మెదడుని ఆరోగ్యంగా ఉంచుకుంటే జ్ఞాపకశక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము పెరుగుతాయి అందుకని ఆరోగ్యకరమైన మెదడు కోసం ఏం చేయాలంటే
మనిషి మెదడు 75% నీరే ఏ కొంచెం డిహైడ్రేషన్ అయినా మెదడు పని తీరు మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఆ సమస్య రానీయకూడదు
పీల్చుకునే గాలిలోనూ శరీరంలో ఉన్న రక్తంలోనూ 20% మెదడే తీసుకుంటుంది ఒక్క ఐదు నిమిషాలు ఆక్సిజన్ అందకపోయినా మెదడులో కొన్ని కణాలు చనిపోతాయి
శరీరంలోని కొలెస్ట్రాల్లో నాలుగోవంతు మెదడులోనే ఉంటుంది అక్కడ ప్రతి కణానికి కొవ్వు అవసరం అది లేకపోతే కణాలు చచ్చిపోతాయి ఆహారంలో ఒమేగా త్రీ కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటున్నందున మెదడు కుంచించుకుపోయే ప్రమాదం పెరుగుతుంది లోఫ్యాట్ డైటింగ్ చేసేవాళ్లు వైద్యుల్ని సంప్రదించకుండా ప్రయోగాలు చేయకూడదు
జిపిఎస్ ఉంది కదా అని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం కానీ దానివల్ల మెదడుకి దిక్కులని గుర్తించే శక్తి సన్నగిల్లుతోందట మెదడుకి పని తగ్గించడం మొదలు పెడితే కావాలనుకున్నప్పుడు మళ్ళీ పనిచేయడం జరగదు మెదడుకి తగినంత పని ఇవ్వడమే కాదు శారీరక వ్యాయామం వ్యాయామం ద్వారాను మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలి
కూరగాయలు పండ్లతో కూడిన సమతుల ఆహారం మెదడు ఆరోగ్యానికి అవసరం బిపి షుగర్ లాంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి
నిద్రలేమి కొంగుబాటు ఒత్తిడి ఆందోళన మెదడు పనితీరును బాగా దెబ్బతీస్తాయి..
No comments:
Post a Comment