ఎన్నో సూక్ష్మ క్రిములను సం హరిస్తుంది.శరీరంపై ఏర్పడే గాయాలకు , పుళ్ళకు పసుపు పూస్తే క్రిములు ఆశించవు.సెప్టిక్ అవదు,త్వరగా మానుతాయి.

1.ఇంటి గడపలకు పసుపు పూస్తే సూక్ష్మజీవులు , క్రిమి కీటకాలు  లోనికి ప్రవేశించవనే నమ్మకం .

2.పరిశుభ్రంగా ఉండని నీరు కూడా పసుపు కలిపితే తాగడానికి వీలవుతుంది.

3.పసుపు పూస్తే ,గజ్జి ,తామర వంటి వ్యాధులు తగ్గుతాయి.

4.తడిసున్నంతో పసుపు కలిపి పట్టు వేస్తే గోరుచుట్టు వ్యాధి తగ్గుతుంది.

5.పసుపు కలిపిన ఊరగాయలు ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.

6.ఉప్పు , నూనె,పసుపు కలిపి రాస్తే కాలి ఒరుపులు,దురద తగ్గుతాయి.

7.పసుపు కొమ్ము అరగదీసి రాస్తే తామర తగ్గుతుంది.

సౌందర్య సాధనంగా పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

1.నారింజ తొక్కల పొడిలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

2.మంచి గంధం ,పసుపు సమపాళ్ళలో తీసుకుని తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ గా వాడవచ్చు.

3.మీగడలో పసుపు కలిపి రాసుకుంటే ఫేస్ ప్యాక్ గా ఉపయోగపడుతుంది.

4.పసుపు అవాంచిత రోమాలను తగ్గిస్తుంది.

5. చర్మం పై యు వి కిరణాల ప్రభావం లేకుండా చేసి సహజ సిద్ధమైన పిగ్మెంట్స్ ను కాపాడుతుంది.

6. పెసర పిండిలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.

7.వెన్నలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం , మృదువుగా, నున్నగా,అందంగా ఉంటుంది.

8.నిమ్మరసం లో పసుపు కలిపి రాస్తే చర్మం పై ఏర్పడిన అనేక రకాల మచ్చలు మాయమవుతాయి.
9.పాలల్లో కొద్దిగా  పసుపు కలిపి పేస్ట్ లా తయారు చెయ్యాలి.శరీరంపై పూసి కొద్దిసేపు ఆరనివ్వాలి.నెమ్మదిగా దానిని నీటితో తొలగించాలి.ఇలా వారానికి రెండు,మూడు సార్లు చేస్తే శరీరం , బంగారు కాంతులీనుతూ నిగనిగలాడుతూ ఉంటుంది.

10.పసుపు , మంచి గంధం , పాలు కలిపి పేస్ట్ లా చేసి శరీరానికి రాసుకోవాలి.దీనివల్ల చర్మం పరిశుభ్రపడుతుంది.స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయి.చర్మంపై మచ్చలు పోవడానికి పెరుగు , క్యారెట్ కలిపి వాడాల్సి ఉంటుంది.

11.శరీరంలఒకి పసుపు బాగా గ్రహింపబడాలంటే - నల్ల మిరియాలలో ఉండే పెపరైన్ అనే పదార్థం శరీరం పసుపును గ్రహించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.దీనివల్ల శరీరం పసుపును గ్రహించే శక్తి రెండు వేల రెట్లు పెరుగుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.నల్ల మిరియాల పొడి కలిపితే పసుపు ఆరోగ్య రీత్యా అద్భుతంగా పని చేస్తుంది.





HAPPY NEW YEAR 2013 - నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు - I WISH YOU A VERY HAPPY NEW YEAR 2013

కర్పూరం.. ఆయుర్వేద ఉపయోగాలు..

