Saturday 31 December 2011

DR . ELCHURI RECIPES WITH ATHIBALA CHETTU ( MALLOW TREE )

ఆయుర్వేద అభిమాన పాఠకులారా! మనరాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో కనిపించే
చెట్టు అతిబల. దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు వుండరు. అమితమైన బలాన్ని అందించేశ
ఇందులో వుంది. కాబట్టే దీనికి అతిబల అని పేరు వచ్చింది. ప్రాచీనకాలంలో కూడా
రామాయణంలోను భారతంలోను ఆ తరువాత కాలాలలో కూడా ఈ అతిబల మొక్క ప్రశంస
చాలాచోట్ల కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనది.
ఇలాంటి అసాధారణమైన ఔషధ శక్తిగల ఓషధులు గ్రామ గ్రామానవుండి కూడా వాటి గురించి
తెలుసుకోలేక ఉపయోగించుకోలేక మన భారత జాతి బలహీనమైపోతుందంటే ఇది ఎంత
దురదృష్టమో ఆలోచించండి. ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు ప్రజలందరికి తెలియజేసి
అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము.

అతిబల- పేర్లు
సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని,
తెలుగులో ముద్రబెండ, తుత్తురుబెండ, దువ్వెనకాయల
చెట్టు, అతిబల అని, లాటిన్లో Mallya Rotondifolia
ఆంగ్లంలో Mallow Tree అంటారు.

అతిబల- రూప గుణ ధర్మాలు

తుత్తురుబెండ ఆకులు మృదువుగా జిగట కలిగి
మేహశాంతిని కలుగజేస్తయ్. శరీరంలోని సకల
మలినాలను బయటికి తోసివేసి శుద్ధి చేస్తయ్,
గడ్డలను ప్రణాలను మెత్తపరచి పక్వంచేసి మాన్పి
వేస్తయ్. ఇంకా అనేకయోగాలు తెలుసుకుందాం.

మూత్రంలో మంట, రాళ్ళు వుంటే ?

తుత్తురుబెండ నాలుగైదు ఆకులు నలిపి పావు
లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి
చల్లార్చి ఒకచెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా
తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్ళు
కరిగి మూత్రం ద్వారా పడిపోతయ్



నేthra doshalaku
- ఆకుకషాయం

పైన చెప్పినట్లు కషాయంచేసి చల్లార్చి ఆ కషా
యాన్ని మూసినకండ్ల పైన కడుగుతూవుంటే కంటే
దోషాలు హరించి కంటిచూపు పెరుగుతుంది.

జ్వర తీవ్రతలో - అతిబల

అతిబలాకులను నీటిలో నానబెట్టి వడపోని
అందులో కొద్దిగా కండచక్కెర కలిపి కొద్ది కొద్దిగా
తాగుతూవుంటే వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది.
* ఇదేనీరు మూడుపూటలా సేవిస్తుంటే
మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు
దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతయ్.

పిచ్చికుక్కవిషానికి - అతిబల

పిచ్చికుక్కకరచిన వెంటనే అతిబల ఆకులరసం,
70 గ్రా|| మోతాదుగా తాగించాలి. ఆకుముద్దను
కాటు పైనవేసి కట్టుకట్టాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి
పోతుంది.

శీఘ్రస్కలనానికి -అతిబల

తుత్తురుబెండ గింజలు 50గ్రా||,శతావరి వేర్ల పొడి
100గ్రా||, ఆ రెండింటికి సమంగా పటిక బెల్లంపొడి
కలిపి నిలువవుంచుకోవాలి. రోజు రెండుపూటలా
ఒక చెంచా పొడి చప్పరించి తిని ఒక కప్పుపాలు
తాగుతూవుంటే శీఘ్రస్కలనం మాయమైపోయి వీర్యం
గట్టిపడి యౌవనం పెరుగుతుంది.

పైత్యపు -గుండెదడకు

అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో
నూరి బట్టలో వడపోసి ఆరసంలో చక్కెర కలిపి
తాగుతూవుంటే అధిక వేడివల్ల కలిగిన గుండెదడ
తీవ్రంగా హరించిపోతుంది.

నడుమునొప్పికి - నాణ్యమైన మార్గం

పైన తెలిపినట్లు అతిబల ఆకులతో కాచిన
కషాయం రెండుపూటలా తాగుతూ ఆకులను నలగొట్టి
వేడిచేసి నొప్పుల పైనవేసి కట్టుకడుతూ వుంటే
కేవలం నడుమునొప్పేకాక ఎక్కడి నొప్పులైనా తగ్గి
పోతయ్.

మొలలకు - అతిబల ఆకుకూర

అతిబల ఆకులను కూరలాగా వండి రెండు పూటలా
తింటుంటే మొలలనుండి కారేరకం ఆగిపోతుంది.

స్త్రీల - స్తనాలవాపుకు

అతిబలవేరును నిలువచేసుకొని రోజూ రెండు
పూటలా కొంచెం నీటితో సానరాయిపైన ఆవేరును
అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూవుంటే
రొమ్ములవాపు తగ్గిపోతుంది.
అలాగే కండరాల వాపు పైనకూడా పట్టిస్తూవుంటే
ఆవాపు తగ్గుతుంది.

