Friday 23 December 2011

A HEALTHY MEAL - NIN HYDERABAD

ఏం తినాలి?ఎంత తినాలి? ఏం తిన కూడదు?ఎందుకు తిన కూడదు? ఊబకాయులంటే ఎవరు?ఆ జాబితా లో చెరకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఇలాంటి ఎన్నో సందేహాలకు జాతీయ పోషకాహార సంస్థ తాజా నియమావళి జవాబు చెబుతోంది .భారతీయుల ఆరోగ్యానికి సంబంధించి ఇది రాజ్యాంగం లాంటిదే..
పౌష్టికాహారం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి యువకులకు ఇ న్ని కేలరీలు అవసరం  అయితాయనో వృద్ధులకు ఇన్ని కేలరీలు అవసరం అనో నిపుణులు బల్ల గుద్ది చెబుతుంటారు . తీరా చూస్తే అవి అంతర్జాతీయ అధ్యయనాలు.. ఏ అమెరికన్ జర్నల్స్ నుండో తీసుకుని ఉంటారు.. ఇది ఎంత వరకు సమంజసం?దేశాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి శరీర తత్వాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి.. పోషక అవసరాలు మారతాయి..అమెరికన్లు అమెరికన్లే..భారతీయులు భారతీయులే..ఎవరికోసమో తయారు చేసిన పోషక విలువల జాబితా. మనకెలా సరిపోతుంది..మనకంటూ ఓ నియమావళి అవసరం..దాన్ని తయారు చేసే బాధ్యత జాతీయ పోషకాహార సంస్థ తీసుకుంది .తాజా పరిశోధనల వివరాలు జోడిస్తూ సమ కాలీన జీవన శైలి ప్రభావాల్ని ఉటంకిస్తూ దశాబ్దానికి ఒక సారి సరికొత్త నియమావళిని రూపొందిస్తుంది ఆ సంస్థ..ఎలా 12 ఏళ్ల తర్వాత వెలువడిందే ఇది..ఇంకో 10 ఏళ్ల దాకా ఈ అంకెలే భారత పోషకాహార వ్యవస్థ కు మార్గ నిర్దేశం చేస్తాయి. సంక్షేమ కార్యక్రమాల రూప కల్పన కు ఆధారం అవుతాయి . తాజా నియమావళి లో సలహాలు ఉన్నాయి.. హెచ్చరిక లు ఉన్నాయి.. ముందు జాగ్రత్తలు ఉన్నాయి.. నవజాత శిశువులనుండి వయోధికుల దాకా అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు చేసింది ఎన్ ఐ ఎన్..బరువు దించుకొండి.. భారతీయుల్లో 30 నుండి 50 శాతం అధిక బరువు తో బాధ పడుతున్నారు.. ఊబకాయం రోగాల పుట్ట.. దీర్ఘ కాలం లో మధు మేహం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు కాలేయ సమస్యలు, గుండె జబ్బులు తదితర సమస్యల కు దారతీస్తుంది.. కొన్ని రకాల మానసిక రుగ్మతల కూ కారణ మవుతుంది . నానాటికీ పెరిగిపోతున్న ఊబకాయ సమస్య పై జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది . అలా అని కృత్రిమ పద్ధతుల్లో బరువు దించుకోవలన్న తొందర పాటు మంచిది కాదని సలహా ఇస్తోంది . దాని వల్ల నష్టాలే ఎక్కువని హెచ్చరిస్తోంది.ఊబకాయాన్ని నియంత్రించ డానికి కొన్ని సూచనలు చేస్తోంది .

ముందుగా ప్రతి చిన్న పనికీ యాంత్రిక శక్తి పై ఆధార పడటం మానేయాలి..బట్టలు ఉతుక్కోవడం,పుస్తకాలు సర్దుకోవడం బూజు దులపడం,మెట్లు ఎక్కడం,రిమోట్ వాడకుండా ఛానెళ్లు మర్చడంవంటి పనులు కొంత మేర అదనపు కేలరీల ను కరిగిస్తాయి.. రోజూ ఓ గంట సేపు ఏదో ఒక వ్యాయామం తప్పని సరి.. ఆహారం విషయం లో నూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. పిరుదుల చుట్టూ పేరుకు పోయేకొవ్వు సాధారణంగా మహిళల్లో,..కంటే పొట్ట చుట్టూ తిష్ట వేసే కొవ్వు సాధారణంగా పురుషుల్లో . ఎక్కువ ప్రమాద కరమని అధ్యయనాలు చెబుతున్నాయి..

