Thursday, 29 December 2011

MEDICINAL USES OF VUMMETTA ( DATURA )




Aaధ్యాత్మిక ప్రాముఖ్యత. ఔషధ విలువలు గల
మొక్క ఉమ్మెత్త. శివునకు ప్రీతి పాత్రమైనది.
బంజరు భూములలో ఎక్కువగా పెరుగుతుంది.
అందమైన మొక్క : సుమారు రెండు నుండి మూడు
మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొడవుగా గరాటు ఆకా
రంలోవుండే ఈ పుష్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.
ఇవి తెలుపు లేక వంగపండు రంగులో ఉంటాయి.
ఈ మొక్క కాయలు ఇంచుమించు గుండ్రంగా
వుండి అనేకముళ్ళతో నిండివుంటాయి. ఫలాలు, పుష్పాలు
సంవత్సరం పొడవునా లభిస్తాయి.
ఉమ్మెత్త శాస్త్రీయ సమాచారం : ఉమ్మెత్త మొక్కను
ఇంగ్లీష్ లో థార్నీ యాపిల్ (Thorny Apple)అంటారు.
శాస్త్రీయ నామాలు- దతూరా (
స్టెమోలియం, దతూరా
మెటల్. ఇది పాలనేసీ కుటుంబానికి చెందినది.
మిర్చి, పొగాకు, వంగ, టొమేటో, బంగాళదుంప,
బెల్లడోనా, పెర్యూనియా వంటి అనేక ఉపయుక్తమైన
-మొక్కలు కూడా సొలనేసీ కుటుంబానికి చెందినవే.
ఆసియా ఖండానికి చెందిన ఈ ఉమ్మెత్త మొక్క భారత
దేశంలో అన్నిచోట్లా పెరుగుతుంది.
పుత్రప్రాప్తి కొరకు : ఉమ్మెత్త పూలతో శివుని పూజిస్తే
పుత్ర సంతానం కలుగుతుందని శివపురాణంలో చెప్ప
బడి వుంది. ఉమ్మెత్త కాయలు, ఉమ్మెత్త పూలు శివునికి
అత్యంత ఇష్టమైనవి. ఎర్రని కాడగల ఉమ్మెత్త పూలు
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
ఉమ్మెత్త కాయలతో శివునిపూజిస్తే స్వర్గప్రాప్తి కలుగు
తుంది అనేది శివపురాణాంతర్గతం. నల్లటి ఉమ్మెత్త
మొక్కకు పాలు కలిపిన నీళ్ళు 40 రోజులు పోస్తే అప
మృత్యుభయం తొలగుతుందనే నమ్మకమూ ఉంది.
రసాయనిక ప్రాముఖ్యత : ఉమ్మెత్త మొక్కలో ఎన్నో
విలువైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అవేగాక ఎట్రో పైన్,
- కీళ్ళనొప్పులు వంటి
స్కోపోలమైన్, హిస్టోలియమైన, నికోటినమైన్, హయోసైస్,
హయాసయోమిన్ వంటి మరెన్నో రసాయనిక పదార్థాలు
కూడా ఉమ్మెత్త మొక్కలో ఉన్నాయి.
మొక్కలోని అన్ని భాగాలు ఔషధాలే : ఉమ్మెత్త మొక్క
కాండం, ఆకులు, పుష్పాలు, వేర్లు,
కాయలు అన్నీ కూడా
చక్కని ఔషదగుణాలు కలిగి వున్నాయి.
ఆకులు- చెవిపోటు, గాయిటర్,
కీ,
వ్యాధులను తగ్గిస్తాయి. వేర్లు - ఫైల్సు, పన్నుపోటులను
నయం చేస్తాయి. విత్తనాలు - జ్వరం, పిప్పిపన్ను పోటు,
మానసిక రుగ్మతలను అరికడతాయి. పుష్పాలు - పేలు,
చుండ్రు తగ్గించడంలో ఉపకరిస్తాయి.
సయాటికా నివారణలో : ఉమ్మెత్త, మాదర్, ఎడ్యూజా,
నిర్గుండి, ఒకయాన్, సహజనా మొక్కల ఆకులు ఒక్కొక్క
రకానికి ఆరేసి గ్రాములు తీసుకోవాలి.
