2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఏ వ్యాధి కలవారు.. ఏ ఔషధాలు వాడవచ్చు.

 వాత వ్యాధులకు..

 1. మహా రాస్నాది కషాయం లేక గోక్షూరాది గుటికలు. 2. అర్కాది తైలం . 3. త్రిఫల కల్పం. 4. అశ్వగంధ ఘృతం ( తీపిలేకుండా )+ శిలాజిత్ వాడుకోవాలి.

గ్యాస్ మొదలగు ఉదర వ్యాధులకు..

1. త్రిఫలా కల్పం 2. హింగ్వాష్టకం 3 . ఆర్ద్రక ఖండం వాడుకోవాలి.

దగ్గు, ఆస్తమా మొదలగు కఫ రోగాలకు..

1. సీతో ఫలాది చూర్ణం 2. తులసి మాత్రలు.3.త్రిఫల రసాయనం ( తేనెతో రాత్రి ) . 4. తులసి టీ.  5. భృగు హరీతకి ( నిర్మలీ) వాడుకోవాలి.

తెల్ల లేక ఎర్ర బొల్లి మచ్చల కు..

1. ఖదీరాది కషాయం 2. సుగంధ పాల లేహ్యం. 3. స్వర్ణ తైలం( గోల్డ్ ఆయిల్). 4. శ్విత్ర అధర లేపనం. 5. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ వ్యాధులకు..

1. మంజిష్టాది కషాయం .2. సుగంధ పాల లేహ్యం.3. సింధూరాది తైలం. 4. త్రిఫల కల్పం.5. ఖాదీరాది కషాయం.6. కామధేను అర్కం వాడుకోవాలి.

చర్మం పై పైత్య దురదలు ,దద్దుర్లకు..

 1. ఆర్ద్రక ఖండం.2. త్రిఫల రసాయనం. 3. గోక్షూరాది అవలేహ్యం . 4. సింధూరాది తైలం వాడుకోవాలి. 

వెంట్రుకల సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. కేశామృతం 3. భృంగరాజ తైలం. 4. త్రిఫల కల్ప జలం. 5. కేశ వృధ్ధి లేపనం. 

కంటి సమస్యలకు..

1. పునర్నవాది కషాయం  2. త్రిఫల రసాయనం( ఆవు నెయ్యి, తేనెతో ) వాడుకోవాలి . 

చెవి సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. అపామార్గ తైలం. 3. అశ్వగంధ ఘృతం. 4. షడ్బిందు తైలం. 

ముక్కు సమస్యలు తగ్గడానికి ..

1. తులసి మాత్రలు. 2. షడ్బిందు తైలం లేక వేప నూనె. 3. త్రిఫల రసాయనం ( తేనె తో)  4. అమృత ధార వాడుకోవాలి . 

లివర్ సమస్యకు..

1. పునర్నవాది కషాయం. 2. ఆర్ద్రక ఖండము. 3. త్రిఫల రసాయనం వాడుకోవాలి . 

హృదయ సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. హింగ్వాష్టకం . 3. అర్జునాది వటి వాడుకోవాలి.

 మధు మేహ వ్యాధికి.. 

1. త్రిఫల కల్పం. 2. అశ్వగంధ ఘృతం ( తీపి లేకుండా) + శిలజిత్. 3. మధు సంహారిణి లేదా మధురిహా చూర్ణం వాడుకోవాలి. 

మూత్ర పిండాలలో రాళ్లకు..

1. గోక్షూరాది కషాయం. 2. త్రిఫల కల్పం.  3. భృగు హరితకి లేహ్యం. 

శీఘ్ర స్ఖలనము - నపుంసకత్వం..

1. ఖర్జూరాది చూర్ణం. 2.  శతావరీ పాకం. 3.  వాసరీ గుటికలు. 4. అశ్వగంధ+ శిలాజిత్. 5. త్రిఫల రసాయనం. 6. అశ్వగంధ తైలం. 

దంత సమస్యలకు..

1. కణాది చూర్ణం ( పండ్ల పొడి ) .2. త్రిఫల కల్ప జలం. 3. అశ్వగంధ ఘృతం వాడుకోవాలి.

గొంతు సమస్యలకు - థైరాయిడ్ కు.

1. త్రిఫల రసాయనం ( తేనెతో ) .2. తులసి మాత్రలు. 3. అమలకాది చూర్ణం ( గళ రోగ హర ) వాడుకోవాలి.

