29, డిసెంబర్ 2011, గురువారం

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు - కలబంద తో( ALOE VERA )



కన్నకూతురిలా కుటుంబానికి అనుబంధ కలబంద* 

భారత విజ్ఞాన ధనరాశులకు వారసులైన సోదరీ సోదరులారా! ఈనాడు యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్నిచేసిన కలబంద గొప్పతనాలు మనభారతీయులకు ఏమాత్రం తెలియకపోవడం అత్యంత విషాదకరం. ఏ దేశంలోనో పుట్టిన శాస్త్రజ్ఞులు ఈ దేశానికి వచ్చి మన ఆయుర్వేద గ్రంథాలు చదివి మన కలబందను తీసుకుపోయి వాళ్ళ దేశాలలో లక్షల హెక్టార్లలో పెంచుకొని మన గ్రంథాలను బట్టి వందల రకాల కలబంద బెషధాలను తయారుచేసి వాటిని మనదేశానికి తీసుకొచ్చి కలబంద గొప్పతనం గురించి ఊరూరా ప్రచారం చేస్తు వేలరూపాయలకు అమ్ముకుంటూ ప్రతిరోజు వేలకోట్ల రూపాయలను వాళ్ళదేశాలకు తరలించుకుపోతున్నారు. అయినా మనకు చీమకుట్టినట్లుకూడా లేదు. మీరంతా గొంతెత్తి అరచి చెప్పండి. మన కలబంద మన కుమార్తె వంటిదని అందుకే దాన్ని సంస్కృతంలో కుమారీ అని పిలుస్తారని దానిద్వారా 

మన కుటుంబాలను బృందావనాలుగా మార్చుకోవచ్చని తెలుసుకోండి ,ఉపయోగించుకోండి. 

కలబంద రూప గుణ ప్రభావాలు 

ఇది ఒక ఆందమైన చెట్టు. దీని మట్టలు పొడవుగా ఆకుపచ్చగా పెరుగుతయ్‌. మట్టల చుట్టూ సన్నని ముండ్లలాగా కొనలుంటయ్‌. ఇది బాగా పెరిగిన తరువాత దీని మధ్యనుండి మూడడుగుల ఎత్తుగా ఎర్ర రంగు గల కాడ పొడవుగా పెరుగుతుంది. ఈ కాడ తలపైన ఎర్రటి పూలు పూస్తయ్‌. 

కలబంద మట్టలను అడ్డంగా కోస్తే దానినుండి 
తెల్లని చిక్కని ద్రవం కారుతుంది. దాన్ని ఎండలో పెడితే 
అది నల్లగా మారుతుంది. దానినే మూసాంబరం అంటారు. దీనిని తయారుచేసుకొని ఎల్లప్పుడూ నిలువ వుంచుకొని అనేక వ్యాధులకు బెషధంగా ఉపయోగించుకొనే గొప్ప సంప్రదాయం మన తెలుగునాట యుగ యుగాలుగా ఉంది. ఈ దరిద్రపు ఆధునిక యుగంలో ఈ అలవాటు నశించిపోయింది. దానిని ప్రచారంలోకి తెచ్చి ఆరోగ్యవంత మైన సమాజాన్ని నిర్మించుకుందాం.


తెలుగు లో- కలబంద
english లో - అలోవెరా 
హిందీ లో- గీకవార్ 
సంస్కృతంలో - కుమారి 


కలబంద మట్ట లను అడ్డంగా కోస్తే తెల్లని , చిక్కటి ద్రవం కారుతుంది. దీనిని ఎండలో పెడితే  నల్లగా మారుతుంది.. దీనినే మూసంబరం అంటారు. దీనిని నిలువచేసుకొని అనేక వ్యాధులకు ఔషధంగా వాడుకోవచ్చు.