తెల్లటి కర్పూరానికి హిందూ సంప్రదాయంలో గొప్ప విశిష్టత ఉంది. కర్పూర హారతిని అందుకుని, భగవంతుడిని స్మరించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పవిత్రతకు చిహ్నం.. అంతే కాదు కర్పూరం.. ఔషధ గుణాల పెన్నిధి. మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా కర్పూర హారతి ఇవ్వడం మనకు కనిపిస్తుంది .ఇళ్లల్లో చేసుకునే పూజలు, వివాహాలు, పండుగల సందర్భంగా కర్పూరం వెలిగించి హారతులు అందుకోవడం మనకు తెలుసు .ఇంత పవిత్రంగా పరిగణించే కర్పూరానికి గొప్ప వైద్య చికిత్స విలువలు ఉన్నాయని అంశం అంత విస్తృతంగా తెలియదు. అంతేకాదు కర్పూరం పదం మూలం, అది పరివ్యాప్తమైన విధానం ఎంతో ఆసక్తిదాయకం. ఇంగ్లీషులో కర్పూరాన్ని క్యాంఫర్ అంటారు. ఈ పదం ఫ్రెంచ్ పదం క్యాంఫ్రీ నుండి స్వీకరించబడింది. అలాగే క్యాంపర్ నామం స్పెయిన్ భాష స్పానిష్ నుండి గ్రహించినట్లుగా చరిత్రలో ఉన్న అవగాహన. అంతేకాదు స్పానిష్ లోకి కూడా అరబ్ పదం ఆల్ కఫర్ నుండి వచ్చినట్లుగా చరిత్ర కారులు రూడీగా నిర్ధారించారు .తెల్లటి స్పటికం లా ఉండే కర్పూర పరిమళం అమోఘం ,అద్భుతం. తూర్పు ఆసియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిరంతరం పచ్చగా ఆరోగ్యంగా ఉండే క్యాంఫర్ లారెల్ చెట్టు నుండి కర్పూరాన్ని తయారు చేయడం జరుగుతుంది .

శ్వాస కోశ సమస్యలకు..

 ప్రపంచవ్యాప్తంగా మానవాళి కర్పూరంతో ఎంతో ప్రయోజనం పొందుతోంది .బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. క్రిమి కీటకాలను ధ్వంసం చేసే గుణం ఉంది. దోమల సంహారిని కూడా. వేలాది సంవత్సరాలుగా కర్పూరం ఈ సుగుణాలతో మనకు ఎంతో మేలు కలుగజేస్తోంది. బ్యాక్టీరియాను నాశనం చేసేదిగా కర్పూరమును ఆయుర్వేద నిపుణులు గత 5000 సంవత్సరాలుగా పరిగణించి వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో కర్పూరం చెట్టు బెరడును జ్వరం, మలేరియాలను నయం చేసేందుకు వినియోగిస్తారు. ఆంటీ సెప్టిక్ వస్తువుగా కూడా ఉపయోగిస్తున్నారు .18వ శతాబ్దంలో అమెరికా ,ఐరోపా ఖండాలలో కర్పూరాన్ని ప్రజలు విరివిగా వినియోగించినట్లు వినికిడి .
 శ్వాసకోశ సంబంధ సమస్యల పరిష్కారానికి, అలాగే ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధులు నయం కావడానికి, కర్పూరపు బిల్లను అక్కడి ప్రజలు మెడ చుట్టూ ధరించేవారు .అక్కడ ఇప్పటికీ జలుబు నయం కావడానికి ప్రజలు కర్పూరాన్ని వినియోగిస్తున్నారు అన్నది వాస్తవం.

 కర్పూర తైలం సమర్థమైన ఉత్తేజ పూరిత ద్రవ్యం. రక్తప్రసరణ, మెటబాలిజం, జీర్ణశక్తి రసాల స్రావం, శరీర వ్యర్థాలను బయటికి పంపడం లాంటి విషయంలో కర్పూర తైలం బాగా పనిచేస్తుంది. రక్తప్రసరణ సమస్యలు ,జీర్ణశక్తి, జీవక్రియ సమస్యలు ఉన్నప్పుడు కర్పూరాన్ని నిపుణులు వినియోగిస్తారు .

