30, డిసెంబర్ 2011, శుక్రవారం

డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు - కసివింద చెట్టు ( NEGRO COFFEE )


తెలుగు - కసివింద చెట్టు , చెన్నంగి చెట్టు.
ఇంగ్లీష్ - నెగ్రో కాఫీ
హిందీ - కసౌందీ 
సంస్కృతం - కాసారి , కాసమర్ధ 

1 . పక్ష వాతానికి ( FOR PERALYSIS )

కసివింద ఆకులు 
వెన్న

ఆకులను వెన్నతో నూరి చచ్చు బడిన పక్షవాత భాగాలపై ప్రతి రోజూ మర్దన చేస్తుండాలి.

uses - కొన్ని రోజుల్లో అవయవాలు తిరిగి బాగు  పడతాయి.

2 . గాయాల రక్తం ఆగకపోతే ( FOR NONSTOP BLEEDING FROM WOUNDS )

కసివింద ఆకులు 

ఆకులను మెత్తగా నూరి రసాన్ని గాయంపై పిండి , ఆకుల ముద్దను పైన వేసి  కట్టు కట్టాలి.

uses -  స్రవించే రక్తం ఆగిపోయి గాయం త్వరగా మానిపోతుంది.

3 . రేచీకటి తగ్గడానికి ( FOR NIGHT BLINDNESS ) 

 కసివింద పువ్వుల రసం - 1 లేదా 2 చుక్కలు

 కసివింద పువ్వులను నలగగొట్టి బట్టలో వేసి పిండి రసం తీసి ఒకటి లేదా రెండు చుక్కలను కళ్ళల్లో వేస్తుండాలి.

uses - 7 రోజుల్లో రేచీకటి తగ్గిపోతుంది .

4 . సర్ప విషం విరుగుడుకు ( FOR SNAKE BITE - POISON )

పచ్చి కసివింద ఆకు - 20 gm
మిరియాలు - 12 

 పై రెండింటిని కలిపి మెత్తగా నూరి రసాన్ని కొంచెం నీటితో కలిపి పాము కరిచిన వారికి తాగించాలి. కరిచిన చోట కసివింద ఆకు ముద్దను వేసి కట్టు కట్టాలి. ఈ విధంగా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.

uses - పాము విషం విరిగి పోతుంది.

5 . చలి జ్వరం తగ్గుటకు ( FOR MALARIA FEVER )

కసివింద వేర్లు - 10 gm
నీరు - 1 పెద్ద గ్లాస్ నిండా

 వేరును శుభ్రంగా కడిగి నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి, దించి వడపోసి జ్వరం వచ్చే ముందు గోరువెచ్చగా తాగిస్తుండాలి.

Uses - చలి జ్వరం రాకుండా ఆగిపోతుంది.

కమనీయ ఔషధాల సమ గంధ - కసివింద (చెన్నంగి
 దాదాపు అన్ని ప్రాంతాలలో కసివింద చెట్లు
పెరిగి వున్నయ్ గమనించండి. వీటిల్లో చిన్న కసివింద, పెద్ద కసివింద అనే రెండు జాతులు లభ్యమౌతున్నయ్.
ఈ కసివింద చెట్టును కొన్ని ప్రాంతాలలో చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు. చిన్న చెన్నంగిని
కూర చెన్నంగి అనికూడా పిలుస్తూ దాని ఆకులతో పచ్చడిగా, కారం పొడిగా తయారుచేసుకొని
వాడుకుంటూ కడుపులోని మలినాలను సుఖవిరేచనం ద్వారా బహిష్కరింపచేసే అద్భుతమైన ఆహార
సాంప్రదాయం ఈనాటికి తెలంగాణ పల్లెల్లో వుండటం ఎంతో ముదావహం. పెద్ద కసివింద సర్వాంగాలు
అంటే ఆకులు, పూలు, గింజలు, వేరుబెరడు, కాండంబెరడు అన్నీ అద్భుతమైన ఔషధ శక్తులు నింపుకొనివున్నయ్. వీటితో ఔషధ ప్రయోగాలు కూడా కోకొల్లలుగా వున్నయ్.
 కొన్ని ఉత్తమ ప్రయోగాలను అందిస్తున్నాం.

కసివింద- రూప గుణ ధర్మాలు .

దీని ఆకురసం చేదుగా వుండి వేడి చేస్తుంది.
వాతాన్ని, విషాన్ని హరించి వేస్తుంది. గాయాలను,
వ్రణాలను, చర్మ రోగాలను పోగొడుతుంది. సుఖ
విరేచనం చేస్తుంది. దీని ఉపయోగాలు తెలుసు
కుందాం.

