Saturday 10 February 2024

పొంగలి వంటకం లోని పోషకాలు ఏమిటి

 పొంగలి లో వాడే బియ్యం పప్పు విడివిడిగా కంటే ఆ రెండు పదార్థాలను కలిపి తీసుకున్నప్పుడు వాటిలో ఉండే ఎమినో యాసిడ్లు కంప్లీట్ ప్రోటీన్ గా మారి శరీరంలోకి తేలికగా సంగ్రహించబడతాయి పొంగలి రకం ఏదైనా నెయ్యి కూడా అధికంగా వాడతారు కాబట్టి తక్కువ మోతాదులో తీసుకున్న శక్తినిచ్చే క్యాలరీలు మెండుగా అందుతాయి ముఖ్యంగా చక్కెర పొంగలి లో వాడే చక్కెర బెల్లం మొదలైన తీపి పదార్థాల ద్వారా మరిన్ని కేలరీలు చేరుతాయి మిరియాలతో చేసే పొంగలిలో మిరియాల వల్ల అరుగుదల తేలికగా ఉండి అజీర్తి సమస్య ఉండదు. ఇలా అధిక శక్తినిచ్చే పదార్థాలు ఉండడం వల్ల బరువు పెరగాలనుకునే వారికి ఎదుగుతున్న పిల్లలకు రోజులో శారీరక శ్రమ అధికంగా చేసే వారికి పొంగలి మంచి ఆహారం పొంగలిలో కాయగూరలు ఆకుకూరలు మొదలైనవి వాడరు కాబట్టి విటమిన్లు ఖనిజాలు తక్కువే కొంతమంది పొంగలిలో జీడి బాదం పిస్తా అంటే పప్పులు కూడా వాడుతారు అప్పుడు కొంచెం పీచు పదార్థాలు ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు ఖనిజాలు లభించినప్పటికీ వీటి మోతాదు తక్కువగా ఉంటుంది పొంగలి లాంటి క్యాలరీలు అధికంగా ఉండే పదార్థాలను ఏవైనా ప్రత్యేకమైన రోజులకు అది కూడా పరిమితికి మించకుండా తీసుకుంటేనే మేలు



No comments:

Post a Comment