Friday 16 February 2024

చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఆహార నియమాలు ఏమిటి

 మన ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్లో తేడాలు ఉంటాయి తాగబెట్టిన నూనెలు అధికంగా వాడటం తరచూ వేపుళ్ళు తినడం మటన్ లాంటివి అతిగా తీసుకోవడం ఒకే రకమైన నూనెలు ఎక్కువ కాలం వాడటం లాంటివి దీనికి కారణం కావచ్చు చైనీస్ వంటకాలనీ కొందరు ఇష్టంగా తింటారు అవన్నీ పూర్తిగా మైదాతోనే చేస్తారు ఇది చాలా ప్రమాదకరం కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాలను వదిలించుకోవాలంటే మైదా ప్రాసెస్ ఆహార పదార్థాలను దూరం పెట్టాలి డీప్ ఫ్రైలు మాంసాహారం తగ్గించుకోవాలి పొగ ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయాలి రోజుకు నాలుగైదు సార్లు పండ్లు కూరగాయలు తీసుకోవాలి దీని వల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగి అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోము అలాగే రోజుకు ఒక కప్పు ఓట్స్ బ్రౌన్ రైస్ లాంటి ధాన్యాలు తీసుకోవాలి. అదనంగా ఒక కప్పు పప్పు దినుసులు కూడా జోడించాలి ఆరోగ్యకర కొవ్వుల్ని అందించే బాదం వాల్ నట్స్ తో పాటు ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ కోసం అవి గుమ్మడి గింజలు లాంటివి తినాలి ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ సప్లిమెంట్లు కూడా దొరుకుతాయి చెడు కొవ్వుల్ని దూరం చేయడంలో అల్లం వెల్లుల్లి సైతం సాయపడతాయి అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి రోజు ఓ గంట వ్యాయామం చేయాలి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది

No comments:

Post a Comment