వడియాలు అప్పడాలు మొదలైనవి తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. వీటి వల్ల ఆహార ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే వడియాల్లో వివిధ రకాలు ఉన్నాయి. తయారీకి వాడే పదార్థాలను బట్టి వాటిలో పోషకాలు కూడా ఉంటాయి గుమ్మడి బూడిద గుమ్మడి రేగు మొదలైన వాటితో పెట్టే వడియాలలో కొంచెం విటమిన్ ఏ పీచు పదార్థాలు ఉంటాయి. సగ్గుబియ్యం బియ్యం పిండితో చేసే వడియాల్లో పిండి పదార్థాలు తప్ప వేరే పోషకాలు ఉండవు మినప్పిండితో చేసే వడియాలు అప్పడాలలో కొద్దిగా పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు కొన్ని బి విటమిన్లు పీచు పదార్థాలు కూడా ఉంటాయి అయితే ఎటువంటి వడియాలైనా అప్పడాలైనా నూనెలో వేయించి మాత్రమే తింటాం కాబట్టి వీటిలో కొవ్వు పదార్థాలు క్యాలరీలు రెండు అధికమే కేవలం రుచి కోసం అప్పుడప్పుడు పరిమిత మోతాదులో తీసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ఈరోజు వారి ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే అనవసరమైన క్యాలరీలు ఎక్కువ బరువు పెరగడం కొద్ది మందిలో కొలెస్ట్రాల్ పెరగడం లాంటి పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా బీపీ ఉన్నవారు రోజు వడియాలు తీసుకున్నట్లయితే అవసరానికి మించి సోడియం ఆహారం ద్వారా చేరి బీపి నియంత్రణ కష్టమవుతుంది
No comments:
Post a Comment