ఆకలి లేని పిల్లలకు,పెద్దలకు ..

1. ఆర్ద్రక ఖండము. 2. త్రిఫల రసాయనం. 3. హింగ్వాష్టకం వాడుకోవాలి.

అర్శమొలలకు ( పైల్స్ కు ) ..

1. సూరణ వటుకములు. 2. త్రిఫల కల్పం ( మజ్జిగతో ) . 3. హింగ్వాష్టకం వాడుకోవాలి.

అండ వృద్ధి,వృషణాల వాపు, హెర్నియా..

1. మహా రాస్నాది కషాయం. 2. అండ వృద్ధి మాత్రలు. 3. త్రిఫల కల్పం. 4. అర్కాది తైలం వాడుకోవాలి.

పిల్లలు,పెద్దల జ్ఞాపక శక్తి కి..

1. సారస్వత చూర్ణం. 2. భృంగరాజ తైలం. 3. ఆర్ద్రక ఖండము. 4. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

మానసిక వికలాంగులకు..

1. అజామోదాది చూర్ణం. 2. సారస్వతి చూర్ణం . 3. భృంగ రాజ తైలం. 4. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

స్త్రీల బట్టంటు వ్యాధులకు..

1. ఇంద్ర యవాది చూర్ణం. 2. శతావరీ పాకం. 3. కుమారీ రసాయనం. 4. గోక్షూరాది కషాయం . 5. త్రిఫల కల్ప జలం ( డూషింగ్) వాడుకోవాలి .

స్త్రీల అతి రుతు రక్త స్రావానికి..

1. శాతావరీ రసాయనం. 2. కుమారీ రసాయనం. 3. అశ్వగంధ ఘృతం. 4. గోక్షూరాది కషాయం వాడుకోవాలి.

స్త్రీ పురుషుల అధిక రక్తపోటుకు ( హై బీపీ కి )..

1. అమృతాది చూర్ణం. 2.  త్రిఫల కల్పం. 3. గోక్షూరాది కషాయం వాడుకోవాలి.

స్త్రీ పురుషుల అల్ప రక్త పోటుకు ( లో బీపీ కి )..

1. త్రిఫల రసాయనం . 2. సుగంధ లేహ్యం. 3.  శతావరీ పాకం . 4. అశ్వగంధ ఘృతం + శిలాజిత్ వాడుకోవాలి.

స్త్రీల గర్భాశయ సమస్యలకు..

1. కుమారీ రసాయనం. 2.  శతావరీ పాకం. 3.  త్రిఫల రసాయనం. 4. అశ్వగంధ ఘృతం + శిలాజిత్ వాడుకోవాలి.

అతి మూత్ర సమస్య కలవారికి..

1. త్రిఫల రసాయనం. 2. గోక్షూరాది కషాయం . 3. భృగు హరీతకి లేహ్యం వాడుకోవాలి.

సంతానం లేని స్త్రీలకు..

1. శతావరీ పాకం. 2. అశ్వగంధ ఘృతం. 3.  నాగ కేసర. 4. గోక్షుర వాడుకోవాలి.

ముఖ సౌందర్యానికి..

1. ముఖ కాంతి లేపనం ( ఫేస్ ప్యాక్ ). 2. సుగంధ లేహ్యం. 3. కుంకుమాది తైలం. 4.  త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ సౌందర్యానికి..

1. శరీర దుర్గంధ హర చూర్ణం ( బాత్ పౌడర్ ) . 2. సుగంధ లేహ్యం. 3. త్రిఫల రసాయనం వాడుకోవాలి. 

పాదాల పగుళ్ళకు..

1. సుగంధ లేహ్యం. 2. మదనాది లేపనం. 3.  గోక్షూరాది కషాయం. 4.  త్రిఫల రసాయనం వాడుకోవాలి. 

అతి కొవ్వు ( ఒబెసిటీ ) హరించుటకు ..

1. త్రిఫలాది చూర్ణం . 2. త్రిఫలాద్య తైలం. 3. పునర్నవాది కషాయం .4. గోక్షూరాది కషాయం వాడుకోవాలి. 

ఏ సమస్యా లేని వారికి సమస్య రాకుండా..

1. త్రిఫల కల్పం. 2.  పునర్నవ కషాయం 3.  అశ్వగంధ వాడుకోవాలి. 