పసిపిల్లల - బాల పాప చిన్నెలకు

కొంతమంది పసిపిల్లలకు బాలపాప చిన్నెలు అనే సమస్య వస్తుంది. ఉన్నట్లుండి పిల్లలు కళ్ళు
తేలవేసి మూర్ఛ వచ్చినట్లుగా బిగుసుకుపోతారు. అలాంటి
పిల్లలకు దోరగావేయించి దంచిన కసివింద గింజల పొడి చిటికెడు మోతాదుగా తల్లి పాలలో కలిపి రెండుపూటలా
తినిపిస్తుంటే బాలపాపచిన్నెలు తగ్గిపోతయ్.

చర్మ రోగాలకు కసివింద 

కసివింద ఆకులు, వేరు బెరడు ఆరబెట్టి పొడి చేసి నిలువ ఉంచుకోవాలి .ఈ పొడిలో తేనె కలిపి నూరి పైన లేపనం చేస్తుంటే అనేక రకాల చర్మ రోగాలు ,పుండ్లు, వ్రణాలు, గాయాలు మానిపోతాయి.

కసివింద గింజలతో కమ్మని కాఫీ..

కసివింద గింజలను దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం లాగా కాచి అందులో తగినన్ని పాలు, కండ చక్కెర కలిపి కాఫీ లాగా తాగుతుంటే సమస్త మూత్ర రోగాలు హరించి రక్త శుద్ధి జరుగుతుంది.

అతిమూత్రానికి కసివింద 

కసివింద తగ్గించాలని కొద్దిగా వేయించి పొడి చసి
 నిల్వ ఉంచుకోవాలి ఈ పొడిని పావు చెంచా నుండి అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే అతిమూత్రం అణిగిపోతుంది.

స్త్రీల సకల కుసుమ రోగాలకు 

కసివింద చెట్టు బెరడును 20 గ్రాములు తీసుకొని అర లీటర్ నీటిలో వేసి పదినిమిషాలు మరిగించి దించి చల్లార్చాలి. ఈ నీటితో స్త్రీలు మూత్రానికి వెళ్లిన ప్రతిసారి మర్మాంగాన్ని అడుగుతూ ఉంటే కుసుమ రోగాలు హరించిపోతాయి.


 వాతరోగాలకు. కసివిందతైలం 

కనివిందాకులు100(గా, చింతాకులు 100 గ్రా, వావిలాకులు 100గ్రా, జిల్లేడు అకులు 100గ్రా, ఉమ్మెత్తాకులు 100 గ్రా మొత్తం దంచి రసం తీసి ఆ రసంలో అరకేజీ నువ్వులనూవె కలిపి చిన్నమంటపైన నూనెమిగిలేవరకు మరిగించి దించి వడపోసుకోవాలి. రోజూ రెండుపూటలా 
ఈ నూనెను గోరువెచ్చగాచేసి మర్దనచేస్తుంటే అన్ని 
రకాల వాతనొప్పులు అశ్చర్యకరంగా హరించి పోత్రయ్. 


 గర్భంనిలుచుటకు 

గుప్పెడు కసివిందాకులు, దోరగా వేయించిన పిప్పళ్ల పొడి 2 గ్రా కలిపినూరి ఆమిశ్రమాన్ని అరగ్లాస్ నాటుఆవుపాలలో కలిపి బహిష్టుస్నానం చేసిన రోజునుండి వారం రోజులపాటు పరగడుపున తాగి ఆ తరువాత భర్తతో సంసారం చేయాలి. ఈ విధంగా మూడు బహిష్టుల వరకు చేస్తుంటే గర్భదోషాలు హరించి సంతాన యోగం కలుగుతుంది... 

బోదకాలుకు కసివింద 

కసివింద చెట్టు వేర్లపై బెరడును తెచ్చికడిగి అరబెట్టిదంచి జల్లించి నిలువచేసుకోవాలి. రోజూ రెండు పూటలా పూటకు 2గ్రా నుండి మొదలు పెట్టి , క్రమంగా శరీర స్థితిని బట్టి  5గ్రా వరకు పెంచుకుంటూ రెండు చెంచాల నాటు ఆవునెయ్యి కలిపి ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే బోద వాపులు తగ్గి పోతయ్‌. 

 ఈ చూర్ణం ప్రారంభించినప్పుడు విరేచనాలు కావచ్చు. అందువల్ల కొద్ది మోతాదుగా ప్రారంభించి క్రమంగా పెంచుకోవాలి. 

ఉబ్బురోగాలకు కసివింద 

కసివిందవేరు పైబెరడును పొడిచేసి నిలువ చేసుకోవాలి . ఈ పొడి 2 నుండి 3గ్రా  మోతాదు గా ఒక చెంచా తేనె కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే శరీరమంతా నిండి పోయిన చెడునీరు బహిష్కరింపబడి ఉబ్బు రోగం తగ్గిపోతుంది. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...