చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగె నాగో ఉయ్యాలో చిక్కుడు దింప ఎవరూ లేరు తీగె నాగో ఉయ్యాలో చిక్కుడు తెంప రామయ్య లేడా తీగె నాగో ఉయ్యాలో
పై జానపద గీతం లో చిక్కుడు పూసింది అంటే అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని చిక్కుడు తెంపుటకు ఎవరు అంటే పెళ్లాడే వాళ్ళు ఎవరని రామయ్య లాంటి భర్త కావాలని అంతరార్థం డాక్టర్ కి బుక్ నుద్దీన్ జానపద సాహిత్యంలో అలంకార విధానము గ్రంథంలో ఈ వివరణ ఇచ్చారు చిక్కుడు పువ్వులు పూసేటివేల చిప్పలతో గంధాలు తీసేటివేల అనే జానపద గీతం కూడా వివాహ సందర్భాన్ని సూచిస్తుందని దీన్నిబట్టి అనుకోవచ్చు చిక్కుడు మన ప్రాచీన సంస్కృతిలో ఒక భాగం భాగం మాసం నాటికి నా మహిమ చూసుకో అని చిక్కుడు అంటుందని రైతు సామెత అప్పటికి చిక్కుడుకాయలు దండిగా పండుతాయి రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథం చేసి పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదన పెడతారు ఇలాగే సెయింట్ జోసెఫ్ పండగ రోజున చిక్కుళ్ళను వండే ఆచారం కూడా కొన్ని విదేశాల్లో ఉంది పైథాగరస్ క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దికి చెందినవాడు బుద్ధుడికి ఇంచుమించు సమకాలికుడు ఆత్మకు పునర్జన్మ లేదని బుద్ధుడు ప్రకటిస్తే ఈ పైథాగరస్ ఆత్మ నశించదని మరొక జీవిగా అవతరిస్తుందని పేర్కొన్నాడు ఈ పునర్జన్మ ప్రక్రియకు చిక్కుడు అవరోధమని తినకూడని దాని నిషేధించాడు చిక్కుడు పువ్వుల్లోంచి విడుదలయ్యే పరాగ రేణువులు గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి రక్త క్షీణత కలిగిస్తాయని భావనతో పైథాగరస్ ఈ భావ బీన్స్ నిషేధం ప్రకటించాడని ఒక వాదం ఉంది సావిజం అంటారు దీనిని చిక్కుడు గింజల్ని ఉడికించి పైపురని తీసేసి తింటే సాగిజం రాదని ఓ మినహాయింపు ఇచ్చారు. ఇవన్నీ అపోహలేనని చిక్కుడుకాయలు రక్త వృద్ధి చేస్తాయని తర్వాతి పరిశోధకులు కనుగొన్నారు ఈ గింజలు కూడా ఇనుప తుప్పు వాసన కలిగి ఉంటాయి కూడా చిక్కుళ్ళు అధికంగా మాంసకృత్తులు అందిస్తాయి క్యాన్సర్ వ్యాధిలో క్యాన్సర్ కణాలని ఎదుర్కోగల సమర్థత వీటికి ఉంది పెద్ద ప్రేమల్లో వచ్చే క్యాన్సర్ పైన పని చేస్తాయని కనుగొన్నారు బాలింతలకు పాలు పెంచుతాయి గుండెకు మేలు చేస్తాయి పురుషుల్లో జీవకణాలను పెంచుతాయి పార్కిన్ సోనిజం అనే వణుకు వ్యాధిని తగ్గిస్తాయి చిక్కుడు గింజలు సోయా గింజలు కలిపి నానబెట్టి రుబ్బిన పిండిలో ఉల్లి మిరప ముక్కలు వేసి చేసిన వడల్ని చైనా వాళ్లు దౌబాంజియాంగ్ అంటారు డిఎం చిక్కుడు ముక్కలు కలిపి వండిన కిచిడీని పర్షియన్లు బగాలి పోలో అంటారు చిక్కుడు గింజల్ని సాతాలించి ఫుల్ మెడమ్స్ అనే వంటకాన్ని ఈజిప్షన్లు రొట్టెతోపాటు నంజుకుంటూ తింటారట ఇథియోపియాలో చిక్కుడు గింజల్ని నానబెట్టి రుబ్బిన పిండితో ఇంజీరా అనే దోసెలు పోసుకుంటారు అనప చిక్కుడుకాయ చిక్కుడు బియ్యపు చిక్కుడు ఎర్ర చిక్కుడు తెల్లచిక్కుడు నల్లచిక్కుడు వెట్టి చిక్కుడు మొక్క చిక్కుడు తీగ చిక్కుడు లలో చాలా రకాలు ఉన్నాయి అన్నింటి గుణాలు ఇంచుమించు సమానమే రాజ్మా సోయా లాంటివి కూడా చిక్కుళ్ళ మాదిరే లైంగిక శక్తిని ద్విగుణం బహుళకం చేస్తాయి కఫాన్ని పెంచుతాయి ధనియాలు జీలకర్ర సొంటి మూడింటి పొడిని మజ్జిగలో కలిపి తాగితే వీటిని తిన్నందువలన కడుపుబ్బరం కలగకుండా ఉంటుంది బలకరమైన ఆహార ఔషధాలు ఇవి కాబట్టి తరచూ తింటూ ఉంటే మంచిది. ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా పెట్టాలి ఇవి తేలికగా వంట పట్టాలంటే లేత కాయల్ని ఎంచుకొని తొక్కలతో కలిపి కూర పప్పు పచ్చడి నిలవ పచ్చడి పులుసు పులుసు కూర అన్ని వండుకోవచ్చు
No comments:
Post a Comment