Friday 30 December 2011

DR.ELCHURI RECIPES WITH CHINTHA CHETTU ( TAMARIND TREE )

ఆయుర్మాత పుత్రులారా! చింతచెట్టులేని ఊరులేదు. చింతచెట్టు పోగొట్టలేని రోగము లేదు. చింత అంటే
విచారము, దు:ఖము లేకరోగము అనే అర్థంలో అలాంటి చింతలను పోగొట్టేశక్తి ఈ చెట్టులో వుంది కాబట్టే
మన పెద్దలు దీనికి చింతచెట్టు అని నామకరణం చేశారు. చింతచిగురుతో, చింతపువ్వుతో, చింతపండుతో
చింతాకుతో వివిధరకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని నిలువచేసుకొని వాడుకొనే సంప్రదాయ
ఆహారపద్ధతులు మన తెలుగునాట బహుళ ప్రచారంలో వుండేవి. దురదృష్టవశాత్తు ఆధునిక యుగారంభంతో
ఆరోగ్యసంప్రదాయాలు మరుగునపడిపోవడంతో ఆ అమూల్యమైన దేశీయ ఆహారవిజ్ఞానాన్ని మనం
కోల్పోయాం. మరలా ఆ విజ్ఞానాన్ని వెలికితీసి అందరికి పంచిపెడదాం....

చింతచెట్టు - పేర్లు
సంస్కృతంలో తింత్రిణీ, వృక్షామ్ల, ఫలామ్లక,
అని, హిందీలో ఇట్లే అని, తెలుగులో చింతచెట్టు
అని, లాటిన్లో Tamarindus Indica ఆంగ్లంలో The
Tamarind tree అంటారు.
చింతచెట్టు - రూప గుణ ప్రభావాలు
దీని లేతకాయలు వగరు, పులుపు రుచులతోను,
ముదిరిన కాయలు పుల్లగానువుంటయ్. బాగా పండిన
తరువాత పులుపు తీపి కలిసి వుంటయ్. ఇవి వేడిచేసే
గుణంతో వాతరోగాలను పోగొడతయ్. అయితే, కొత్త
చింతపండును అతిగా వాడితే రక్తదోషమేర్పడుతుంది.
కడుపులో ఉబ్బరం పుడుతుంది. అందువల్ల ఎప్పుడు
పాతచింతపండునే వాడాలి.

విరిగిన ఎముకల - బాధ తగ్గుటకు
నువ్వులనూనెలో చింతపండు అతిమెత్తని ఎర్ర
మట్టి కలిపి ఆమిశ్రమాన్ని వేడిచేసి బట్టలోవేసి ఆ
ముద్ద తో కావడం పెడుతూవుంటే ఎముకల
నొప్పి త్వరగా తగ్గిపోతుందని భావమిశ్రపండితులు
చెప్పారు.
పురుషుల - వీర్య నష్టమునకు
చింతగింజలను వేయించి నానబెట్టి పై పొట్టుతీసి
పప్పును ఎండబెట్టి మెత్తగా పొడిచేసి జల్లించి నిలువ
వుంచుకోవాలి. ఈ పొడి ఒక చెంచా మోతాదుగా
కప్పు వేడిపాలతో కలుపుకొని రెండుపూటలా సేవి
స్తూంటే వీర్యవృద్ధి, వీర్యస్తంభన కలుగుతయ్.
తేలువిషం - విరిగిపోవుటకు
చింతగింజను నీటితో అరగదీసి ఆ గంధాన్ని
దట్టంగా తేలుకుట్టినచోట పట్టిస్తే అది ఆరేటప్పటికి
విషం దిగిపోతుంది.

telugu - chintha chettu
english - the tamarind tree
hindi - imli
sanskrit - thinthrini, vrukshamla,phalamlaka

1 . VAAPULU THAGGUTAKU ( FOR SWELLINGS )

chintha aku
amudam leda neyyi

akunu nalaga gotti amudamthogani,neyyitho gani doraga veyinchi battalo vesi goruvechaga kapadam pettali

uses - vaapulu thaggipothayi.