1 . కంటి కలక తగ్గిపోవుటకు  ( CONJUNCTIVITIS ) ( SORE EYES )

కలబంద చిన్న ముక్క
పసుపు

 చిన్న కలబంద ముక్కను తీసుకొని ఒకవైపు పొర తొలగించి దానిపై పసుపును చల్లి బొటనవేలి అడుగుభాగాన అంటించి కట్టు కట్టాలి.

uses - కండ్ల కలక తగ్గిపోతుంది

2 . ఎక్కిళ్ళు వెంటనే తగ్గడానికి ( FOR QUICK RELIEF FROM HICCOUGHS )

కలబంద రసం - 30 gm
శొంఠి పొడి - 3 చిటికెలు.

 పై వాటిని కలిపి లోనికి సేవించాలి.

uses -  ఎక్కిళ్ళు వటనే తగ్గిపోతాయి.

3 . బహిష్టులో వచ్చే కడుపు నొప్పులకు ( STOMACH PAINS DURING PERIODS TIME )

కలబంద గుజ్జు- 1 స్పూన్ 
నెయ్యి - 1 స్పూన్ 
కరక్కాయ ల పొడి- 3 చిటికెలు
సైంధవ లవణం - 3 చిటికెలు

 పై అన్నింటినీ కలిపి రోజూ రెండు పూటలా ఆహారానికి ఒక గంట ముందు తినాలి..

uses -  బహిష్టులో కడుపునొప్పి తగ్గిపోయి ఇక ముందు రాకుండా ఉంటుంది.

4 . బలం పెరగడానికి ( FOR BODY STRENGTH ) 

కలబంద వేరు ముక్కల పొడి- 5 gm
ఆవు పాలు - 1 కప్ 
పటిక బెల్లం - 1 స్పూన్

 కలబంద వేరు తెచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి దంచి పొడిి చసి నిలువ ఉంచుకోవాలి .రోజు పరగడుపున ఐదు గ్రాములు పొడిని, ఒక కప్పు ఆవుపాలతో కలిపి ఒక స్పూన్ పట్టిక బెల్లం కూడా కలిపి తాగుతూ ఉండాలి.

uses -  స్త్రీ పురుషులకు అత్యంత బలం కలుగుతుంది.

5 . సంతాన ప్రాప్తి కొరకు ( FOR INFERTILITY )

కలబంద గుజ్జు - 10 gm
శంఖ పుష్పి - 10 gm
గంధపు చెక్క - 10 gm
తానికాయల పొడి - 10 gm

 పై అన్నింటిని ఆవుపాలతో కలిపి బహిష్టు స్నానం చేసిన రోజున సేవించి భర్తతో సంసారం చేయాలి.

uses -  సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది..

6 .  కంటి నొప్పి తగ్గడానికి  (  FOR  EYE PAIN ) 

కలబంద సొన  -  4 చుక్కలు

 కలబందను కోయగా వచ్చిన సొనలు బట్టలో వేసి మూడు, నాలుగు చుక్కలు చెవులలో పిండాలి.

uses  -  కంటి నొప్పి తగ్గిపోతుంది.

7 . ముదిరిన కామెర్లు (  పసిరికల జబ్బు )  తగ్గడానికి (  FOR CHRONIC JAUNDICE )

కలబంద రసం  -  1 భాగం
నెయ్యి  -  1 భాగం 

 పై వాటిని కలిపి చిన్న గిన్నెలో వేసి కామెర్ల రోగి ముక్కు వద్ద పెట్టి మాటిమాటికి వాసన చూపిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇతర మందులు లోనికి వాడుకోవాలి.

uses  -  కామెర్లు తగ్గిపోతాయి

8 . కుక్క కాటు విషం తగ్గుటకు  (  FOR DOG BITE  )

కలబంద మట్ట 
సైంధవ లవణం ( rock salt )

 కలబంద మట్టను మధ్యలోకి చీల్చి ఆ గుజ్జు పైన సైంధవ లవణం పొడి చల్లి కుక్క కరిచిన చోట దానిని వేసి కట్టు కట్టాలి .రోజు ఒకసారి కట్టు మారుస్తూ ఉండాలి.