యాంటీ సెప్టిక్ వస్తువుగా..

 కర్పూర తైలం యాంటీసెప్టిక్ గా, ఇన్ఫెక్షన్ల పైన ,క్రిమి కీటక సంహారిణిగా, సూక్ష్మజీవుల నాశకారిగా, సహజ రక్షణ కారిగా పనిచేస్తుంది. మనం తాగే నీటిలోనూ కర్పూరాన్ని ప్రత్యేకించి వేసవి, వర్షాకాలంలో కలిపి తీసుకుంటారు. ఎందుకంటే ఈ కాలాల్లో నీటిలో సూక్ష్మజీవులు చేరి ఇన్ఫెక్షన్లు కలగజేసే అవకాశం ఉంది. వాటిని నివారించడం కోసం కర్పూరం కలుపుతారు. ఒక సీసాలో లేదా ఏదైనా పాత్రలో కర్పూరం తైలం పోసి మూత పెట్టకుండా ఉంచినా లేదా కొంచెం గుడ్లను తైలంలో కాసేపు నానబెట్టి దాన్ని బయటకు తీసి అలా ఉంచినా క్రిమి కీటకాలు పారిపోతాయి .అలాగే సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి. ఒకటి రెండు చుక్కలు ఎక్కువ మొత్తం ధాన్యంలో వేసినట్లయితే పురుగులు చనిపోయి ధాన్యం సురక్షితంగా ఉంటుంది. అనేక రకాల ఔషధాల తయారీలోనూ కర్పూరాన్ని వాడుతారు. 
చర్మవ్యాధులకు.. చర్మం పైన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారణకు అవసరమైన మందులు తయారీలో కర్పూరం వాడుతారు. ఇక స్నానం చేసే నీటిలో కర్పూర తైలం లేదా కర్పూరం కలిపినట్లయితే శరీరం అంతటినీ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అలాగే పేలను కర్పూరం చంపుతుంది. తెల్ల కర్పూరం నుండి విషతుల్యమైన రసాయనాలు తొలగించిన తర్వాత దగ్గు కోసం ఉపయోగించే సిరప్ లు, చాక్లెట్లు, తీపి పదార్థాలలోనూ వాడుతారు. దగ్గు ని నియంత్రించడంలో తెల్ల కర్పూరం చక్కగా పనిచేస్తుంది. శ్వాసనాలం పై భాగంలో కర్పూరం లో ఉండే పదార్థాలు పూతగా ఏర్పడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హాయిని కలిగిస్తాయి. బ్రాంకైల్ / సూక్ష్మ శ్వాస నాళం , లారింక్స్/ స్వర పేటికలో గల నాళం ..ఫారింక్స్/ స్వర పేటికలో కళ్ళెకు సంబంధించిన పొర వాపు.  నాసిక నాళాలు, ఊపిరితిత్తుల్లో గల ఆటంకాలను తొలగించడంలో కర్పూర తైలం నుండి వెలువడే ప్రగాఢమైన సువాసనలు బాగా దోహదం చేస్తాయి. అందువల్ల శ్వాసకోశ నాలాల్లో ఆటంకాలను తొలగించడానికి ఉపయోగించే బామ్ లు/
 నొప్పినుండి ఉపశమనం కల్పించే లేపనాలు, జలుబు తగ్గ డానికి ఉపయోగించే రబ్ ల/ లేపనాలు లో కూడా కర్పూర తైలం ఉపయోగిస్తారు. అస్తమా చికిత్సలో కూడా కర్పూర తైలం వాడతారు. ఇక ఆయుర్వేదంలో రోగాలకు ప్రధాన కారణంగా నిర్వచించే వాత, పిత్త, కఫ దోషాలను సరిచేసి రోగాలను నయం చేయడానికి కర్పూర తైలం సిఫారస్ చేస్తారు. 
కింద పడడం వల్ల మనికట్టు, చీలమండ లాంటివి వాపులు వస్తే వాటి ఉపశమనానికి ,కండరాల నొప్పులు తగ్గడానికి, కీళ్ల నొప్పులకు, కర్పూర తైలం మర్దన చేయడం  పరిపాటి. ఈ ప్రక్రియలకు కర్పూర  తైలం  మంచి ఔషధం అని ఆధునిక మూలికా వైద్యులు అంగీకరిస్తున్నారు .

