ముందుగా దృష్టిపెట్టాల్సింది మెరిసే కేశసౌందర్యంపైనే.అందుకే తలస్నానం చేసేముందు
ఈ కిటుకులు పాటించి చూడండి.కురులు నిగనిగలాడతాయి.
ముందుగా జుట్టుకు ఆలివ్ నూనె రాసు
కోండి. ఇప్పుడు మూడు అరటిపండ్లను తీసు
కుని మెత్తని గుజ్జులా చేసి అందులో
రెండు చెంచాల గ్లిజరిన్, ఐదుచెంచాల
తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈమిశ్రమాన్ని తలకు పూతలావేసి.. ముప్పావుగంట తరవాత
తలస్నానం చేయాలి. పట్టుకు
చ్చులా మెరిసే కురులు మీసొంతమవుతాయి.
గిన్నెలో సగం నీరు తీసుకుని మూడు చెంచాల
మెంతులు, గుప్పెడు గోరింటాకుల్నివేసి బాగా
మరిగించి చల్లారనివ్వాలి.
తరవాత వడకట్టి..
ఆ సగం నిమ్మ చెక్కను పిండి. తలస్నానం పూర్తయ్యాక.. తలపై నుంచి
ధారలా పోయాలి. దీనివల్ల జుట్టు రోజంతా పట్టుకుచ్చులా మృదువుగా ఉంటుంది.
కుంకుడు, శీకాకాయతో తలస్నానం చేస్తున్నారా? ముందుగా నానబెట్టే
కుంకుడు గింజల్లో రెండు చెంచాల ఉసిరి పొడి కూడా కలపండి. జుట్టుపొడి
బారదు. చాలా మెత్తగా జాలువారుతూ ఉంటుంది.
రెండు చెంచాల తాజా క్రీం తీసుకుని అరచెంచా కొబ్బరినూనె. పావుకప్పు
కన్నా కాస్త తక్కువగా నిమ్మరసం చేర్చాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని
పది హేను నిమిషాల తరవాత తలస్నానం చేయాలి.
గుడ్డుసొనలో చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకోవాలి. పదినిమిషాల
తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగాఉంటుంది.
చివర్లు చిట్లిన జుట్టును కత్తిరించే సమయం లేదా? కప్పు బొప్పాయి
గుట్టుకు అరకప్పు పెరుగు చేర్చి.. తలకు పూతలావేయాలి. ఆరగంట తరవాత తలస్నానం చేస్తే ఎంతో మార్పు ఉంటుంది,
పావు కప్పు నిమ్మరసానికి మూడు చెంచాల మినుముల పొడి,
అరకప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని..
గంటయ్యాక కడిగేసుకుంటేజుట్టు అందంగా కనిపిస్తుంది.
కప్పు కొబ్బరిపాలకు అరకప్పు సెనగపిండి చేర్చి తలకు రాసి
మర్దన చేయాలి. పదిహేను నిమిషాలయ్యాక తలను కడిగేసుకుంటే చాలు. పొడిబారిన జుట్టు మెరుస్తుంది.
కురుల అందం తీరువుగా...
కురుల సంరక్షణ కోసం ఖరీదైన సౌందర్యోత్పత్తులతోపాటు.. కొన్ని
జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఈ కాలంలో వాతావరణం, కాలుష్య-వల్ల రకరకాల సమస్యలు బాధిస్తాయి.
తరచూ హెయిర్ డ్రయ్యర్ వాడటం అంత మంచిది కాదు. దానివల్ల క్రమంగా జుట్టు కాంతి విహీనంగా మారుతుంది. మెరుపుకోసంచాలామంది. కెల్, స్త్రీలు ఉపయోగిస్తుంటారు. వీటిని వాడినప్పుడువర్షంలో గనుక తడిస్తే తల్లో చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంది.
అందుకే వీటి వాడకాన్ని పరిమితం చేయాలి. జుట్టును వదిలేయకుండా.. వస్త్రధారణ, వీలును బట్టి అల్లడం, పోనీటెయిల్ వేసుకోవడంచేయాలి. వదిలేయడం వల్ల కురుల్లో త్వరగా దుమ్ము చేరిపోతుంది.
ఒకవేళ అలా వదిలినప్పుడు తలస్నానం చేయడం తప్పనిసరి.
వేడి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, వెనిగర్ కలిపి దువ్వెనలను
నానబెట్టాలి. గంటయ్యాక చల్లటినీళ్లతో శుభ్రపరిచి ఎండలో ఉంచాలి.
ఫలితంగా కనిపించని ఇన్ ఫెక్షన్ కారకాలు దూరమవుతాయి. వారం లేదా
పది రోజులకోసారి ఇలా చేస్తూ ఉండాలి.. తలను మృదువుగా ఎక్కువసార్లు దువ్వాలి. ఇందుకు చెక్కతో చేసిన దువ్వెనలైతే బాగుంటాయి.
వాటివల్ల రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది.. మాడుకు ఒత్తిడి తగలదు.
• దిండ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కనిపించని
దుమ్ము కారణంగా రకరకాల క్రిములు, ఇన్ ఫెక్షన్ కారకాలు వాటి మీద
పేరుకుపోతాయి. నిద్రించినప్పుడు అవి తల్లో చేరి.. రకరకాల సమస్య
లకు దారితీస్తాయి. ఎప్పటికప్పుడు గలేబులను తీసి డిటర్జెంట్లు కలిపిననీళ్లలో నానబెట్టి ఉతికి ఎండలో ఆరేయాలి.
No comments:
Post a Comment