uses  -   నాలుగైదు సార్లు పై విధంగా చేస్తే కుక్క విషము హరించిపోతుంది

9 . మధు మేహం తగ్గుటకు  (  FOR DIABETES )

కలబంద గుజ్జు -  5 gm
తిప్ప సత్తు  -  3 చిటికెలు  (  3 pinches )

 పై వాటిని కలిపి రెండు పూటలా ఆహారానికి అరగంట ముందు సేవిస్తుండాలి.

uses  -  మధుమేహం , అతిమూత్రం తగ్గిపోతాయి.

10  . పగలని మొండి గడ్డలు  (  FOR HARD CYSTS )

కలబంద మట్ట
ఉప్పు పొడి (  salt powder )-  1 gm
పసుపు పొడి ( turmeric powder  )  -  2 gm

 కలబంద మట్టను ఒక వైపు తోలు తీసి లోపలి గుజ్జు పైన ఉప్పు పొడి పసుపు పొడి చల్లి దానిని గడ్డలపైన పెట్టి కట్టు కడుతుండాలి.

uses  -  గడ్డలు  త్వరగా పక్వానికి వచ్చి  పగిలిపోయి బాధ తగ్గుతుంది.

11 . నారి కురుపులు తగ్గడానికి 

కలబంద గుజ్జు, మెంతి పొడి 

పై కట్టు -  కలబంద గుజ్జు, మెంతి పొడి కలిపి నారి కురుపుల పైన వేసి కట్టు కట్టాలి .ఉదయమే కట్టు విప్పి చూస్తే పురుగులన్నీ బట్టలోకి వస్తాయి. వాటిని తీసిపారవేయాలి.

లోపలికి సేవనం - 

కలబంద గుజ్జు  - 1 చెంచా
ఉప్పు  -  1 గ్రాము
మిరియాల పొడి  - 1 గ్రాము
నెయ్యి  - 1 చెంచా

 పై అన్నింటినీ కలిపి రోజుకు రెండుసార్లు తినాలి.

ఉపయోగాలు - కురుపులు తగ్గిపోతాయి.

12 . కంటి పొరలు తగ్గడానికి  (  FOR EYE LAYERS )

చిల్ల గింజలు ( ఇండుప గింజలు )
కలబంద రసం 

 గింజలను రసంలో పది రోజులు నానబెట్టి తీసి బాగా ఎండబెట్టి శుభ్రంగా తుడిచి నిలువ ఉంచుకోవాలి. రోజూ రాత్రి నిద్రించే ముందు ఆ గింజను సానరాయి పైన కొంచెం నీటితో అరగదీసి కంది బద్ద అంత గంధం కంటిలో పెడుతూ ఉండాలి.

ఉపయోగాలు  - కంటి పొరలు హరించి పోయి , చూపు నిర్మలంగా వస్తుంది

13 . కీళ్ల నొప్పులు తగ్గడానికి హల్వా ( FOR JOINT PAINS )

కలబంద గుజ్జు  - 1 kg
గోధుమ పిండి - 1/2 kg
ఆవు నెయ్యి  - 1/2 kg
పటిక బెల్లం పొడి -  2 1/2 kg

 కలబంద రసాన్ని నెయ్యిలో వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే గోధుమ పిండిని కూడా ఆవు నేతిలో కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. ఆ తర్వాత పట్టిక బెల్లాన్ని చిన్న మంటపైన మరిగిస్తూ, పాకం రాగానే కలబంద గుజ్జును మరియు గోధుమ పిండిని, ఆవు నెయ్యిని అందులో కలిపితే హల్వా తయారవుతుంది. ఈ హల్వాను రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా తింటుండాలి.

ఉపయోగాలు  - మొండి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.


