Saturday 10 February 2024

హెల్త్ బిట్స్ 11-2-2024

దవాఖానాలో దంత ధావనం

నోట్లోని బ్యాక్టీరియా అనుకోని పరిస్థితుల్లో రోగి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఉండటం వల్ల నిమోనియా వస్తుంది. దీంతో హాస్పిటల్ లో చేరిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి అంత నిమోనియా ముప్పు ఉన్నట్లే అయితే దవాఖానాలో ఉన్నన్ని రోజులు క్రమం తప్పక బ్రష్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు జామ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది హాస్పిటల్ వాతావరణం వల్ల నోటిలో పేర్కొనే బ్యాక్టీరియా రోజు బ్రష్ చేసుకోవడం వల్ల దూరం అవుతుంది నిమోనియా ముప్పు కూడా తగ్గిపోతుంది రోగి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే సమయాన్ని మెకానికల్ వెంటిలేటర్ మీద గడపాల్సిన సమయాన్ని కూడా ఇది తగ్గిస్తుందని తెలిపింది 

మంచి మూడ్ కావాలంటే యోగర్ట్ తినండి..

యోగర్ట్ పొట్ట ఆరోగ్యాన్ని కాదు మన మూడును కూడా మెరుగుపరుస్తుంది. యోగర్ట్ లో ఉండే లాక్టో బాసిల్లస్ మన శరీరం ఒత్తిడిని ఎదుర్కొనేలా సహాయపడుతుంది కొంగుబాటు ఆందోళనను కూడా నివారిస్తుంది దీనికి సంబంధించిన అధ్యయనం బ్రెయిన్ బిహేవియర్ అండ్ ఇమ్యూనిటీ అనే జర్నల్లో ప్రచురితమైంది ఈ ఫలితాలు ఆందోళన కుంగు బాటు ఇతర మానసిక ఆరోగ్య సమస్యల చికిత్సకు కొత్తదారులను తెరుస్తాయి అంటున్నారు పరిశోధకులు..

No comments:

Post a Comment