వాతప్రకోపంతో-నడకకోల్పోతున్న సమస్య
మా అమ్మ వయస్సు 40 సం||, మేము పుట్టినపుడు అమ్మకు సిజేరియన్ శస్త్రచికిత్స జరిగిందంట. దాని
ప్రభావంతో క్రమక్రమంగా అమ్మ శరీరంలో రక్తం తగ్గిపోయి, నీరు చేరిపోయి, వాతం పేరుకుపోయి నరాలు బలహీనపడి చివరకు ఒంటరిగా
| నడవలేకపోతుంది. కూర్చుంటే లేవలేదు. లేస్తే కూర్చోలేదు. అమ్మను కాపాడుకునే మంచి మార్గం చెప్పండి.
ఇలాంటి అతి జటిలమైన వాత సమస్యలకు కూడా ఎవరి
ప్రాంతంలోనే వారు సరియైన ఆహారౌషధాలు చేసుకునే మార్గాలు గతంలో ఎన్నో చెప్పి ఉన్నాం.
మీరు వాటిని వినకుండా, తయారు చేసుకోకుండా ఆసుపత్రుల చుట్టూ పరిభ్రమిస్తూ అమ్మను
| మంచానపడవేసే స్థితికి తెచ్చారు. ఇప్పటికైనా తల్లిపట్ల బాధ్యత తీసుకొని చెప్పినట్లుగా
ఆచరించండి,
మీ ప్రాంతంలో విరివిగా దొరికే ముదురు వావిలిచెట్టును చూసుకొని, పూజీచేసి నైవేద్యం
పెట్టి ఉత్తరం వైపున తవ్వి ఆవైపుండే వేరు పైన బెరడును కొడవలితో చెక్కి అరకేజి మోతాదుగా
తీసుకోవాలి. తరువాత ఆవు పేడను తోలుతీసిన వేరు పైన దట్టంగా పూసి మట్టికప్పి, నీరుపోసి
మరలా చెట్టుకు నమస్కరించి రావాలి. ఆ వేరుబెరడును కడిగి, ఎండబెట్టి, దంచి, జల్లించి నిలు
వచేసుకోవాలి. రోజూ ఉదయం పరగడపున రాత్రి నిద్రించేముందు పూటకు మూడు నుండి
| అయిదుగ్రాముల మోతాదుగా మంచినీటితో ఆహారానికి గంట ముందుగానీ, గంట తర్వాతగానీ
సేవిస్తూ వాతపదార్థాలను నిషేదించాలి. ఈ విధంగా నలభై నుండి అరవైరోజులపాటు ఆచరిస్తే
ఆమెకు శరీరంలో నీరు
వాతం తగ్గి, రక్తం పట్టి తిరిగి చక్కగా నడవగలుగుతుంది.
తుమ్మి ఆకుల రసంలో ఉప్పు నూరి
పూస్తే గజ్జి, చిడుము తగ్గిపోతయ్
రోజుకు అయిదారుసార్లు - అతిమూత్ర సమస్య
నా వయసు 32 సం||, నేను పగటిపూట 10-15సార్లు,
రాత్రిపూట 5-6 సార్లు మూత్రానికి పోవలసి వస్తుంది. ఇక్కడ వైద్యులకు చూపించి ఎన్ని ఔషధాలు వాడినా
ఆ సమస్య తీరడం లేదు. దయతో మార్గం చెప్పండి..
ఈ అతిమూత్రసమస్యకు బోలెడన్ని సులువైన సొంత ఇంటి
ఆహారమార్గాలు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీరు శ్రద్ధతో వినకపోతే ఇలాగే వ్యాధులలో
బాధపడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా శ్రద్ధ పెట్టండి.
ఆయుర్వేద మూలికలు అమ్మే అంగడిలో 'నాగకేసరాలు' అనే గింజలు దొరుకుతయ్. వాటిని
| తెచ్చుకొని మెత్తగా దంచి,
జల్లించి గాజుసీసాలో నిలువ చేసుకోండి. రెండుపూటలా అరచెంచా
| నుండి ఒక టీచెంచా వరకు ఈ చూర్ణాన్ని అరగ్లాసు పలుచని మజ్జిగలో కలిపి సేవించండి.
| మూడునాలుగు వారాలలో మీ సమస్య పరిష్కారo
స్థనాలలో గడ్డలు - పుట్టిన సమస్య
నా వయస్సు 31 సం||, నాకు గత తొమ్మిది మాసాలుగా స్థనాలలో గద్దలు వచ్చినయ్. ఇంగ్లీషు మందులు,
మరెన్నో రకాల ఇతర ఔషధాలు వాడినా కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు గడ్డలు పెద్దవై వాపు, నొప్పి, మంట విపరీతంగా వస్తున్నయ్.
జ్వరం కూడా వస్తుంది. భవిష్యత్తులో ఇది క్యాన్సర్ గా మారుతుందేమోనని భయమేస్తుంది. దయతో ఇంట్లో చేసుకోదగిన మంచి మార్గం చెప్పి
ఈ బాధనుండి నన్ను కాపాడండి.
గతంలో నీవు వాడి వదలివేసిన కలబందగుజ్జు 30
గ్రా, పసుపు పావుటీచెంచా, జిలకర్రపొడి పావుచెంచా, తిప్పతీగపాడి పావుచెంచా,
కండచెక్కరపొడి ఒకచెంచా, మంచినీళ్ళు అరకప్పు కలిపి చెంచాతో గిలకొట్టి
మరలా సేవించడం ప్రారంభించు. రెండు లేదా మూడు నెలల వరకు విడువకుండా
ఉదయంపూట వాడుకో.
అదేవిధంగా నిద్రించే ముందు కలబందగుజ్జు, వేపాకుగుజ్జు, ఇంట్లో కొట్టుకున్న
| పసుపు కలిపి మెత్తగా నూరి గోరువెచ్చగా వేడిచేసి గడ్డల పైన దట్టంగా పట్టువేసి పైన
| దూది అంటించి ఊడిపోకుండా ప్లాస్టర్ వేసుకొని ఉదయంపూట తీసివేస్తుండాలి.
అంతేగాక సాయంత్రంపూట రెండునుండి నాలుగుచెంచాల గోఆర్కం అరకప్పు
| నీటితో కలిపి సేవించు. రాత్రి నిద్రించే ముందు త్రిఫలచూర్ణం ఒక టీ చెంచా
మోతాదుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతూ ఉండు. ఇలా ప్రయత్నిస్తే నీ సమస్య క్రమంగా పరిష్కారమౌతుంది.
శుభం.
No comments:
Post a Comment