Saturday 10 February 2024

ఎనిమిదో నెలలో ఏం తినాలి

 ఆఖరి 4 వారాల్లో ప్రసవానికి దాదాపు సిద్ధం అయ్యే సమయం కాబట్టి శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి ఈ సమయంలో ఎక్కువ ఆహారం ఒక్కసారి తీసుకోవడం కుదరకపోవచ్చు ఆకలిగా అనిపించకపోయినా ప్రతి రెండు గంటలకు సమయం ప్రకారం ఆహారం తీసుకోవడం అవసరం రోజుకు కనీసం రెండుసార్లు పళ్ళు తీసుకోవాలి రెండు లేదా మూడుసార్లు పాలు లేదా పెరుగు తప్పనిసరి గుడ్లు రోజు రెండు తీసుకోవచ్చు గుడ్లు తినని వారైతే పని సోయా కూడా తీసుకోవచ్చు బాదం పిస్తా ఆక్రోట్ లాంటి గింజలను ఆహారంలో భాగం చేసుకోండి కంది పెసర మినప వంటి రకరకాల పప్పులను రోజూ తీసుకోండి ఆకుకూరలు వారానికి ఆరు రోజులు తీసుకోవాలి కాఫీలు టీలు పూర్తిగా మానేయాలి ఎక్కువ మసాలాలు నూనెలున్న ఆహారం తీసుకుంటే అరుగుదల ఇబ్బంది కాబట్టి వాటిని దూరంగా ఉంచాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి వైద్యుల సలహా మేరకు తగిన శారీరక శ్రమ లేదా నడక కూడా ఉన్నట్లయితే ప్రసవం తేలిక అవుతుంది ప్రసవానంతరం కూడా బిడ్డకు తల్లిపాలు పట్టవలసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా మీకు శక్తి ఎక్కువగా ఉన్న ఆహారం మరింత అవసరమవుతుంది బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు మీరు ఇలాగే ఆహారపు నియమాలు పాటించాలి. ఒకసారి బిడ్డకు తల్లిపాలతో పాటు గణ ఆహారం కూడా ఇవ్వడం మొదలుపెట్టాక మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మార్పులు చేసుకోవచ్చు

No comments:

Post a Comment