Monday, 5 February 2024

దేశ దేశాల్లో ఆయుర్వేదం .. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పం

 

విశ్వవ్యాప్తంగా ఎన్నో సంప్రదాయ వైద్య విధానాలు వేల ఏళ్లుగా ప్రజలకు స్వస్థత చేకూరుస్తున్నాయి భారతను ఆయుర్వేదానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది దీనికి ప్రాచుర్యం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 80% ఏదో ఒకరకంగా సంప్రదాయ వైద్య విధానాలను పాటిస్తున్నారు ఇలాంటి వాటిని ప్రధాన చికిత్స పద్ధతుల్లో భాగం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు ప్రాంతీయ కార్యాలయాలు శాస్త్రీయంగా జరిపిన అధ్యయనం ప్రకారం ఆయుర్వేదం రెండో అత్యంత ఆమోదయోగ్యమైన వైద్య విధానంగా ఉంది ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ఆయుర్వేద వైద్య పారిభాషిక పతజాలాన్ని డబ్ల్యూహెచ్వో చేర్చింది దీనికి సంబంధించిన ప్రతిని ఇటీవల ఢిల్లీలో ఆవిష్కరించింది డబ్ల్యూహెచ్వో 2019 22 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను సంప్రదించి భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని తయారు చేసింది ఆయుర్వేదంలో దీన్ని కీలకమైలు రాయిగా అభిమానించవచ్చు ఐసిడి జాబితా రూపకల్పనలో భాగంగా డబ్ల్యూహెచ్వో ఆధ్వర్యంలోని ఆయా విభాగాలు 2019లో తొలిసారిగా ఇండియా వ్యాప్తంగా పేరెన్నికదన్న విద్యాసంస్థలు ఆస్పత్రులు ఇతర సంస్థల్లో నిపుణులను సంప్రదించాయి వారి భాగస్వామ్యంతో పలు ఆయుర్వేద గ్రంధాలు వెబ్ పోర్టల్లను విశ్లేషించి ఆయుర్వేద వైద్యంలో సాధారణంగా వాడే పారిభాషిక పదాల జాబితా తయారు చేశారు తొలి ప్రతిలో 5879 ఆయుర్వేద పదబంధాలను కోండికరించారు వీటన్నింటినీ తేలిక గుర్తించేలా క్రమసంఖ్యలను కేటాయించారు గుజరాత్లో 2019 డిసెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆశ్రయ బంగ్లాదేశ్ కెనడా డెన్మార్క్ భారత్ జపాన్ మలేషియా నేపాల్ న్యూజిలాండ్ శ్రీలంక లకు చెందిన వైద్య భాషా నిపుణులు ఈ పద సముదాయాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించి ఆమోదించారు అనంతరం దీన్ని అంతర్జాతీయంగా మరింత పేరెన్నిక గన్న వైద్య నిపుణుల బృందానికి పంపించారు అర్జెంటీనా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ జర్మనీ భారత్ మలేషియా తదితర 18 దేశాల బృందం 26 వర్చువల్ సమావేశాలు నిర్వహించి ఈ పద సముదాయాన్ని పరిశీలించిన కొన్నింటిని తొలగించి మరికొన్నింటిని మెరుగుపరిచి నది.2021 అక్టోబర్లో 35 దేశాల నిపుణుల బృందం మరోసారి దీన్ని సుశీకంగా పరిశీలించి 3876 పారిభాషిక పదాలను ఆమోదించింది సమానార్థం కలిగిన పర్యాయపదాలతో కలిపి ఈ సంఖ్య 4012 కు చేరింది. ఆయుర్వేదంలో చెప్పిన అనేక మూల సూత్రాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధికి సంబంధించిన ద్రవ్యాలు ఔషధాలు ఆహార తయారీ విధానాలు చికిత్సలు వ్యాధి నివారణ పద్ధతులు తదితరాలను సమగ్రంగా పరిశీలించి ఈ పారిభాషిక పదజాలని రూపొందించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఢిల్లీలో ఇటీవల ఐసిడి రెండో ప్రతిగా ప్రజలకు వైద్యులకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు ఈ పదకోశం ఆంగ్ల మాధ్యమంలో స్పష్టంగా ఎలాంటి సందేహతలకు తావు లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు

మన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తం కావడానికి ఈ పారిభాషిక పధ కోసం ఎంతగానో తోడ్పడుతుంది ప్రపంచ సంప్రదాయ వైద్య విధానాలతో ఆయుర్వేదం అనుసంధానం కావడానికి మేలిమి అడుగుక దీన్ని భావించవచ్చు ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తంగా వినియోగించడానికి దానిపై పరిశోధనలు చేయడానికి దీనివల్ల మార్గం సుఖమం అవుతుంది రాబోయే రోజుల్లో మన ఆయుర్వేద ఉత్పత్తులకు దేశ విదేశాల్లో గిరాకీ ఏర్పడటానికి ఈ పారిభాషిక పదజాలం ఉపయోగపడుతుంది ఆయుర్వేద సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు నేర్చుకోవడానికి వైద్యమెలకువలు పంచుకోవడానికి ఆస్కారం దక్కుతుంది వైద్య పర్యాటకానికి దీనివల్ల మేలు కలుగుతుంది అనేక ఆయుర్వేద చికిత్సలను ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులోకి తేవడానికి ఇది దోహదపడుతుంది భారతి లోని ఆయుర్వేద విద్యాలయాలకు ఔషధ తయారీ రంగానికి సాంకేతిక నిపుణులకు తరిఫీది ఇచ్చే సంస్థలకు ఈ పారిభాషిక పదజాలం ఎంతగానో తోడ్పడుతుంది పంచకర్మ చికిత్సలకు సంబంధించిన పరికరాల తయారీ పరిశోధనల రంగానికి ప్రయోజనం జరుగుతుంది భారతలోని ఆయుర్వేద విద్యార్థులు అధ్యాపకులు చికిత్స నిపుణులు ఔషధ తయారీదారులు ఆయుర్వేద అభిమానులు ఈ పారిభాషిక పదకోశాన్ని రోజువారి వైద్య విధానంలో విరివిగా వినియోగించాలి దీనివల్ల ఆరోగ్య రక్షణతో పాటు మన ఆయుర్వేదానికి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. తద్వారా మన సాంప్రదాయ వైద్యం విశ్వవ్యాప్తమై దేశానికి ఆర్థికంగా మేలు కలుగుతుంది ప్రపంచానికి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగం జరుగుతుంది.



No comments:

Post a Comment