ఏ వ్యాధి కలవారైనా ఆహార వేదం లాంటి ఆయుర్వేద గ్రంథాలు చదివి ఆహార,విహార ,వ్యవహారాలు పాటించాలి.

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఫిట్స్, చెవి దగ్గర కాయ, మూత్రంలో మంట.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. ఫిట్స్ సమస్య .. ఆయుర్వేద పరిష్కారాలు 


నల్ల నువ్వులు దోరగా వేయించి దంచి జల్లించి చేసిన పొడి 100 గ్రాములు , వెల్లుల్లి దంచి తీసిన రసం 100 గ్రాములు .. ఈ రెండింటిని కలిపి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరి బఠాణీ గింజంత గోళీలు కట్టి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి పూర్తిగా నీరు ఇంకిపోయిన తర్వాత ఆ గోళీలను ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండు లేక మూడు పూటలా ఒక మాత్ర మంచి నీటితో సేవిస్తుంటే క్రమంగా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఐతే ఫిట్స్ వచ్చిన వెంటనే సీతా ఫలం ఆకు మెత్తగా నలగ్గొట్టి వాసన చూపిస్తే క్షణ మాత్రంలోనే తెలివి వస్తుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఫిట్స్ సమస్య నుండి బయట పడవచ్చు. 

2 . చెవి కుట్టిన చోట కాయ పెరిగిన సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఇంట్లో కొట్టుకున్న మంచి పసుపు ఒక చెంచా తీసుకొని సగం ముద్ద వేడి అన్నం పసుపుతో కలిపి మెత్తగా పిసికి ఆ కాయ మీద పెట్టి ఊడిపోకుండా దాని పైన దూది పెట్టి ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ రాత్రి పూట పెట్టి ఉదయం తీసివేస్తుండాలి. కొద్ది రోజులకు కాయ పెరగడం ఆగి నిదానంగా తగ్గడం మొదలవుతుంది.

3 . మూత్రంలో మంట సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

మూలికలు అమ్మే దుకాణంలో నేల వేము, నేల ఉసిరి , సుగంధ పాల వేళ్ళు, గుంట గలగర , తిప్ప తీగ ఒక్కొక్కటి 200 గ్రాముల చొప్పున తెచ్చుకోవాలి.వీటిని విడి విడిగా పొడి చేసి కలిపి ఉంచుకోవాలి. రోజూ రెండు గ్లాసుల నీటిలో రెండు చెంచాల పొడి వేసి రెండు కప్పుల కషాయానికి మరిగించి వడపోసి పూటకు ఒక కప్పు కషాయం గోరు వెచ్చగా మాత్రమే ఒక చెంచా తేనె కలిపి తాగుతుండాలి. దీని వల్ల మూత్రంలో మంట,చురుకు మొదలైన సమస్యలు తగ్గిపోయి మూత్రం పూర్తిగా శుద్ధి చెందుతుంది. దాంతో పాటు రక్తం కూడా శుద్ధి చెందుతుంది.

శరీరానికి మంచి కాంతి, వర్చస్సు సిద్ధిస్తుంది.

 



జలుబు, దంతాల సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 దీర్ఘ కాలికంగా జలుబు, పిల్లి కూతలతో ఆయాసం. . ఆయుర్వేద పరిష్కారాలు.

ఉత్తరేణి చెట్లు, వాకుడు చెట్లు,అడ్డసరం ఆకులు కాడలు సమ భాగాలుగా తెచ్చుకోవాలి . అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కడిగి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఆ ముక్కలను శుభ్రమైన రాతి మీద పోసి నిప్పు అంటించి బూడిదగా చేయాలి. దానిని జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు లేదా మూడు పూటలా ఒక చెంచా పొడిని ఒక చెంచా తేనె తో కలిపి నిదానంగా సేవిస్తుండాలి. ఎంత కాలంనుండి ఉన్న ఆయాసమైనా, ఆస్తమా అయినా , పిల్లి కూతలైనా తప్పకుండా తగ్గిపోతాయి. 

దంతాలు కదలడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

బాగా ముదిరి ఉన్న ఉత్తరేణి చెట్టును చూసుకుని పూజ చేసి సమస్యను మనసులోనే తెలిపి ఆ చెట్టును పీకి దాని వేళ్ళను ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి చూపుడు వేలంత ముక్కలుగా తయారు చేసుకొని ఆరబెట్టాలి. రోజూ ఒక ముక్కతో నిదానంగా మృదువుగా  దంతాలను అన్ని వైపులా తోముతుండాలి. తోమిన తర్వాత అరగంట ఆగి గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా చేస్తుంటే క్రమంగా దంతాలు తెల్లబడి , దృఢంగా జీవిత కాలమంతా కళకళలాడుతుంటాయి. 