మత్తు మందుగా..

అనస్తీషియా గా ప్రత్యేకించి లోకల్ అనస్తీసియా కోసం కర్పూర తైలం సమర్థంగా పనిచేస్తుంది. ప్రత్యక్ష ప్రేరణ గల నరాలను ఇది సుషుప్తావస్థ లో ఉంచుతుంది. అలాగే నరాల వ్యవస్థ అపసవ్యతను సరి చేస్తుంది. వణుకు, మూర్ఛ కలిగినప్పుడు నరాల బలహీనత మొదలగు వాటిలో కర్పూర తైలం వాడుతారు.

 ఆంటీ స్పెస్మాడిక్ అంటే కండరాలు సడలడానికి సమర్థంగా పనిచేస్తుంది. తక్షణం కండరాలు సడలుతాయి .తిమ్మిర్లు తగ్గుతాయి . స్పాస్మాడిక్ కలరాను నయం చేయడంలోనూ బాగా పనిచేస్తుంది .అలాగే మంటలు  తగ్గడానికి, మత్తు కలిగించడానికి ఉపయోగ పడుతుంది. శరీర బాహ్య, లోపలి మంటలు తగ్గడానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. శరీరం, మనసు విశ్రాంతి పొంది, ప్రశాంతతను తాజాదనాన్ని ,హాయిని కలిగిస్తుంది. కర్పూర తైలం మింగడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ కాలం దీన్ని మింగ రాదు. నిపుణుల సలహా పైనే వాడాల్సి ఉంది.

30, డిసెంబర్ 2012, ఆదివారం

పనస పండు.. ఆయుర్వేద ఉపయోగాలు..

పనస పండు.. రక్త పోటును నియంత్రిస్తుంది, ఆస్తమా ను అదుపు చేస్తుంది, చర్మ వ్యాధులను నివారిస్తుంది,మలబద్ధకాన్ని పోగొడుతుంది.

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అని ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానం అని ప్రకృతి వైద్యులు ప్రచారం చేస్తున్నారు.పండ్లు, కూరగాయలు లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి.

పండ్లలో పనస పండు లో మనకు గరిష్ట స్థాయిలో ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండు ను బంగ్లాదేశ్ జాతీయ ఫలంగా ప్రకటించింది. అక్కడి ప్రజలు ఈ ఫలాన్ని ఇష్టంగా ఆరగిస్తారు. ఇది వేలాది సంవత్సరాలుగా అలరారుతూ మానవాళికి ఉపయోగ పడుతోంది. పనస ప్రపంచంలో అత్యంత భారీ ఫలం. పనస చెట్టును సరిగా పోషిస్తే అది దాదాపు వంద సంవత్సరాల పాటు మధుర ఫలాలను ఇస్తుంది. బంగ్లాదేశ్ లో పనస చెట్లు పెరగడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ ఎక్కువగా ఈ తోటలు పెంచుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతంలో కూడా పనస చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడు విరివిగా పనస పండ్లు లభిస్తున్నాయి.పనసలో ఎన్నో పోషక విలువలు ఉండడమే కాదు.దీని పెంపకానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.అందువల్ల పంట పొలాల్లో ఒక మూల ఈ చెట్లను పెంచడం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది.
పనసలో ఏదీ వృథాగా పారవేసేది ఉండదు. పనస తొనలు, లోపలుండే గింజలు , దళసరిగా ఉండే పై తొక్క ఇలా అన్నీ మనం తిని ఆనందించగలిగినవే.పనసలో ఎక్కువగా శ్యాచరేటెడ్ ఫ్యాట్,కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి.అదే సమయంలో విటమిన్ ఎ, సీ, థయామిన్, రిబోఫ్లావిన్, కాల్షియం,పొటాషియం, ఐరన్, సోడియం,జింక్ , నియాసిన్ తదితర అనేక విటమిన్లు, పోషకాలు ఉండి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. అలాగే తక్కువ కేలరీలు ఉన్నందున ఇది ఎంతో ప్రయోజనం కలుగచేస్తుంది. వంద గ్రాముల పనసలో కేవలం 94 కేలరీలు మాత్రమే ఉంటాయి.అందువల్ల శరీర బరువు పెరగకుండా ఉంటుంది. కొందరు వీటి వాసన పడదని భావించే వారు సైతం ఇందులో గల విలువైన పోషకాలను తెలుసుకుని ఇష్టం పెంచుకుంటారు. 

