30, డిసెంబర్ 2011, శుక్రవారం

డా ఏల్చూరి- కామంచి చెట్టుతో ఆయుర్వేదం( GARDEN NIGHT SHADE )


తెలుగులో.. కామంచి ,బుడ్డ కాశి, కాచి, కాస చెట్టు, కాసర చెట్టు  .
ఇంగ్లీషులో గార్డెన్ నైట్ షేడ్ 
హిందీలో మాకోమ్ 
సంస్కృతంలో కామాక్షి, కాకమాచిక , కాకామి శుక్ల
లాటిన్ లో సోలానం నిగ్రం

1 . కీళ్ల నొప్పులు తగ్గుటకు ( FOR JOINT PAINS )

కామంచి ఆకులు

 కామంచి ఆకులను నూరి ,వేడి చేసి నొప్పుల పైన కట్టు కట్టాలి.

uses - కీళ్ల నొప్పులు ,వాపులు తగ్గిపోతాయి.

2 . జలుబు , పడిశం తగ్గుటకు ( FOR COLD )

కామంచి ఆకులు మరియు నీరు

 ఆకులను నలగగొట్టి నీటిలో వేసి మూత పెట్టి మరగబెట్టాలి, తర్వాత పాత్రను దింపి మూత తీసి ఆ ఆవిరిని ముక్కుతో, నోటితో పీల్చాలి.

uses - జలుబు మరియు పడిశ భారం తగ్గిపోతాయి

3 . కాలేయ ఆరోగ్యానికి ( FOR LIVER HEALTH )
 
కామంచి ఆకులు

 ఆకులు దొరికినంత కాలం పప్పులో వేసుకొని గాని, పులుసు కూరగా వండుకొని గాని తింటూ ఉంటే జీవితంలో లివర్ రోగం రాదు. లివర్లో సమస్యలు ఉన్నవారు ఈ ఆకు రసాన్ని గాని ,ఆకుకూరను గాని రోజు సేవిస్తుండాలి.


uses -  కామెర్లు ,ఒళ్లంతా నిండిన చెడు నీరు, లివర్ వాపు తగ్గిపోతాయి.

*  దీని ఆకు రసాన్ని లోపలికి ఇచ్చేటప్పుడు వేడి చేసి వడపోసి చల్లార్చి ఇవ్వాలి. పచ్చి రసం వాంతులు కలిగిస్తుంది *

4 . పిచ్చి కుక్క కాటుకు ప్రథమ చికిత్స ( FIRST AID TO DOG BITE )

కామంచి ఆకుల కషాయము మరియు పసుపు 



 పిచ్చికుక్క కరవగానే కామంచి ఆకులతో కాచిన కషాయంతో కడగాలి. తరువాత కొంత కషాయాన్ని లోపలికి ఇవ్వాలి .అలాగే కామంచి ఆకులను మెత్తగా నూరి ,పసుపు కలిపి గాయం పైన కట్టు కట్టాలి .ఇది ప్రథమ చికిత్స గా చేసుకొని మిగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి.

uses - పిచ్చి కుక్క విషము విరిగిపోతుంది.

5 . చీము కారే ఎర్ర , తెల్ల,పసుపు సెగ రోగాలకు ( FOR PUS SECRETED RED ,WHITE ,YELLOW COLOURED GONORRHOEA DISEASES )

కామంచి ఆకు రసము - 3 స్పూన్స్ 
పటిక బెల్లము - కొంచెం


 ఆకు రసాన్ని వేడి చేసి వడపోసి పటిక బెల్లం కలిపి రెండు పూటలా 20 రోజుల పాటు సేవించాలి.

 uses -  ఎరుపు, తెలుపు ,పసుపు రంగులలో చీముకారే సెగ రోగాలు తగ్గిపోతాయి .ఇంద్రియానికి బలం కలుగుతుంది.

తలనొప్పికి కామంచి 

కామంచి ఆకును మెత్తగా నూరి తల పైన పట్టు వేస్తుంటే అంత తీవ్రమైన తలనొప్పి అయినా తగ్గిపోతుంది.

నేత్ర రోగాలకు కామంచి 

దీని ఆకు రసాన్ని ఒక బొట్టు కంటిలో వేసుకుంటే కంటి చపు పెరుగుతుంది. అలాగే కంటి మూలలో రంద్రం పడి ఏర్పడిన కురుపు ను కూడా మాన్పుతుంది. కామంచి ఆకులను 10 గ్రాముల మోతాదుగా ఒక గ్లాసు నీటిలో వేసి సగం గ్లాసు కషాయం మిగిలేటట్లు మరగపెట్టి వడపోసి చల్లార్చి ఆ నీటితో మూసుకున్న కండ్ల పైన సున్నితంగా కడుగుతూ ఉంటే కంటి చూపు క్రమంగా మెరుగు పడుతుంది.