వీటిని మెత్తని చూర్ణముగా చేసి ఆవనూనెతో కలిపి
సంబంధిత శరీరభాగం పై మర్దనా చేస్తే సయాటికా బాధ
నుంచి ఉపశమనం కలుగుతుంది.
పేలు, చుండ్రు, చర్మవ్యాధులు : ఉమ్మెత్త
మొక్క
కాయలు, ఆకులు, పూలు, వేర్లు, కాండం అన్నీ కలిపి
ఎండబెట్టి భస్మంచెయ్యాలి. ఈ భస్మాన్ని కొబ్బరినూనెతో
కలిపి తలకు రాసుకుంటే పేలు, చుండ్రు తగ్గుతాయి.
ఇదే భస్మాన్ని ఆవనూనెతో కలిపి ఉపయోగిస్తే ఎగ్జిమా
వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.
వాపులు, నొప్పులు : ఉమ్మెత్త ఆకులపై కొద్దిగా వేరు
చెనగనూనె రాసి గోరువెచ్చగా చెయ్యాలి. దీనిని నొప్పు
లపై వేస్తే కొద్దిగంటలలో వాపులు తగ్గుతాయి. అవసర
మైతే తిరిగి వెయ్యవచ్చు. ఆకుల పొడిని పసుపుతో కలిపి
వేసినా కూడా వాపులు నయమవుతాయి.
పిచ్చికుక్క కాటుకు విరుగుడు : ఉమ్మెత్త ఆకులు
ముద్దగా చేసి కుక్క.కోతి కరిచిన చోటవేస్తే వారంలో గుణం
L
కనిపిస్తుంది. ఈ ఆకులరసం, బెల్లం,పాలు, నెయ్యి సమ
పాళ్ళలో తీసుకొని సేవిస్తే పిచ్చికుక్క కాటుకు మంచి
విరుగుడు. హైడ్రోఫోబియా రాకుండా కాపాడుతుంది.
ఆస్మా : ఎండిన ఉమ్మెత్త ఆకులను, చిలుములో వేసి
వెలిగించి పొగపీలిస్తే ఆస్మా వ్యాధికి ఉపశమనం కలుగు
తుంది. దగ్గు కూడా తగ్గుతుంది.
పిప్పిపన్ను : ఉమ్మెత్త విత్తనాలు బాగా నూరి పిప్పిపన్నులో
పెడితే పన్నుపోటు నుంచి స్వస్థత కలుగుతుంది.
మూలశంఖ : ఉమ్మెత్త వేరును మెత్తగా దంచి పేన్గా
తయారుచేసి రాస్తే ఫైల్సు తగ్గుతాయి.
అన్ని రకాల జ్వరాలకు : ఉమ్మెత్తతో తయారుచేసిన
ఆరోగ్యవటి మాత్రలు అన్ని జ్వరాలను హరిస్తాయి.
మానసిక
వ్యాధులు:
: మూడు, నాలుగు ఉమ్మెత్త విత్తనా
లను కొద్దిగా నెయ్యితో కలిసి, నూరి తీసుకుంటే అన్ని
రకాల మానసిక రుగ్మతలు తగ్గుతాయి.
ఉమ్మెత్త నివారించే మరికొన్ని రోగాలు : చెవిపోటు,
అల్సర్, గాయిటర్, గవదబిళ్ళలు, మూర్ఛ,వరిబీజం,
సిఫిలిస్, మలేరియా, లైంగిక శక్తి తగ్గుట, జీర్ణశక్తి మంద
గించుట, కుష్టు వ్యాధి వంటి రోగాలకు ఉమ్మెత్త చక్కటి
ఔషధం. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతో మాత్రమే!
ఆయా రోగాల నివారణకు ప్రయత్నించాలి.
రక్తపోటును తగ్గించే ఉమ్మెత్త : ఉమ్మెత్త ఆకులతో కలిపి
నూరితే పాదరసం ఘనీభవిస్తుంది. ఘనరూపంలో ఉండే
పాదరసాన్ని పూసలుగా మార్చి నల్లటి సిల్కు దారంతో
గుచ్చి మెడలో ధరిస్తే రక్తపోటు స్థిరపడుతుంది.
ఉమ్మెత్తతో తయారుచేసే కొన్ని ఔషధాలు : కనకతైలం,
మృతసంజీవని, దతుర్ ఫలివస్మ, దతూరాది ప్రలేపం.
దుగ్ధవిటి, కనకాసనం, దుర్దురాదితైలం, స్వల్ప జరాం
కుశరసం, లఘు విషగర్వతైలం.

No comments:

Post a Comment