కన్నతల్లికి బొట్టు - కరక చెట్టు
ఈనాడు యావత్ ప్రపంచం అనేక పరిశోధనలు చేసి ఎంతో గొప్పదని కొనియాడబడుతున్న త్రిఫల చూర్ణంలో ఈ కరక్కాయ మొట్టమొదటిది. "కరక్కాయ అంటే కన్నతల్లి" అనే నానుడి మన తెలుగునాట ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ప్రతి తెలుగుతల్లి తన చీర కొంగుకు ఎల్లప్పుడూ కరక్కాయను కట్టుకొని ఉంచు కొనేది. ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఏ సమస్య వచ్చినా కరక్కాయ తోనే పరిష్కరించేది.
ఈనాడు ఈ మాతృవిజ్ఞానం లోపించడంవల్ల స్వదేశీ శాస్త్ర విజ్ఞానం మరుగునపడిపోవడంవల్ల ఇంత
అమూల్యమైన చెట్ల విలువ మనకు తెలియకుండాపోయింది. ఆ విలువను మరలా మీకు తెలియజేసి
ఆ మాతృవిజ్ఞానాన్ని మీకందించడానికే ఈ వివరాలు..
కరకచెట్టు - పేర్లు
సంస్కృతంలో హరీతకీ, అభయ, అని, హిందీలో
హరట్ అని, తెలుగులో కరక్కాయ అని, లాటిన్లో
Terminalla chebala
అని ఇంగ్లీషులో Chebulic
Myrabolan అంటారు.
కరక కాయ- రూప గుణ ప్రభావాలు.
ఇది వగరు, తీపి, చేదు రుచులు కలిగి చలువ చేసే
గుణంతో త్రిదోషాలనుహరించే దివ్య ఫలం. అయితే
స్త్రీలు గర్భవతులుగా వున్నప్పుడు దీనిని సేవించ
కూడదు. దీని సుగుణాల గురించి వర్ణించడం
బ్రహ్మతరంకూడా కాదు. కాబట్టి విశ్వాసంతో దీని
ఉపయోగాలు తెలుసుకుందాం.
సర్వరోగాలకు - సంపూర్ణపరిష్కారం
మట్టి మూకుడులో చిన్నమంటపైన దోరగా
వేయించి దంచిన కరక్కాయల బెరడు పొడి 5 గ్రా.
మోతాదుగా సమంగా పాతబెల్లం కలిపి గీష్మ
ఋతువులో సేవించాలి. అలాగే 5 గ్రా .కరకపొడిలో
3 గ్రా. సైంధవ లవణం కలిపి వర్ష ఋతువులో
సేవించాలి. అలాగే 5 గ్రా.కరకపొడిలో సమంగా
చక్కెర కలిపి శరదృతువులో సేవించాలి. తరువాత
5 గ్రా.కరకపొడిలో 2 గ్రా .దోరగా వేయించిన శొంఠి
పొడి కలిపి హేమంత ఋతువులో సేవించాలి.
పై ప్రకారంగానే 5గ్రా. కరకపొడిలో, 2గ్రా. దోరగా
వేయించిన పిప్పళ్ళపొడి కలిపి శిశిరఋతువులో
మంచినీటితో సేవించాలి. ఆ వరుసలోనే 5 గ్రాము
కరకపొడిలో ఒక చెంచా తేనె కలిపి వసంత ఋతువులో
సేవించాలి.
ఈ విధంగా ఆరు ఋతువులలో ఆరు విధాల
అనుపానాలతో సేవించేవారికి నూరేండ్లకు పైగా
అనారోగ్యం కలుగకుండా నిండు యవ్వనంతో
జీవించగలరని మహాఋషుల వాక్కు.
రక్త మొలలకు - రంజైన యోగం.
కరక్కాయ పొడి 5గ్రా, బెల్లం గ్రా.కలిపి
భోజనానికి గంటముందు తింటూ వుంటే రక్త మొలలు
హరించిపోతయ్.