భారతీయ బీ ఎం ఐ.. ఒక వ్యక్తి ఎంత బరువు ఉంటే ఊబ కాయుల జాబితా లో ఉన్నట్లు? ఈ విషయాన్ని లెక్క కట్ట డానికి బాడీ మాస్ ఇండెక్స్ ఒక సూచిక....బరువు కిలోలలో/ఎత్తు స్క్వేర్ మీటర్ల లో బీ ఎం ఐ 18.5 కంటే తక్కువ ఉంటే పోషక విలువలు లోపం తో ఇబ్బంది పడుతున్నట్లు .25 నుంచి 30 మధ్య ఉంటే అవసరానికి మించి బరువు ఉన్నట్లు..39 దాటితే ఊబకాయుల జాబితా లో చేరినట్లు..21-22 ఆదర్శ వంత మైన బి ఎం ఐ.. ఇవన్నీ పాశ్చాత్యుల లెక్కలే.. మరీ పొట్టి మరీ పొడుగు కాని భారతీయుల శరీరాకృతి ప్రకారం.. బి ఎం ఐ 23 లేదా అంత కంటే ఎక్కువ ఉంటే అధిక బరువు కూ 27 లేదా అంత కంటే ఎక్కువ ఉంటే ఊబకాయానికి సూచిక గా తీసుకో వచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి..అని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది .

సేంద్రియ పంటల పై సందేహాలు..

సేంద్రియ పంటలు మార్కెట్ ను ముంచెత్తు తున్నాయి.. అసలే నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితులు సేంద్రియ దుకాణాల్లో అయితే ఆ ధరలు రెట్టింపు
అంత ధర పెట్టి సేంద్రియ పదార్థాలు కొనాల్సిన అవసరం ఉందా? సేంద్రియ మైనా కాకపోయినా ఆహార పదార్థాల పోషక విలువల్లో ఎక్కువ తేడా ఉండదు, వండే ముందు శుభ్రంగా ఉప్పునీళ్ళతో కడిగితే క్రిమిసంహారకాల అవశేషాలు 80% దాకా పోతాయి ఉడికించినప్పుడు వేయించినప్పుడు ఇంకొన్ని కూడా నశించి పోతాయి అని భరోసా ఇస్తోంది జాతీయ పోషకాహార సంస్థ నియమావళి

మనం కొన్నది నిజంగానే సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పదార్థాలే అయితే ఆ కొద్ది శాతం కూడా రసాయనాల ప్రభావం ఉండదు నిజానికి భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను అధికారికంగా నిర్ధారించే సంస్థలు లేవు..

మైక్రోవేవ్ ఒవేన్లు ఓకేనా మైక్రోవేవ్ ఒవేన్లు వాడే విషయంలో సూచనలు చేస్తోంది వాటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు కాకపోతే తిరిగి వేడి చేసుకొని తింటున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి భారీ పరిమాణంలో వేడి చేయడం అసలు మంచిది కాదు అలాంటప్పుడు ఎక్కడో ఓ చోట ఎంతో కొంత ఆహారం చల్లగానే ఉండిపోతుంది హానికరమైన బ్యాక్టీరియా అందులో పోగైపోయి శరీరంలో ప్రవేశించే ప్రమాదం ఉంది ఇలాంటి సమస్య రాకూడదు అంటే మధ్యమధ్యలో బాగా కలపాలి పాక్షికంగా వేడి చేసిన ఆహారాన్ని అసలు తిననే తినకూడదు ఫ్రీజర్ లోంచి తీసిన వెంటనే మైక్రోవేవ్ ఒవేన్ లో పెట్టేయడము మంచిది కాదు అని హెచ్చరిస్తోంది

