Saturday 10 February 2024

దంతాల ఆరోగ్యానికి నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

 దంతాల శుభ్రత సరిగా లేనప్పుడు నోటి దుర్వాసన వస్తుంది మనం తినే ఆహారం ఆరోగ్య పరిరక్షణకు ఎంత ఉపయోగపడుతుందో దంతాల ఆరోగ్యానికి అంతే ఉపయోగపడుతుంది పిండి పదార్థాలు లేదా తీయటి ఆహారాన్ని తినేటప్పుడు తాగినప్పుడు నోటిలో దంతక్షయం చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మ క్రిములకు కూడా ఆహారం ఇస్తున్నట్టు ఇటువంటి ఆహారం తీసుకున్నప్పుడు నోటిలో ఆమ్లాలు ఏర్పడతాయి ఈ ఆమ్లాలు ఆహారం తినడం పూర్తయిన 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు దంతాలపై దాడి చేసి దంతాల ఉపరితలంపై ఉండే ఎనామిల్ను విచ్ఛిన్నం చేస్తాయి ఇది దంతా క్షయానికి దారితీస్తుంది పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు ఆకుకూరలు పండ్లు మన దంతాలను శుభ్రం చేసేందుకు ఉపయోగపడతాయి పాలు పెరుగు లాంటిది ఎనామిల్ ను నాశనం చేసే ఆమ్లాల తయారీని తగ్గిస్తాయి పాలిపినాల్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ కూడా దంత సంరక్షణకు మంచిది. తీపి పదార్థాలు బాగా వేడి బాగా చల్లటి పదార్థాలు తగ్గించడంతోపాటు ఆహారం తిన్న వెంటనే నోరు నీటితో పుక్కిలించడం తరచూ నీళ్లు తాగడం రోజుకు రెండుసార్లు దంత దావనం చేసుకోవడం మొదలైన ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటే దంతాలను సంరక్షించుకోవచ్చు నోటి దుర్వాసనను నియంత్రించవచ్చు



No comments:

Post a Comment