Wednesday 28 February 2024

రక్తంలో పొటాషియం అధికంగా ఉంటే

 28 సంవత్సరాల వయసున్న వ్యక్తి రక్త పరీక్షలలో పొటాషియం అధికంగా ఉందని తెలిసింది అరటిపండు టమాటా వంటివి మానేయాలని సూచించారు ఆహారంలో ఇంకెటువంటి మార్పులు చేసుకోవాలి

పొటాషియం శరీరం సరిగా పనిచేయడానికి అవసరమైన ఒక ఖనిజం ఇది ఒక రకమైన ఎలక్ట్రోలైట్ ఇది నేరాలు కండరాలు సక్రమంగా పనిచేయడానికి హృదయ స్పందన సక్రమంగా ఉండడానికి సహాయపడుతుంది కణాలలోకి పోషకాలను కణాల నుండి వ్యర్ధ ఉత్పత్తులను తరలించడానికి కూడా సహాయపడుతుంది రక్తపోటుని నియంత్రించేందుకు కూడా పొటాషియం అవసరం కిడ్నీల పనితీరు సక్రమంగా లేకపోవడం వలన రక్తంలో పొటాషియం పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని రకాల మందుల వాడకం వలన కూడా రక్తంలో పొటాషియం పెరిగే అవకాశం ఉంది ఆకుకూరలు తాజా కాయగూరలు అరటి పండ్లు బంగాళదుంప పాలకూర బ్రకోలి, టమాట కొబ్బరి నీళ్లు పాలు పెరుగు అన్ని రకాల పప్పు ధాన్యాలు బాదం అక్రూట్ వంటి గింజలు మొదలైన వారిని పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు వీటిని చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం లేదా మానేయడం చేయవలసి ఉంటుంది బెర్రీ ద్రాక్ష పండ్లు కమలా పండ్లు పరిమిత మోదాతులు పుచ్చకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కజొన్న దోసకాయ వంకాయ ఉల్లి ముల్లంగి మొదలైన వాటిలో పొటాషియం కొంత తక్కువగా ఉంటుంది ఒకవేళ మీకు కిడ్నీలకు సంబంధించిన అనారోగ్యం ఉంటే రీనల్ డైటీషియన్ సలహా మేరకు ఆహారం తీసుకోవడం ఉత్తమము

No comments:

Post a Comment