కాఫీ తాగాలా టీ తాగాలా ఎప్పుడు సందేహమే నిజానికి రెండు అనారోగ్యకరమే భోజనానికి ఓ గంట ముందు భోజనం తర్వాత  ఒక గంట అసలు పుచ్చుకోకూడదు ఎందుకంటే అవి ఆహారంలోని ఐరన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి కార్బోనేటెడ్ పానీయాలు మంచిది కాదు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి దారితప్పిస్తాయి వాటి బదులుగా పళ్ళ రసాలు మజ్జిగ కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చ  పచ్చిపాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని అభిప్రాయం ఉంది దీనిలో శాస్త్రీయత లేదు పాలను ఓ స్థాయి వరకు మరిగించడం వల్లే వాటిలోని హానికర సూక్ష్మ క్రిములు నాశనం అవుతాయి వేడి చేసుకోకుండా తాగడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే

పళ్లెంలో పోషకాలు.. అన్ని రకాల కూరగాయలు వండుకోవాలి అన్ని రకాల ఆకుకూరలు తినాలి అన్ని రకాల ఫలాలు ఆరగించాలి ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో ఆకుకూరలు 50 గ్రాములు కూరగాయలు 200 గ్రాములు దుంప కూరలు 50 గ్రాములు వీటికి తోడు 100 గ్రాముల తాజా పండ్లు తినాలి గర్భిణులైతే ఇనుము పోలిక్ యాసిడ్ చాలా అవసరం కాబట్టి ఇంకో 50 గ్రాముల ఆకుకూరని అదనంగా తీసుకోవాలి. ఆయా ఋతువుల్లో దొరికే ఏ ఫలాలైనా ఆరోగ్యానికి మంచిదే వాటిలో సూక్ష్మ పోషకాలు అపారంగా ఉంటాయి ఒకే పండులో అన్ని రకాల పోషక విలువలు ఉండవు అందుకే రకరకాల రుచులు ఆస్వాదించాలని జాతీయ పోషకాహార సంస్థ సలహా ఇస్తోంది

మరిన్ని పిండి పదార్థాలు.. జాతీయ పోషకాహార సంస్థ 12 ఏళ్ల నాటి నివేదికలో మనిషికి 150 గ్రాముల కూరగాయలు సరిపోతాయని చెప్పింది ఇన్నేళ్లలో పోషక అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయి అందుకేనేమో ఆ పరిమాణాన్ని రెట్టించింది ప్రస్తుత పరిస్థితుల్లో 300 గ్రాముల కూరగాయలు తినాల్సిందే వెండి పదార్థాల విషయంలోనూ పోషకాహార సంస్థ సిఫారసులో తేడాలు వచ్చాయి ఇడ్లీ ఉప్మా తోషి అన్నం పప్పు తదితరాల్లో పిండి పదార్థాలు దొరుకుతాయి మనం తీసుకున్న కేలరీలో 50 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు అన్నది తాజా సూచన గత నివేదికలో 60 నుంచి 70 శాతం ఉండాలని సిఫార్సు చేసింద
 పిండి పదార్థాలు రోజుకు శరీరం రోజువారి పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి గతంతో పోలిస్తే మనుషుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది ఫలితంగా కార్బోహైడ్రేట్ల అవసరము తగ్గినట్లు భావించాల్సి ఉంటుంది

ఇంకాస్త ప్రొటీన్...  ఆహారంలో మాంసకృత్తులు / ప్రోటీన్స్ పరిమాణం 12 నుంచి 15% ఉండాలన్నది ( పాత నివేదికతో పోలిస్తే మూడు శాతం ఎక్కువ) తాజా సూచన ప్రోటియోస్ అన్న గ్రీకు పదం నుంచి ప్రోటీన్ పుట్టింది.. ప్రధాన మైనది  అని ఆ  మాటకు అర్థం .. ప్రోటీన్ సార్ధక నామధేయురాలు   ..ఇది శరీరాన్ని రక్షించే పదార్థాన్ని తయారు చేస్తుంది..



No comments:

Post a Comment