కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడే ప్రత్యేక పోడులు టాబ్లెట్లు మందుల గురించి ఈమధ్య ఎక్కువ వింటున్నాము ఇవి ఆరోగ్యానికి మంచివేనా వీటిని వాడి ఒంట్లో కొవ్వు తగ్గించుకోవడం బరువు తగ్గడం సాధ్యమవుతుందా?
కొవ్వు జీవక్రియ లేదా శక్తివ్యాయాన్ని పెంచడం కొవ్వు శోషణ ను తగ్గించడం ద్వారా ఫ్యాట్ బర్నర్ అనే పదార్థాలు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయని ప్రచారం జరుగుతుంది గ్రీన్ టీ కెఫిన్ ఆల్ఫా లైపోయిక్ ఆసిడ్ జిన్సింగ్ ఆపిల్ సెడార్ వినగార్ మొదలైనది ఫ్యాట్ బర్నర్స్ లేదా కొవ్వు కరిగించే పదార్థాలుగా మార్కెట్లో లభిస్తున్నాయి కొన్ని ఉత్పత్తుల్లో ఒకటి కంటే ఎక్కువ క్యాట్ బర్నర్లు కూడా ఉంటాయని వీటిలో కొన్ని శరీరంలో రక్త పోటు ను పెంచి తద్వారా జీవ క్రియా శక్తి వ్యయాన్ని పెరిగేలా చేస్తాయి.. దీని వల్ల కాల క్రమేణా బరువు తగ్గడానికి దారి తీసే అవకాశం ఉంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె పోటు కిడ్నీల సమస్య లు కాలేయ సమస్య లు మొదలైన దుష్పరిణామాలు కలుగ వచ్చును.కొన్ని ఫ్యాట్ బర్నర్ లు మీరు తీసుకునే మందుల ప్రభావాన్ని కూడా మారుస్తాయి.. అధిక బరువు తగ్గించడంలో ఈ పదార్థాలు కేవలం 10 శాతం లోపు మాత్రమే సహాయ పడ గలవు.. మిగతా 90 శాతం కంటే ఎక్కువ తీసుకునే ఆహారం , చేసే శారీరక శ్రమ,నిద్ర ల పైనే ఆధార పడి ఉంటుంది అందుకే బరువు తగ్గాలంటే కేలరీలు పరిమితి మించ కుండా తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ముఖ్యం. ఎలాంటి సప్లిమెంట్స్ ఐనా వైద్యులు నిపుణుల సలహా లేకుండా వాడరాదు..
No comments:
Post a Comment