Friday, 23 February 2024

కూరగాయలు ఎలా తినాలి

 కూరగాయలలో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కాబట్టే వాటిని తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అలాకాని పక్షంలో తినాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే తింటాము అందుకే అన్నంతో సమానంగా కూరగాయలు తినమని చెబుతారు ఇలా తినడం అనేది బరువు తగ్గేందుకు కొలెస్ట్రాల్ కరిగించుకునేందుకు బీపీ డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడుతుంది కూరగాయల్లో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి విటమిన్ ఏ ఈ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకుతాయి ఆకుకూరలు కూరగాయలు దుంప కూర లాంటివి అన్ని కూరలకి ఎందుకే వస్తాయి అందులోనూ ఆకుకూరల్ని వారానికి మూడుసార్లు అయినా తినవలసింది మైక్రో గ్రీన్స్ బేబీస్ పీనచ్ లాంటివి సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు ఆకుకూరలను ఊరికే పోపు పెట్టి అయినా పచ్చకూరలా వండుకోవచ్చు పప్పులోను వేసుకోవచ్చు మిర్యాల పొడి చల్లి కాస్త నూనె వేసి తినొచ్చు. గుమ్మడి టమాట లాంటిది వెజిటబుల్ సూప్ చేసుకోవచ్చు. కూరల్లో ఉల్లి వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది వెజిటబుల్ ఫ్రై అనే ఒక పద్ధతి ఉంది అంటే కూరగాయల్ని కాస్త ఉడికించి తీసి బాండ్లలో కొంచెం నూనె వేసి కాస్త వేయించి తినడం లేత చిక్కుళ్ళు క్యాబేజీ ఆలుగడ్డ సొరకాయ బీరకాయ ఇలా కూరగాయలు చేసుకోవచ్చు అందుకే దీనిలో ఉడకబెట్టిన శనగలు ఎక్కువ సోయా లాంటిది జోడించి చేస్తే బాగుంటుంది, కూరలు తినలేకపోతే వెజిటేబుల్ ప్యూరీలు చూపులు కూడా ప్రయత్నించవచ్చు అన్నంతో ఇష్టం లేకపోతే వామాకు మెంతి క్యారెట్ లాంటి వివిధ ఆకుకూరలు కూరగాయలతో పరాటాలు చేసుకుని తినవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది వీటిలో నచ్చిన పెంచుకోవచ్చు

No comments:

Post a Comment