2 . ATHI MOOTHRA ROGAM THAGGUTAKU ( FOR EXCESSIVE URINATION )

chintha aku rasam - 30 gm
gede majjiga - 1/2 cup

pai vatini kalipi rojoo rendu pootala sevinchali.

uses - 40 rojullo athi moothra vyadhi thaggipothundi,meha rogalu kooda adupuloki vasthayi.

3 . VEERYA VRUDDHI , VEERYA STHAMBHANA KORAKU ( FOR SEMEN IMPROVEMENT AND PENIS STRENGTH )

chintha ginjala podi - 1 spoon
palu - 1 cup

chintha ginjalanu veyinchi nanabetti pai pottu theesi ,pappunu yenda betti mettaga podi chesi jallinchi niluva vunchukovali.1 spoon podi 1 cup vedi palalo kalipi rendupootala sevisthundali

uses - veerya vruddhi, veerya sthambhana kaluguthayi.

4 . KAMERLU THAGGUTAKU ( FOR JAUNDICE )

chintha aku rasam - 1 ounce

chintha akunu danchi rasam theesi , rojoo paragadupuna oka mothaduga 3 rojula patu thagali.chappidi pathyam patinchali.

uses - kamerlu thaggipothayi.

5 . VIRIGINA YEMUKALA NOPPI THAGGUTAKU ( FOR PAINS OF BROKEN BONES )

nuvvula noone
chintha pandu
mettani yerra matti

pai vatini kalipi ,koddiga vedi chesi ,battalo vesi , kapadam pettali.

uses - yemukala noppi thvaraga thaggipothundi.

6 . RECIPE FOR BODY SWELLINGS

వాపులు తగ్గడానికి

చింతాకు
ఆముదం లేదా నెయ్యి

ఆకును నలగగొట్టి ఆముదం లేదా నెయ్యి తో గాని దోరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెడుతుంటే వాపులు తగ్గిపోతాయని హరీత మహర్షి నిర్ధారించారు.

7 . RECIPE FOR SMALL POX

మశూచికం తగ్గడానికి

చింతాకు రసం
మంచిపసుపు

పై రెండింటిని కలిపి 1 , 2 చెంచాలు , రోజూ రెండు పూటలా సేవిస్తుంటే మశూచికం తగ్గిపోతుంది

8 . RECIPE FOR TASTE LESS NESS OF TOUNGE

అరుచి తగ్గడానికి

చింతపండు
కొద్దిగా బెల్లం
కొద్దిగా దాల్చిన చెక్కపొడి
కొద్ది  ఏలకుల పొడి
కొద్దిగా మిరియాల పొడి

పై అన్నింటిని కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బుగ్గన పెట్టుకొని చప్పరించి రసం మింగుతుంటే నోటి అరుచి తగ్గిపోయి బాగా ఆకలి పుడుతుంది.

ఉదరములోపాములు - ఉరికివచ్చుటకు

చింతపండు, రేలచిగుర్లు సమంగా కలిపి మెత్తగా
నూరి రేగిపండంత మాత్రలుచేసి ఆరబెట్టి నిలువ
చేసుకోవాలి. రోజూ రాత్రినిద్రించేముందు పిల్లలకు
ఒకమాత్ర పెద్దలకు రెండు మాత్రలు చప్పరించి
తింటూవుంటే ఉదయం లేవగానే సుఖవిరేచనమై దాని
ద్వారా
ఏలికపాములు పడిపోతయ్.

తామరవ్యాధిని - తరిమికొట్టుటకు

చింతగింజలను నిమ్మకాయ రసంతో అరగదీసి ఆ
గంధాన్ని తామర పైన పట్టిస్తూవుంటే నాలుగైదు
రోజుల్లో తామరవ్యాధిని తమరికొడుతుంది.