ఇక పనస తొనల్లో ఉండే గింజలు ఎంతో ఉపయోగ కరమైనవి. గింజల్లో విటమిన్ బి 1,బి2 ఎక్కువగా ఉంటాయి. గింజల్లో స్టార్చ్ ఎక్కువగా, ఐరన్, కాల్షియం తక్కువగా ఉంటాయి. పనస పండు లో దాదాపు వంద నుండి 500 వరకు పనస తొనలుంటాయి. సాధారణంగా ఇవి కొంచెం బంకగా ఉంటాయి. కొంతమంది గింజలను ఎండించి దాచుకుని వాడుకుంటారు. వీటిని నూనెలు, సిరప్ లలో కూడా కలపడం జరుగుతుంది.

తొక్క.. 

పనస పండు పైన దళసరిగా ఉండే తొక్క కాస్త ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తుంది. పళ్ళు కోసేవారు ముందుగా చేతులకు ,కత్తికి వేరుశనగ నూనె రాసుకుని కోసి పనస పండ్లను బయటకు తీయడం
 మనకు కనిపిస్తుంది .ఫిలిప్పీన్స్ లో చెక్కలపై చిత్రాలు , నగిషీలు చెక్కే వారిలో సృజనాత్మకతకు, ఊహలకు పనస మంచి వనరుగా ప్రసిద్ధి. అక్కడ పనసపండు బొమ్మను చూసి బౌల్స్ తయారు చేస్తారు. బౌల్స్ ను మరింత అందంగా తయారు చేయడానికి పండ్ల పైన ముళ్లగా ఉండే తొక్కపొడిని ఉపయోగిస్తారు.

కండ.. 

పనస పండు లో బాగా రుచికరమైనది. సువాసన వెదజల్లేది. ఇష్టంగా తినేది కండ. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ గా ఉంటుంది. మల బద్ధకం తో బాధ పడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది.గింజలు.. పనస గింజలు సైతం ఎక్కువ ఫైబర్ ను అందిస్తాయి. వీటిని వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఐతే గింజలను పొడి చేసి తిన్నట్లయితే ఫైబర్ శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.

పొటాషియం సమృద్ధిగా లభించడం వల్ల అధిక రక్త పోటును తగ్గిస్తుంది. పనస చెట్టు వేరు జ్వరం,డయేరియా రుగ్మతలకు పని చేస్తుందని విశ్వసిస్తారు. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ క్యాన్సర్ నుండి హైపర్ టెన్షన్ లను తగ్గించడంలో ఉపకరిస్తాయి. అలాగే ఉబ్బసం తో బాధ పడే వారికి పనస వేరు ప్రయోజనం కలిగిస్తుంది. వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు, చర్మ వ్యాధులలో కూడా చక్కగా పనిచేస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ అల్సర్ గుణాలున్నాయి. పనసలో సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మన శరీరంలో సహజంగా సీ విటమిన్ తయారు కాదు. అందువల్ల మనం తప్పని సరిగా సీ విటమిన్ లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.

 కణజాలాన్ని కలిపి ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ,దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కలిగించగల కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్ళే లక్షణాలను  తగ్గించే గుణాలున్నాయి. ఇన్ని విశేష గుణాలు ఉన్న పనస పండు ను మనం విశేషంగా ఆదరించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...