Thursday, 29 December 2011

DR.ELCHURI RECIPES WITH నీరుగొబ్బి చెట్టు / NEERU GOBBI CHETTU ( HYGROPHILA )



telugu - neeru gobbi chettu
english - hygrophila
hindi - talimkhana
sanskrit - kokilaksha

1 . VEERYA VRUDHI KORAKU ( FOR SEMEN IMPROVEMENT )

gobbi ginjalu - 1 bhagam
doola gondi ginjalu - 1 bhagam
avu palu
patikabellam podi


pai rendu rakala ginjalanu pathralo posi , avi munigevaraku avu palu posi chinna manta paina palu igirevaraku mariginchi dinchi ,yendabetti,mettaga danchi ,aa mottam podi tho samananga patikabellam podi kalipi niluva vunchukovali.rojoo rendu pootala 1 spoon podi goruvechani palatho kalipi sevinchali.

uses - yeppatikee tharaganantha akshayamaina veeryam vrudhi chenduthundi.

2 . BAGUGA NIDRA PATTUTAKU ( FOR INSOMNIA )

gobbi veru

gobbi verunu madupaina vunchi ,voodipokunda battatho kattukoni padukovali.

uses - hayiga nidra paduthundi.

3 . VATHA RAKTHA ROGANIKI ( FOR WOUNDS ,BOILS ON THE SKIN DUE TO VATHA BLOOD ,AND LEPROCY WOUNDS )

gobbi akulu
gobbi akula rasam - 10 gm

gobbi akulatho koora vandukuni rojoo thinali. akulanu kadigi danchi theesina rasam vudayam paragadupuna 10 gm mothaduga sevinchali.

uses - vatha raktham tho shareeramantha nallani pokkulatho ,pundlatho yerpadina charma rogalu ,kushtu pundlu harinchipothayi.

4 . STHREELA YONI DRUDHATHVANIKI ( FOR TIGHTNESS ,STIFFNESS OF VEGINA )

neerugobbi ginjalu
manchi neeru

ginjalanu manchineetitho athi mettaga noori , gandhanni yoniki lepanam chesukovali.

uses - krushinchina yoni kooda thirigi drudhanga maruthundi.

5 . MOOTHRA AVAYAVALLO PUTTINA RALLAKU ( FOR STONES IN THE URINARY ORGANS )

gobbi chettu verlu - 1 bhagam
palleru verlu - 1 bhagam
amudapu verlu - 1 bhagam

pai vatini vidividiga churnalu chesukoni ,annintinee kalipi niluva vunchukovali. 1/2 spoon mishrama churnanni 1/2 cup vedi palalo kalipi rendu pootala thaguthundali.

uses - moothravayavallo puttina rallu khachithanga karigipothayi.

నీరుగొబ్బి చెట్టు రూప గుణాలు -

వీటికి వాడి గల ముండ్లుంటాయి.కణుపు కణూపులో బంతివలె ముళ్ళతో కూడి ఉంటుంది.నలుపు లేదా తెలుపు రంగు పూలతో ,గింజలతో రెండు జాతులు లభ్యమౌతున్నాయి.ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి.తెల్లపూల మొక్క శ్రేష్టమైనదని పెద్దల ఉవాచ.ఈ చెట్లు తీపి రుచితో చలువ చేసే స్వభావంతో పైత్య రోగాలను,కఫరోగాలను,అతిసారాన్ని పోగొడతాయి.శరీరానికి అమిత బలాన్ని కలిగించి అంతులేని వీర్యవృద్ధినిస్తాయి.ఉబ్బురోగాలను హరిస్తాయి.వాతరక్తమనే భయంకర రోగాన్ని తగ్గిస్తాయి.ముఖ్యంగా దీని గింజలను ఎక్కువగా వాడే సంప్రదాయముంది.ఇవి ఎక్కువ తీయగా కొంచెం వగరుగా ఉండి అపారమైన వీర్యవృద్ధిని కలిగ్ఫిస్తాయి.అతిత్వరగా స్త్రీలకు గర్భాన్ని కలిగించే శక్తిని పురుషులకు కలిగిస్తాయి.

గొబ్బి గింజలతో వీర్యవృద్ధి -

గొబ్బి గింజలు,దూలగొండి గింజలు సమభాగాలుగా పాత్రలో పోసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి చిన్న మంటపై పాలు ఇగిరే వరకు మరిగించి దించి ఎండబెట్టి మెత్తగా దంచి ఆ మొత్తం పొడితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి.రోజూ రెండు పూటలా ఒక చెంచా పొడి గోరువెచ్చని పాలతో సేవిస్తుంటే ఎప్పటికీ తరగంత వీర్యం వృద్ధి చెందుతుంది.