కుష్ఠు పుండ్లు - ఖతం ఖతం

చింతబెరడును కాల్చి జల్లించిన బూడిద, సూరే
కారంపొడి సమంగా కలిపి ఆమొత్తంలో సగభాగం
వంతు రాతిసున్నంపొడి కలిపివుంచుకొని రోజూ
తగినంత పొడిని నీటితో నూరి కుష్టుపుండ్లపైన లేపనం
చేస్తూవుంటే ఆపుండ్లు అతిత్వరగా మానిపోతయ్.

వడదెబ్బనుండి - రక్షణ పొందుటకు

నీటిలో చింతపండును బాగా పిసికివడపోసి
తగినంత పంచదార కలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు
పూటలు తాగుతూవుంటే వడదెబ్బవలన కలిగిన
నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో
రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో
తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

అజీర్ణం హరించి - ఆరోగ్యం కలుగుటకు

చింతపండు 20గ్రా||, మంచినీరు 50గ్రా కలిపి
పిసికి వడకట్టి అందులో నల్లుప్పు 3 గ్రాః, మిరియాల
పొడి 1 గ్రా||, పుదీనా ఆకులు 40 కలిపి తాగుతుంటే
అరుచి అజీర్ణం హరించిపోతయ్. *

వాంతులు,
డోకులు - హరించుటకు

గింజలు తీసిన చింతపండును మెత్తగా నూరి శనగ
గింజలంత మాత్రలుచేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
పూటకు రెండుమూడు మాత్రలు బుగ్గన పెట్టుకొని
రెండుపూటలా చప్పరిస్తుంటే వాంతులు ఆగిపోతయ్.

అతిమూత్రం - అంతమైపోవుటకు

చింతాకురసం 30|1, అరకప్పు గేదెమజ్జిగతో
కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే 40 రోజుల్లో
అతిమూత్రం అంతమైపోతుంది. దానితోపాటు
మేహరోగాలు కూడా అదుపులోకి వస్తయ్.

ప్రతి ఇంటా -చింతపూల కారంపొడి

చింతపూవులను ఎక్కువగా తెచ్చుకొని గాలికి
ఆరబెట్టి ఎండిన తరువాత శుభ్రమైన కుండలో నిలువ
చేసుకోవాలి. నెలకు ఒకసారి తగినంత పువ్వును తీసి
దంచి పొడిచేసి సమంగా కరివేపాకు పొడి కలిపి
మిగతా జిలకర ధనియాలవంటి దినుసులు చేర్చి
కారంపొడి తయారుచేసుకోవాలి. ఇది చాలా రుచిగా
సకల రోగాలకు పథ్యంగావుండి జీవితంలో ఎప్పుడూ
కాలేయ (లివర్)రోగాలు రాకుండా కాపాడుతుంది.
ప్రతిరోజూ ఆహారంలో వాడుకోవచ్చు.
* ఇదే ఎండిన పూవ్వులను ప్రతిరోజూ
కూరలలో చింతపండుకు బదులుగా పులుపుకోసం
ఉపయోగించుకొంటూ వుంటే ఇక ఆయింట్లో
వ్యాధులు రానేరావు. ఎందుకంటే దీనివల్ల ఎల్లప్పుడు
లివర్ బాగుంటుంది కాబట్టి, అది బాగుంటే శరీర
మంతా బాగుంటుంది.

చింతాకుతో - కామెర్లు ఖతం

శుభ్రమైన చింతాకును తెచ్చి దంచి రసం తీసి వడ
పోసి ఒక ఔన్సు మోతాదుగా పరగడుపున మాత్రమే
రోజుకు ఒకసారి ఇవ్వాలి. ఇలా మూడు రోజులు ఇస్తూ
చప్పిడిపథ్యం పాటిస్తే కామెర్లు కనిపించకుండా
పోతయ్.

దురదలు, వ్రణాలు-దూరం దూరం

చింతగింజలను నీటితో సానపైన అరగదీసి ఆ
గంధాన్ని పైన పట్టిస్తూవుంటే భయంకరమైన మంట
లతో పోట్లతో బాధపెట్టే వ్రణాలుగానీ, దురదలుగానీ
దూరంగా పారిపోతయ్..

No comments:

Post a Comment