DR . KONDAPALLI NARASIMHAREDDY RECIPES WITH ALOE VERA ( KALABANDA )

1 . చర్మవ్యాధులు (  FOR SKIN DISEASES )

 కలబంద ఆకుల రసాన్ని చర్మం పైన లేపనం చేయాలి.

2 . ముఖం మీది నల్లని మచ్చలు తగ్గడానికి (  మంగు )( FOR BLACK SPOTS ON THE FACE )

కలబంద రసం - 1 భాగం 
వెన్న  -  1 భాగం

పై రెండింటినీ కలిపి రాయాలి మచ్చలు తగ్గిపోతాయి.

3 . చర్మ సౌందర్యం కొరకు (  FOR BEAUTIFUL FACE )

కలబంద గుజ్జు 

 కలబంద గుజ్జును పేస్ట్ గా చేసి  ప్రతిరోజు ముఖానికి లేపనం చేసుకోవాలి. ముఖ సౌందర్యం కలుగుతుంది.

4 . కాలిన పుండ్లు తగ్గడానికి  ( FOR BURNS )

కలబంద ఆకుల రసం 

 ఆకులను వేడి చేసి రసం తీసి కాలిన వ్రణాల పైన లేపనం చేయాలి. బాధ తగ్గి త్వరగా మానిపోతాయి.

5 . సెగ గడ్డలు , దెబ్బలు తగ్గడానికి ( FOR BOILS AND WOUNDS )

కలబంద గుజ్జు 

గుజ్జును ఉడికించి గడ్డల పైన, దెబ్బల పైన వేసి కట్టు కట్టాలి.

6 . స్థన వాపు తగ్గడానికి ( FOR BREAST SWELLING )

కలబంద ఆకుల లోని గుజ్జు లేదా వేరు 
పసుపు 

 పై రెండింటినీ సమాన భాగాలలో కలిపి నూరి లేపనం చేయాలి. వాపు తగ్గిపోతుంది.

7 . చెవి పోటు తగ్గడానికి (  FOR EAR PAIN 
 
కలబంద ఆకు.

 కలబంద ఆకును వేడి చేసి రసము తీసి చెవిలో ఒకటి ,రెండు చుక్కలు వేసిన చెవి బాధ తగ్గుతుంది.

8 . పంటి నొప్పి తగ్గడానికి ( FOR TOOTHACHE )

 కలబంద ఆకు రసమును చిగుర్లకు పట్టించాలి లేదా తొక్కు తీసిన కలబంద గుజ్జు ముక్కలను నమలాలి.

9 . కంటి కలక తగ్గడానికి ( FOR CONJUCTIVITIS )

కలబంద గుజ్జు - 1 భాగం
పసుపు  - 1 భాగం

పై రెండింటినీ కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనురెప్పల పైన వేసి కట్టు కట్టాలి.

10  మల బద్ధకం తగ్గడానికి  (  FOR CONSTIPATION )

కలబంద గుజ్జు ముక్క -  1 నుండి 1 1/2 అంగుళాలు

 రోజు రెండు పూటలా ముక్కను తినాలి,

11 . శరీర బరువు తగ్గడానికి (  FOR WEIGHT REDUCTION )

కలబంద ఆకు రసం  - 2 స్పూన్లు

 రసాన్ని ప్రతిరోజు రెండు నెలల పాటు సేవించాలి.

12 . ఆనెలు తగ్గడానికి ( FOR CORNS )

కలబంద గుజ్జు 

 గుజ్జును అరికాలిలో వచ్చు ఆనెల పైన వేసి కట్టు కట్టాలి.

13 . వడ దెబ్బ తగ్గటానికి (  FOR SUN STROKE )

కలబంద రసం 
నీరు 
చక్కెర

 పై వాటిని కలిపి సేవించాలి  .వడదెబ్బతో కలిగిన అలసట తగ్గిపోతుంది.