మూత్రావయవాల్లో పుట్టిన రాళ్ళకు -

గొబ్బి చెట్టు వేర్లు , పల్లేరు వేర్లు ,ఆముదపు వేర్లు విడి విడిగా చూర్ణాలు చేసుకొని సమంగా కలిపి ఉంచాలి.రెండు పూటలా అరచెంచా మోతాదు చూర్ణాన్ని అరకప్పు వేడి పాలలో కలిపి తాగుతుంటే రాళ్ళు కరిగిపోతాయి.

నిద్ర పట్టకపోతే -

గొబ్బి వేరును మాడుపైన ఉనంచి ఊడిపోకుండా బట్టతో కట్టుకుని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.

సుఖ ప్రసవానికి -

గొబ్బి వేరును కొంచెం చక్కెరతో కలిపి నోటిలో వేసుకొని బాగా వేసుకొని ఆ రసాన్ని స్త్రీల చెవిలో 5,6 చుక్కలు వేస్తే సుఖ ప్రసవమౌతుంది.

వాతరక్త రోగం తగ్గడానికి - గొబ్బి ఆకులతో కూర వండుకొని రోజూ తినాలి.ఆకులను కడిగి దంచి తీసిన రసం ఉదయం పరగడుపున 10 గ్రాముల మోతాదుగా సేవించాలి.
వాతరక్తంతో నల్లని పొక్కులతో పుండ్లతో ఏర్పడిన చర్మరోగాలు,కుష్టుపుండ్లు తగ్గిపోతాయి.

స్త్రీల యోని దృఢత్వానికి - నీరుగొబ్బి గింజలను మంచినీటితో అతిమెత్తగా నూరి ఆ గంధాన్ని యోనికి లేపనం చేసుకొంటుంటే కృశించిన యోని కూడా తిరిగి దృఢంగా మారుతుంది.

అధిక ఋతురక్తస్రావం తగ్గడానికి - గింజలను దంచి జల్లించి నిలువ చేసుకోవాలి.రోజూ ఉదయం పరగడుపున 2 గ్రాముల పొడిని ఒక కప్పు కుండలోని నీటితో సేవిస్తుంటే సమస్య తగ్గుతుంది.

వీర్య స్థంభనకు - పుష్యమి నక్షత్రం రోజున పూజ చేసి తెల్లగొబ్బి చెట్టు నుంచి గింజలు సేకరించాలి.వాటిని ఎర్రటి గుడ్డలో చిన్నమూటగా కట్టి ఎర్రటి దారంతో పురుషుడు తన మొలకు / నడుముకు కట్టుకుని ఆ తర్వాత సంభోగంలో పాల్గొంటే వీర్యం పతనం కాదు.

మగతనానికి మదన కామేశ్వర చూర్ణం - నీరుగొబ్బి గింజలు,ఏనుగు పల్లేరు కాయలు పెద్ద దూలగొండి విత్తనాలు నేలతాడి దుంపలు,శతావరి వేర్లు,బూరుగు బంక సమభాగాలుగా తీసుకుని అన్నింటిని పాత్రలో వేసి మునిగేవరకు ఆవు పాలు పోసి పాలు ఇగిరేవరకు చిన్న మంటపైన మరిగించి ఎండబెట్టాలి.ఎండిన తర్వాత మరలా పాత్రలో పోసి మరలా పాలు పోసి మరిగించాలి.ఇలా 7 సార్లు చేయాలి.దీనిని దంచి జల్లించి సమానంగా కండచక్కెర పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి.ఇదే మదన కామేశ్వరి చూర్ణం.

రోజూ 2 పూటలా 1  లేదా 2 చెంచాల చూర్ణం ,అరచెంచా ఆవునెయ్యి ,ఒక చెంచా తేనె కలిపి తిని ఒక కప్పు వేడి పాలు తాగుతుంటే శారీరకబకం,మానసిక ఉల్లాసం,వీర్య స్థంభన కలుగుతాయి.

పాండురోగానికి -

నీరుగొబ్బి చెట్టును సమూలనంగా 100 గ్రాములు తీసుకుని 400 గ్రాముల నీటిలో వేసి నాలుగవ వంతువరకు మరిగించి వడపోసి ఆ కషాయాన్ని రెండు భాగాలుగా ఉదయం సగం ,సాయంత్రం సగం తాగుతుంటే రెండు మూడు వారాలలో పాండురోగం / రక్త హీనత హరిస్తుంది.



No comments:

Post a Comment