గొంతు రోగాలకు కామంచి 

కామంచి ఆకులను దంచి తీసిన రసం గోరువెచ్చగా  వేడి చేసి వడపోసి ,నోటిలో పోసుకొని, పుక్కిలిస్తూ ఉంటే గొంతువాపు ,గొంతు నొప్పి ,గొంతు పుండు ,దంతాల బాధలు, నాలుక సమస్యలు తగ్గిపోతాయి.

మన ప్రియమైన  గ్రామాలలో పోలిమేర్లచుట్టూ,పొలాలచుట్టూ
ముఖ్యంగా మెట్టప్రాంతాలలో కనిపించే నల్ల బుడ్డకాశ అనబడే నల్లకామంచిచెట్టు ,ఎర్రబుడ్డకాశ
అనబడే ఎర్ర కామంచిచెట్టు మీరు గమనించారా! ఇది సాక్షాత్తూ ఆ జగజ్జనని అయిన కామాక్షమ్మ
తల్లికి మారురూపుగా ఈ భూమిపైన అవతరించిందని మన మహర్షులు కొనియాడారు. ఎర్రగా
బఠాణిగింజంత పండ్లతో ఎర్ర కామంచి, నల్లని పండ్లతో నల్ల కామంచి పెరుగుతయ్. గ్రామీణులు
ఈ పండ్లను తింటూ వుంటారు. అయితే, ఈ చెట్టు ఉపయోగాలు వారికి తెలియవు. అందుకే
సవివరంగా తెలియజేయడానికే ఈ వ్యాసం .

కామంచి - రూప గుణ ధర్మాలు
ఇది ఏఏటికాయేడు పుట్టి గిడుతూవుంటుంది...
దీనిపండ్లు నల్లగా లేక ఎర్రగా వుంటయ్. దీని
ఆకుకూరగానీ ఆకురసంగానీ వాత,పిత్త, కఫ
సంబంధమైన సమస్త దోషాలను సరిచేయగలుగు
తుంది. చచ్చుబడ్డ వీర్యానికి వేడి పుట్టిస్తుంది.
ముఖ్యంగా లివర్సంబంధమైన పాండురోగాన్ని,
వాపులను పోగొట్టి ప్రాణం పోస్తుంది. క్రిములను,
విషాలను హరించి సుఖవిరేచనంతో హృదయాన్ని
కాపాడుతూ ఆయురారోగ్యాలను అందిస్తుంది.

చెవి రోగాలకు కామంచి 

కామంచి ఆకు రసం ఒక చెంచాలో తీసుకొని కొంచెం వేడి చేసి చెవులలో వేసుకుంటే అతి వేడి వల్ల వచ్చిన చెవిపోటు వెంటనే తగ్గిపోతుంది.

మొండి వ్రణాలకు కామంచి..

కామంచి ఆకులను యవధాన్యపు పిండితో కలిపి  ఉడకబెట్టి గోరువెచ్చగా పైన వేసి కట్టు కడుతూ ఉంటే వనాలు మాడిపోతాయి.

కాలేయ రోగాలకు కామంచి షర్బత్ 

బాగా పండ్లు పండిన కామంచి చెట్టును వేర్లు తప్ప మిగతా భాగాన్ని తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి కడిగి మెత్తగా దంచాలి. ఆ ముద్దను బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంట పైన రసం ఇగిరిపోయే వరకు ఉంచి దించాలి. కొంత సేపటికి పైన తేట నీరు పేరుకుంటుంది.పాత్రను మెల్లగా వంచి ఆ  తేట నీటిని వేరే పాత్ర లోకి వంచుకోవాలి. దాని బరువుకు రెండు రెట్లు కండ చక్కెర కలిపి కరిగించి మరలా పొయ్యి మీద పెట్టి లేత పాకం వచ్చే వరకు మరిగించి దించి నిలువ చేసుకోవాలి.

ఈ పాకాన్ని పూటకు ఒకటి నుంచి రెండు చెంచాల చొప్పున సేవిస్తుంటే సాఫీగా విరేచనం జరిగి వేడి తగ్గి శరీరంలోని విషపు నీరంతా హరించి పోతుంది.కామెర్లు, కాలేయ వాపు కూడా తగ్గి పోతయ్‌.

మూత్రపిండాల వాపుకు, పుండుకు

కామంచిపూలను తగుమాత్రంగా రెండు
పూటలా ఆహారానికి గంటముందు ఒకటి లేక
రెండుగ్రాములు తింటుంటే మూత్రం ధారాళంగా
విడుదలకావడమేకాక మూత్రకోశంలోని పుండు
మూత్రపిండాలవాపు తగ్గిపోతయ్.

కాలినగాయాలకు - కామంచి

కామంచి ఆకులను నూరితీసిన రసంలో రోజ్
వాటర్ కలిపి పైన లేపనంచేస్తుంటే కాలినపుండ్లు
బొబ్బలు హరించిపోతయ్.

*గర్భిణీ స్త్రీలు పొరపాటుగా కూడా ఈ
ఆకును ఏవిధంగానూ వాడకూడదు. వాడితే గర్భ
స్రావమౌతుంది. *

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...