దగ్గు, ఉబ్బసం - హరించిపోవుటకు

బాగా ముదిరిన అతిబల చెట్టును సమూలంగా
పెకలించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో
ఎండబెట్టాలి. తరువాత దాన్ని కాల్చి బూడిదగా
చేయాలి. ఆ బూడిదను ఒకకుండలో పోసి నిండా
నీరుపోసి మూడు రోజులపాటు వుంచాలి. రోజుకు
ఒకసారికర్రతో కలుపుతూవుండాలి.
నాలుగవ రోజున పైకి తేలిన నీటినిమాత్రమే
ఉంచుకొని చిన్నమంట పైన మరిగిస్తే అంతా తెల్లటి
క్షారంగా మిగులుతుంది.
దాన్ని మెత్తగా నూరి నిలువ
చేసుకోవాలి.
ఈ క్షారం రెండుమూడుచిటికెల మోతాదుగా
ఒకచెంచా తేనెతో కలిపి సేవిస్తువుంటే దగ్గు,
ఉబ్బసం హరించిపోతయ్.

మూత్రపిండాల - నొప్పితగ్గుటకు

అతిబల ఆకులను 50గ్రా|| తీసుకొని మెత్తగా
నూరి చిన్నచిన్న బిళ్ళలుగా తయారుచేయాలి.
తరువాత ఆవునెయ్యి 50గ్రా|| పాత్రలోపోసి పొయ్యి
మీద పెట్టి నెయ్యి మరుగుతుండగా ఈ బిళ్ళలను
అందులో వేయాలి. బిళ్ళలన్నీ వేగేవరకువుంచి దించి
వడపోసి వాటిని నిలువచేసుకోవాలి. రోజూ
రెండుపూటలా ఒకటి లేక రెండు చెంచాల మోతాదుగా
వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గి
పోతుంది.

నులిపురుగులు హరించుటకు

అతిబలగింజలను నిప్పులపై నవేసి ఆ పొగను
పిల్లల గుదస్థానమునకు తగిలేటట్లుగా చేస్తే దాని
ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించి పోతయ్.

మొలలకు - అతిబలగోలీలు

అతిబల ఆకులు ఇరవైఒకటి, అలాగే మిరియాలు
ఇరవైఒకటి తీసుకొని మొత్తం మెత్తగా నూరి ఏడు
గోలీలు చేయాలి. రోజు ఒకగోలీ చొప్పున ఏడు
రోజులు పరగడుపున ఒకగోలీని మంచినీటితో సేవి
స్తుంటే వాతదోషంవలన కలిగిన మొలలు హరించి
పోతయ్.

గుండెబలానికి - ముఖకాంతికి

అతిబలవేర్లను దంచి పొడిచేసి జల్లించి నిలువ
వుంచుకోవాలి. ఈ పొడిని మూడునాలుగు చిటికెల
మోతాదుగా ఆవునెయ్యితో కలిపి రెండుపూటలా
ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గుండెకు
బలంకలగడమేకాక ముఖంకూడా కాంతివంతంగా
మారుతుంది. *



telugu - athibala chettu ,mudra benda ,thuthurubenda ,duvvena kayala chettu
english - mallow tree
hindi - kangi
sanskrit - athibala


1 . MOOTHRAM LO RALLU ,MANTA THAGGADANIKI ( FOR URINE BURN ,AND STONES )

athibala akulu - 5
neeru - 1/4 litre
patika bellam - 1 spoon

akulu nalipi ,neetilo vesi saganiki maraga betti vadaposi ,challarchi 1 spoon patikabellam kalipi moodu pootala thaguthundali.

uses - mothram lo manta thaggipoyi ,rallu karigi moothram dvara padipothayi.

2 . KANTI DOSHALU THAGGUTAKU ( FOR EYE PROBLEMS )


athibala akulu - 5
manchi neeru - 1/4 litre

akulu nalipi , neetilovesi ,saganiki mariginchi ,vadaposi ,challarchi ,moosina kalla paina kaduguthoo vundali.

uses - kanti doshalu harinchi kanti choopu peruguthundi.

3 . JVARA THEEVRATHALO (  DURING FEVER  , URINE BURN ,SWELLING OF URINARY BLADDER ,LONG LASTING COUGH )

athibala akulu
neeru
patika bellam


akulanu neetilo nanabetti vadaposi ,koddiga patikabellam kalipi koddi koddiga thaguthoo vundali.

uses - vedi thaggi jvaram shanthisthundi.ide neeru moodu pootala sevisthunte moothramlo manta ,churuku ,moothrashaya vaapu,deergha kalika daggulu kooda thaggipothayi.


4. PAITHYAPU GUNDE DADAKU ( FOR HEART PROBLEM )

athibala akulu - 7
manchineeru

akulanu neetitho noori ,battalo vadaposi ,aa rasamlo chakkera kalipi thaguthundali.

uses - adhika vedi valla kaligina gunde dada thaggipothundi.

5 . NADUMU NOPPI THAGGADANIKI ( FOR  LUMBAGO )



athibala akulu - 7
manchineeru


akulanu neetitho noori ,battalo vadaposi ,aa rasamlo chakkera kalipi, rendu pootala thaguthoo ,akulanu nalaga gotti vedi chesi ,noppulapaina vesi kattu kaduthoo vundali.

uses - nadumunoppule kakunda yekkadi noppulaina thaggipothayi.