14 . దగ్గు తగ్గటానికి  ( FOR COUGH )

కలబంద రసం -  1 స్పూన్ 
మిరియాల చూర్ణం  - 1/2 స్పూన్ 
శొంఠి చూర్ణం  - 1/4 స్పూన్ 
తేనె - 1 స్పూన్ 

 పై అన్నింటినీ కలిపి సేవించాలి. దగ్గు తగ్గిపోతుంది.

15 . పిల్లల కడుపులోని నులి పురుగుల సమస్య తగ్గటానికి  (  FOR STOMACH WORMS IN THE CHILDREN )

కలబంద రసం - 2 స్పూన్లు
పొంగించిన ఇంగువ  - చిటికెడు

పై రెండింటిని కలిపి పిల్లలకు పట్టించాలి.

16 . అర్ష మొలలు తగ్గడానికి ( FOR PILES )

 ప్రతిరోజు కలబంద రసం 10 నుండి 30 గ్రాములు తాగిస్తూ కలబంద గుజ్జును పసుపుతో నూరి మొలల పైన లేపనం చేయాలి.

17 . కడుపుబ్బరం తగ్గడానికి (  FOR GAS PROBLEM )

 కలబంద గుజ్జు ,గోధుమపిండి, వాము, సైంధవ లవణం, జిలకర కలిపి చపాతీలు చేసుకుని భుజించినచో కడుపులో గ్యాస్ ఉబ్బరం తగ్గిపోతాయి.

18 . వరి బీజం తగ్గడానికి (  FOR HYDROCELE )

కలబంద గుజ్జు - 1 భాగం
బెల్లం  - 1 భాగం

 పై రెండింటినీ కలిపి, నూరి ఎండించి శనగ గింజంత గోలీలు చేసి రోజూ రెండు తినిపించాలి.

19 . రుతు శూల తగ్గడానికి (  FOR MENSUS PAIN )

 ప్రతి నెల ముట్టు శూలతో బాధపడే స్త్రీలు కలబంద ఆకుల రసమును 1/2 ఔన్స్ చొప్పున వారం రోజులు త్రాగాలి.

20 .శరీరంలో వేడి తగ్గడానికి ( FOR BODY HEAT )

కలబంద రసం 
పాలు
చక్కెర

 పై వాటిని కలిపి సేవిస్తే శరీరంలోని వేడి తగ్గటమే కాకుండా ధాతు పుష్టి ఆరోగ్యము బలము కలుగుతాయి.

21 . కుక్క కాటు తగ్గటానికి ( FOR DOG BITE )

కలబంద గుజ్జు 
ఉప్పు 

 పై రెండిటిని కలిపి ముద్దగా నూరి కాటుపై వేసి కట్టు కట్టాలి.
22 . కాలేయ, ప్లీహ వ్యాధులు తగ్గటానికి (  FOR LIVER ,SPLEEN DISEASES )

కలబంద రసం - 1 భాగం
పసుపు - 1 భాగం 

 పై రెండింటిని కలిపి 1/2 ఔన్స్ సేవించాలి

23 . పిల్లలలో మల బద్ధకం తగ్గటానికి ( FOR CONSTIPATION IN THE CHILDREN )

 కలబంద రసంతో తయారుచేసిన మూసాంబరం ఒక పలుకు చనుబాలతో పట్టించాలి.
24 . కీళ్ల నొప్పులు తగ్గటానికి ( FOR JOINT PAINS )

 మూసంబరం, జిలకర సమానంగా కలిపి నిమ్మరసంతో నూరి గురిగింజంత మాత్రలు చేసుకుని రోజూ రెండుసార్లు ఒక్కొక్కటి చొప్పున సేవించాలి.
25 . చనుబాలు మరిపించడానికి  ( FOR CHILDREN TO FORGET BREAST FEEDING  ) 

 మూసాంబరాన్ని చను బాలతో అరగదీసి చను మొనలపైన లేపనం చేయాలి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...