వాంతులకు - వాటమైన యోగం.
కరక్కాయ పొడి 3గ్రా. తేనె ఒక చెంచా కలిపి
రోజుకు రెండు లేదా మూడుసార్లు సేవిస్తూ వుంటే
- వాంతులు కట్టుకుంటయ్.
ఆకలి పెరుగుటకు - అన్నం అరుగుటకు
కరక్కాయ బెరడు పొడి 60 గ్రా,పిప్పళ్ళపొడి
30 గ్రా., దాల్చిన చెక్క పొడి 10 గ్రా, నల్లఉప్పు పొడి
10 గ్రా. పొంగించిన మంచి ఇంగువ పొడి 10 గ్రా
ఇవన్నీ దోరగా వేయించి కలిపి నిలువ వుంచుకోవాలి.
పూటకు రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా,
గోరువెచ్చని నీటిలో రెండుపూటలా ఆహారానికి
అరగంటముందు సేవిస్తూ వుంటే ఆకలి బాగా
పెరుగుతుంది. అన్నంబాగా అరుగుతుంది.
సుఖ విరేచనమునకు - సులభ యోగం
కరక్కాయ బెరడు పొడి20 గ్రా,ధనియాల పొడి 50గ్రా,
పటిక బెల్లం పొడి 70గ్రా, కలిపి నిలువ వుంచుకోవాలి.
రోజూ రెండుపూటలా ఒక చెంచా పొడి ఒక గ్లాసు
మంచినీటిలో కలిపి ఆహారం తరువాత సేవిస్తూ వుంటే
మెదడుకు బలం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా
ఉంటుంది. ఉదయం సుఖ విరేచనం అవుతుంది.
పిల్లల నోటిపూత తగ్గుటకు.
కరక్కాయపొడి, జీలకర్రపొడి, మాను పసుపుపొడి,
ఆకుపత్రి పొడి, వీటిని సమంగా కలిపివుంచుకొని అయి
దారు చిటికెలపొడిలో, పావుచెంచాతేనె కలిపి రంగ
రించి పట్టిస్తూవుంటే నోటిపూత హరించిపోతుంది.
చిన్నపిల్లల మలబద్దకానికి..
లేత కరక పిందెలను చిన్నమంటపైన నేతిలో
దోరగా వేయించి పొడి కొట్టి దానితో సమంగా సైంధవ
లవణం కలిపి నిలువ వుంచుకోవాలి. పూటకు ఒకటి
నుంచి మూడు చిటికెలు మోతాదుగా కొంచెం నీటితో
కలిపి తాగిస్తూ వుంటే పిల్లల కడుపునొప్పి, కడుపు
ఉబ్బరం, అగ్నిమాంద్యం, మలబద్దకం తగ్గిపోతయ్.
అన్నిరకాల అండ వృద్ధి - హరించుటకు.
కరక పెచ్చుల పొడి, సన్న రాష్ట్రంపొడి, వెల్లుల్లి
పాయలు ఈ మూడింటిని సమంగా తీసుకొని ఆముదముచెట్టు వేర్ల రసంతో బాగా మెత్తగా మర్దించి
కుంకుడు గింజలంత మాత్రలు చేసి నీడలో గాలికి
ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
రోజూ రెండు లేదా మూడు
పూటలా పూటకు ఒక మాత్ర చొప్పున నీటితో సేవిస్తూ
వుంటే అండవృద్ధులు హరించిపోతయ్. *
అతిగా ఒంటికి చెమట పడితే ( FOR EXCESSIVE BODY SWEATING )
కరక్కాయ బెరడు
మంచి నీరు
బెరడును నీటితో మెత్తగా నూరి ,వొళ్ళంతా నలుగుపెట్టుకొని , ఆరిన తర్వాత స్నానం చేస్తుండాలి.
uses - అతి చెమట బాధ తగ్గిపోతుంది.