తెలుగు - అవిసె చెట్టు , అగిసె చెట్టు
english - linseed plant
hindi - అగస్తియ , మాసిన
sanskrit - ఉమ , అతసీ , అగస్త్య వృక్షం
1. కంటి రోగాలకు( FOR EYE LAYERS ,NIGHT BLINDNESS )
అవిసె ఆకు రసం - 1 చుక్క
అవిసె ఆకును కడిగి చేతితో నలిపి రసం తీసి వడపోసి ఒక చుక్క కంటిలో వేసుకోవాలి.
uses - కంటి మసకలు తగ్గిపోయి చూపు నిర్మలంగా అవుతుంది. రే చీకటి కూడా తగ్గిపోతుంది.
2 . పార్శ్వ నొప్పి తగ్గుటకు( FOR MIGRAINE )
అవిసె గింజలు - 5 gm
ఆవాలు - 5 gm
పై వాటిని కలిపి మంచినీటితో మెత్తగా నూరి తల కణతల పైన మాత్రమే పట్టులాగా వేసి పైన కాగితం అంటించాలి. తర్వాత, ఇటుక పొడిని వేయించి బట్టలో మూట కట్టి దానితో కాపడం పెడుతూ ఉండాలి.
uses - అప్పటికప్పుడే పార్శ్వ నొప్పి తగ్గి పోతుంది.
3 . మూత్ర పిండాల రక్షణకు ( FOR KIDNEY DISEASES )
అవిసె గింజలు - 2 భాగాలు
పటిక బెల్లం పొడి - 1 భాగం
గింజలను దోరగా వేయించి పటిక బెల్లం పొడి కలిపి రోట్లో వేసి మెత్తగా అయ్యేవరకు దంచాలి .తర్వాత ఆ ముద్దను 10 గ్రాముల మోతాదుగా లడ్డులు తయారు చేసి నిలువ చేసుకోవాలి .
ఉదయం సాయంత్రం ఆహారానికి గంట ముందు ఒక అవిసె లడ్డును తినాలి.
uses - మూత్రపిండాల సమస్యలు, మూత్ర వ్యాధులు తగ్గిపోతాయి.
4 . ఉబ్బసం తగ్గుటకు ( FOR ASTHMA )
అవిసె గింజలు - 40 gm
మిరియాలు- 10 gm
పై వాటిని దోరగా వేయించి విడివిడిగా దంచి జల్లించి కలిపి ఉంచుకోవాలి.
రోజు రెండు పూటలా మూడు గ్రాముల పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి తినాలి.
uses - మూడు నాలుగు వారాలలో ఉబ్బస వ్యాధి తగ్గిపోతుంది.
5 . సెగ గడ్డలు తగ్గడానికి( FOR BOILS ON THE SKIN )
అవిసె గింజలు
పసుపు కొమ్ములు
పై వాటిని సమంగా తీసుకుని మెత్తగా నూరి గడ్డల పైన వేసి కట్టు కడుతూ ఉండాలి.
uses - మూడు రోజులలో గడ్డలు పగిలిపోయి పుండు మాడిపోతుంది.