Friday 9 February 2024

హెల్త్ బిట్స్..9-2-2024

 భోజనం వేళలు ముఖ్యమే..

ఉదయం 8 గంట టిఫిన్ మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం సాయంత్రం  చిరు తిండ్లు, రాత్రి 9:00 కి మళ్ళీ భోజనం దాదాపుగా ఇలానే ఉంటుంది మన భోజన దిన చర్య. అంటే దాదాపు 12 నుంచి 13 గంటల వ్యవధిలో తినాల్సినవన్నీ తినేస్తాం. ఆ పరిధి అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని ఓ అధ్యయనం సూచిస్తుంది ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్ ను అధిగమించవచ్చని చెబుతున్నారు . ఉదయం 8 గంటలకు టిఫిన్ తో మొదలుపెట్టి రాత్రి భోజనం 9 గంటలకు పూర్తి చేయడం కంటే దానిని ఓ నాలుగు గంటలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల డయాబెటిస్ రోగుల శరీరాలు రాత్రి సమయంలో ఉపవాస స్థితికి చేరుకుంటాయి దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి ఈ అధ్యయనం మాస్ ట్రిక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో చేశారు గతంలో జరిగిన ఓ పరిశోధన కూడా ఇలాంటి విషయాన్ని వెల్లడించింది ఊబకాయిల శరీరంలోని కణాలు ఇన్సులిన్ కు స్పందించే గుణం కూడా మెరుగుపడుతుందని ఈ అధ్యాయంలో తేలింది

ఆ గ్రూప్ రక్తంతో పక్షవాతం ముప్పు .. ఇటీవల కాలంలో 60 ఏళ్ల లోపు వారిలోనూ పక్షవాతం కేసులు పెరుగుతున్నాయి

అయితే న్యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇతరులతో పోలిస్తే ఏ బ్లడ్ గ్రూప్ వారికి పక్షవాతం వచ్చే అవకాశం 16% ఎక్కువ అంట  అదే ఓ బ్లడ్ గ్రూపు వారికైతే ఇది 12 శాతం తక్కువ అట , మొత్తానికి ఏ బ్లడ్ గ్రూప్ వారిలో రక్త కణాలు గుచ్ఛంగా మారే ముప్పు ఎక్కువ అని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అంశాల చిట్టాలో బ్లడ్ గ్రూప్ అనేది ఒకానొక అంశం మాత్రమేనని ఆ అధ్యయనం వెల్లడించింది ఇతర కారణాలు కూడా తోడైతేనే ఏ వ్యాధి అయినా శరీరంపై దాడి చేసే ఆస్కారం ఉంటుంది ధూమపానం మానివేయడం సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారం మితంగా తీసుకోవడం రక్తపోటును అదుపులో పెట్టుకోవడం తదితర జాగ్రత్తల వల్ల దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవచ్చు

ఆటో ఇమ్యూన్ సమస్యలా?

ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగు శాతం మంది కీళ్లవాతానికి సంబంధించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వివిధ ఆటో ఇమ్యూన్ రుగ్మతల్లో ఒకటి కంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా అయితే ఆటో ఇమ్యూన్ రుగ్మతలు మనుషులలో ఒకటి పాయింట్ నాలుగు రెట్లు అధికంగా గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు దారితీస్తాయని బెల్జియం లోని కేథలిక్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది రెండు ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నవాళ్లలో ఈ ముప్పు రెండు రెట్లు ఎక్కువ అట కాబట్టి ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నవారు గుండె రక్తనాళాల సమస్యల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment