' ప్రియమిత్రులారా! గుంటగలగర మొక్కలు తెలియనివారు ఇంతకుముందు ఒక్కరు కూడా ఉండేవారు కాదు. కానీ ప్రస్తుతం ఈ మొక్కలు కండ్ల ముందే కనిపించినా గుర్తు పట్టలేని వారే ఎక్కువమంది వున్నారు. నీటి తడి ఉండే చోట వరిచేనుల గట్ల పైన,చెరువుల ఒడ్డున విస్తారంగా పెరిగే మొక్క గుంటగలగర. చూడడానికి ఇది చాలా చిన్నదిగా కనిపించినా దీని ప్రయోజనాలు వర్ణనాతీతం. ఇది వందల ఏళ్ల ఆయువును అందించగల రసాయనమని దీనిని సేవించి తమ వయస్సును పెంచుకున్న ఎందరో సాధువులు తమ అనుభవాలను వ్రాశారు. పూర్వకాలం మన పెద్దలు ఈ గుంటగలగర గొప్ప తనం తెలుసుకొని దీన్ని కేవలం తల వెంట్రుకల దృఢత్వం కోసం మాత్రమేకాక, పచ్చడిగా, బెషధంగా కూడా తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. మన ఆయుర్వేద గ్రంథాల్లో గుంటగలగర ప్రయోజనాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని గ్రామీణులకు ,పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆ జ్ఞానాన్ని అందించాలి.
గుంటగలగర = రూప గుణ ప్రభావాలు
ఈ మొక్కల్లో తెలుపు, పసుపు, నలుపు, నీలి రంగుల పూలు పూసే వివిధ రకాలున్నయ్. ఏ జాతి మొక్క ఆకునైనా కొద్దిసేపు వేళ్లతో నలిపితే ఆ రసం ఆరి పోగానే వేళ్ళన్ని నల్లగా మారిపోతయ్. ఇది శ్లేష్మ, మేహ, నేత్ర, దంత, చర్మ ,శిరోవ్యాధులను పోగొడుతుంది. దీని సేవనము వల్ల వెంట్రుకలు శాశ్వతంగా నల్ల బడతయ్.
తలనొప్పికి గుంటగలగర
గుంటగలగర ఆకు రసం తలకు పూసినా గానీ, లేక మూడు చుక్కలు ముక్కుల్లో వేసుకున్నా గానీ తలనొప్పి తణమే తగ్గిపోతుంది.
గొంతు రోగాలకు గుంటగలగర..
నాటు ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకొని అందులో గుంటగలగర ఆకులు 10 గ్రాములు తీసుకొని కొద్దిసేపు మరిగించి వడపోసి ఆ నీటిని మూడు పూటలా కొద్దికొద్దిగా నోటిలో వేసుకొని మింగుతూ ఉంటే గొంతు శుభ్రపడి బొంగురు పోవడం తగ్గి మంచి కంట స్వరం కలుగుతుంది.
పొట్ట రోగాలకు - గుంట గలగర
గుంటగలగరాకులు 10 గ్రాములు తీసుకొని అందులో రెండు గ్రాముల ఉప్పు కలిపి మెత్తగా నూరి గోలీలు చేసి మింగుతూ ఉంటే మలబద్ధకం వల్ల వచ్చిన కడుపు నొప్పి ఎంతో కాలం నుండి వేధిస్తున్న పాత కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది.
రోజు గుంటగలగర సేవిస్తుంటే..
గుంటగలగర మొక్కలను సమూలంగా తెచ్చి కడిగి, నీడలో ఎండించి ,దంచి ,జల్లించి నిలువ ఉంచుకోవాలి. ఈ పొడిని రోజూ 3 వేళ్ళకు వచ్చినంత నోటిలో వేసుకొని నీరు తాగుతూ ఉంటే క్రమంగా దృష్టి శక్తి పెరుగుతుంది. అమితమైన వీర్యం పుడుతుంది. రక్త శుద్ధి జరిగి చర్మవ్యాధులు హరించి పోతాయి. ముఖ్యంగా లివర్, ప్లీహాలను రోగగ్రస్తం కాకుండా కాపాడటంలో ఈ మొక్కది అందవేసిన చేయి.
తేలుకాటుకు గుంటగలగర..
తేలు కుట్టిన వెంటనే గుంటగలగర ఆకును నూరి పుట్టిన చోట రసం పిండి ఆ ముద్దను పైన వేసి కట్టు కడితే వెంటనే విషం విరిగిపోతుంది.
మానవజాతి - మరువకూడని మహా భృంగరాజ -రసాయనం పుష్యమీనక్షత్రం ఆదివారం వచ్చిన రోజున గుంటగలగరమొక్కలకు హృదయపూర్వకంగానమస్కరించి
పూజచేసి కావలసినన్ని మొక్కలను వేళ్ళతోసహా తీసు
కొచ్చికడిగి ముక్కలుచేసి నీడలో గాలి తగిలేచోట
ఆరబెట్టి దంచి పలుచని నూలుబట్టలో వస్త్రఘాళితం
చేయాలి. ఈ చూర్ణాన్ని వెడల్పాటి గాజు లేక పింగాణి
గిన్నెలోపోసి ఆచూర్ణం మునిగేవరకు పచ్చిగుంటగలర
మొక్కల సమూలనిజరసం (నీళ్ళు కలపకుండా తీసి
నది) పోసి కలిపి రాత్రి నానబెట్టి మరునాడు పగ
లంతా ఎండించాలి. మళ్ళీ రాత్రిపూట గుంటగలగర
రసంపోసి తరువాత రోజు ఎండించాలి. ఈ విధంగా
21సార్లు భావన చేసిన తరువాత మరలా మెత్తగా నూరి
జల్లించాలి. ఈ పొడి 80గ్రా, ఉసిరికకాయపొడి
40గ్రా, తానికాయల పొడి20 గ్రా, కరకపిందెల పొడి
10గ్రా. కలపాలి. ఈ మొత్తం చూర్ణానికి సమంగా
కండ చెక్కర, తగినంత ప్రశస్తమైన బాదంనూనె, కలిపి
మెత్తగా దంచి ముద్ద చేసి నిలువ చేసుకోవాలి.
దీనిని రెండుపూటలా 5గ్రా. మోతాదుగా తింటూ
పాలు సేవిస్తుంటే క్రమంగా తెల్ల వెంట్రుకలన్నీ పూర్తిగా
నల్లబడటమేగాక అపారమైన రక్తశుద్ధికలిగి దేహ
కాంతి, దారుధ్యము, దీర్ఘయౌవనం, చిరాయువు, ప్రాప్తి
స్తయ్. *
కండ్లకు గుంటగలగర కాటుక..
శుభ్రమైన తెల్లని నూలుబట్టను గుంటగలగర సమూల రసంలో ముంచి కొద్దిగా పిండి ఎండించాలి మళ్లీ రసంలో ముంచి మళ్లీ ఎండించాలి ఇలా ఏడుసార్లు చేసి ఆ గుడ్డను నాలుగు ముక్కలుగా కత్తిరించి వత్తులుగా చేయాలి. గాజు సీసా మూతకు రంధ్రం పెట్టి ఆ రంద్రం గుండా ఈ వత్తిని దూర్చిఅందులో నువ్వుల నూనె గాని ,ఆవు నెయ్యి గాని పోసి వెలిగించాలి. పైన దీపం మసి తగిలేటట్లుగా మంటపైన రాగి పాత్రను బోర్లించాలి. క్రమంగా పాత్ర పైన నల్లగా ఒక పదార్థం పేరుకుంటుంది. తర్వాత పాత్రను తీసి తాటాకుతో మసిని గీకి కాటుక భరణి లోనికి నింపాలి. అందులో తగినంత ఆవు నెయ్యి, చిటికెడు పచ్చ కర్పూరము కలిపి ,కరిగించి నిలువ ఉంచుకోవాలి. ఇదే అపురూపమైన గుంటగలగర కాటుక. ఈ కాటుకను రోజూ రాత్రి నిద్రించే ముందు పెసర బద్దంత కంటిలో పెట్టుకుంటూ ఉంటే క్రమంగా కంటి పొరలు ,శుక్లాలు, మసకలు వాటి నేత్ర వ్యాధులు హరించిపోయి చూపు నిర్మలమవుతుంది.
నోటి రోగాలకు గుంటగలగర
గుంటగలగర ఆకు రసములో సగం నీరు కలిపి నోటిలో పోసుకొని రెండు పూటలా పుక్కిలిస్తూ ఉంటే నోటి పూత, నోటిలో పుండ్లు, దంతాల నొప్పులు, చిగుళ్ళు పగలడం వంటి నోటి వ్యాధులు హరించిపోతాయి.
telugu - గుంటగలగర , కాటుక ఆకు
english - thistles
hindi - భాంగ్రా
సంస్కృతంలో - భృంగరాజ్, కేశ రాజా,కుంతల వర్ధన ,భృంగ
english - thistles
hindi - భాంగ్రా
సంస్కృతంలో - భృంగరాజ్, కేశ రాజా,కుంతల వర్ధన ,భృంగ
Latin లో ఎక్లిప్టా ప్రోస్ట్రేటా
1 . ముక్కు రోగాలు తగ్గుటకు ( FOR RUNNING NOSE , RHINITIS,HEAT ,BAD ODOUR OF THE NOSE )
గుంటగలగర ఆకు రసం - 3, 4 చుక్కలు
1 . ముక్కు రోగాలు తగ్గుటకు ( FOR RUNNING NOSE , RHINITIS,HEAT ,BAD ODOUR OF THE NOSE )
గుంటగలగర ఆకు రసం - 3, 4 చుక్కలు
ఆకు రసాన్ని ముక్కులో వేసి పీలుస్తుండాలి.
uses - ముక్కులోపలి దుర్వాసన, ముక్కువెంటకారే నీరు, ముక్కులోని వేడి, తుమ్ములు తగ్గి పోతాయి.
2 . శరీరం పై గ్రంథులు తగ్గుటకు ( FOR STRONG CISTS ON THE SKIN )
గుంటగలగర ఆకులు మరియు నెయ్యి
ఆకులను నెయ్యిలో ఉడికించి గ్రంధుల పైన వేసి కట్టు కట్టాలి.
uses - గ్రంథులు కరిగిపోతాయి.
3 . తెల్ల పొడలకు ,ఎర్ర పొడలకు ( FOR WHITE AND RED TYPE SKIN DISEASES )
గుంటగలగర ఆకు
uses - ముక్కులోపలి దుర్వాసన, ముక్కువెంటకారే నీరు, ముక్కులోని వేడి, తుమ్ములు తగ్గి పోతాయి.
2 . శరీరం పై గ్రంథులు తగ్గుటకు ( FOR STRONG CISTS ON THE SKIN )
గుంటగలగర ఆకులు మరియు నెయ్యి
ఆకులను నెయ్యిలో ఉడికించి గ్రంధుల పైన వేసి కట్టు కట్టాలి.
uses - గ్రంథులు కరిగిపోతాయి.
3 . తెల్ల పొడలకు ,ఎర్ర పొడలకు ( FOR WHITE AND RED TYPE SKIN DISEASES )
గుంటగలగర ఆకు
ఆకులను మెత్తగా నూరి పైన లేపనం చేయాలి.
uses - తెల్ల పొడలు, ఎర్ర పొడలు మాయమైపోతాయి.
4 . బోదకాలు తగ్గడానికి ( FOR FILARIA )
గుంటగలగర సమూల రసం - 20 gm
నువ్వుల నూనె - 20 gm
పై వాటిని కలిపి బోదకాలు పై రుద్దుతూ ఉండాలి.
uses - బోద వాపులు తగ్గిపోయి రోగం కుదురుతుంది.
5 . వెంట్రుకలు పొడవుగా పెరగడానికి ( FOR LONG HAIR GROWTH )
గుంటగలగర ఆకులు - 1 bhagam
అతిమధురం పొడి - 1 bhagam
పై రెండింటినీ కలిపి మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి ఎండిన తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి.
uses - వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.
uses - తెల్ల పొడలు, ఎర్ర పొడలు మాయమైపోతాయి.
4 . బోదకాలు తగ్గడానికి ( FOR FILARIA )
గుంటగలగర సమూల రసం - 20 gm
నువ్వుల నూనె - 20 gm
పై వాటిని కలిపి బోదకాలు పై రుద్దుతూ ఉండాలి.
uses - బోద వాపులు తగ్గిపోయి రోగం కుదురుతుంది.
5 . వెంట్రుకలు పొడవుగా పెరగడానికి ( FOR LONG HAIR GROWTH )
గుంటగలగర ఆకులు - 1 bhagam
అతిమధురం పొడి - 1 bhagam
పై రెండింటినీ కలిపి మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి ఎండిన తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి.
uses - వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.
