Wednesday 28 February 2024

కళ్ళు తిరగడం రక్తం తక్కువ ఉండడం ఎలాంటి ఆహారం తీసుకోవాలి

 70 ఏళ్ల వయసున్న వ్యక్తికి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది రక్తం తక్కువగా ఉందని కూడా అంటున్నారు అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి

తలా కళ్ళు ఎప్పుడు తిరుగుతున్నట్లు అనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు రక్తంలో గ్లూకోజ్ తగ్గడం నీరు తక్కువగా తాగడం మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం నిద్ర సరిగా పోకపోవడం కూడా ఇలా తల తిరగడం జరగవచ్చు ఆహారం మితంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజు తగ్గిపోకుండా చూసుకోవచ్చు పండ్లు కాయగూరలు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి ఆయా కాలాలలో వచ్చే అన్ని పనులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి కాఫీ టీలు పూర్తిగా మానేయాలి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పాలు పెరుగు గుడ్లు మాంసం చేపలు పప్పులు వీటిల్లో ఏదో ఒకటి ప్రతిరోజు తీసుకోవాలి నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలి ఆందోళన తగ్గి విశ్రాంతిగా ఉండడానికి ఏవైనా వ్యాపకాలు అలవాటు చేసుకోవాలి. తగినంత నిద్రకూడా తప్పనిసరి శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే రక్తహీనత వలన కూడా కళ్ళు తిరిగే అవకాశం ఉంది రక్తహీనత నుండి బయటపడడానికి వైద్యులు సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లను వాడడం ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే నల్ల సెనగలు అలసందలు సోయాచిక్కుడు గింజలు మాంసం ఆకుకూరలను చేర్చుకోవడం ముఖ్యం మీ సమస్య ఆహారానికి సంబంధించినది కానప్పుడు వైద్యుల సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి

No comments:

Post a Comment