కళ్ళు, గర్భ సంచి సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 కనురెప్పల్లో చీము గడ్డల సమస్య.. 

తలలో అధికమైన అనవసరమైన కఫం చేరడం వల్ల ఈ సమస్య కలుగుతుంది.

1. ) ముందుగా అధికంగా కఫం పెంచే పదార్థాలను ఆహారంలో తీసుకోవద్దు. 2. ) త్రిఫలాల ముక్కలు ఒక్కొక్కటి పది ముక్కల చొప్పున మొత్తం 30 ముక్కలు ఒక గ్లాసు వేడి నీటిలో రాత్రి వేసి ఉదయం వరకు ఉంచి వడపోసుకోవాలి. ఆ నీటిని ఉదయం పూట కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని మూసిన కన్నులపైన తడపాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట చేయాలి. 3. ) ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక చెంచా పసుపు వేసి అర గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి నూలు బట్ట నాలుగు మడతలు వేసి ఆ కషాయంలో ముంచి నీళ్ళు కారకుండా కొంచెం పిండి ఆ తడి బట్టను గోరు వెచ్చగా ఉన్నప్పుడు మూసిన కన్నులపైన వేసుకుని పది లేక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఆచరించాలి. 4.) పలుచగా ఉన్న ప్రశస్తమైన వేప నూనె రెండు ముక్కుల్లో రెండు రెండు చుక్కలు రెండు పూటలా ఆహారానికి అరగంట ముందుగా వేస్తుండాలి. 

గర్భ సంచి మందంగా మారిన సమస్య..

1.) కలబంద గుజ్జు ఆపకుండా మూడు నెలల వరకు సాయంత్రం పూట సేవించాలి. 2.) అశోక చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా మేడి చెట్టు వీటిలో ఏదో ఒక చెట్టుకు పూజ చేసి మాను మీద ఉండే బెరడు 2,3 కేజీలు తీసుకోవాలి. తీసిన చోట మాను మీద దట్టంగా ఆవు పేడ పూసి రావాలి. ఆ బెరడును 50 గ్రాములు తూకం ఉండే విధంగా ముక్కలు కొట్టి కడిగి ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక ముక్క వేసి ఒక రోజు నానబెట్టి చిన్న మంట పైన ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి ఆ ముక్కను తీసివేసి , ఆ కషాయంలో ఒక చెంచా కండ చక్కెర పొడి కలిపి గోరు వెచ్చగా పరగడుపున తాగాలి. 3.) వేపాకు పావు కేజీ, మంచి పసుపు 20 గ్రాములు, కలబంద గుజ్జు 100 గ్రాములు , తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి ముద్దలాగా చేసి వెల్లకిలా పడుకుని ఆ ముద్దను పొత్తి కడుపు పైన పట్టులాగా వేసి పలుచని బట్ట పైన వేసి ఆ గాలి తగలకుండా దుప్పటి కప్పుకుని అర గంట వరకు ఉంచి తీసివేయాలి. ఇలాగే రేగడి మట్టితో కూడా రెండవ పూట పట్టు వేసుకోవచ్చు. 4. ) పావు చెంచా మిరియాల పొడి , అర చెంచా ఉసిరి కాయల పొడి , ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో వేసి ఆహారానికి ఒక గంట ముందు కానీ తర్వాత కానీ సేవించాలి. 5.) కపాల భాతి ప్రాణాయామం , పశ్చిమోత్తాసనం, వక్రాసనం, పవన ముక్తాసనం , భుజంగాసనం , శలభాసనం రోజూ రెండు పూటలా పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఆచరించాలి. ఇలా చేస్తుంటే సర్జరీతో అవసరం లేకుండా గర్భ సంచిలో గడ్డలు కరిగి పోతాయి. 

31, ఆగస్టు 2026, సోమవారం

మహాత్ముడు మెచ్చిన.. అవిసె గింజలు

 ఆయుర్దాయం పెరగడంలో ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆయుర్దాయం పెంచుకోవడానికి ఇవాళ ఎన్నో అవకాశాలు, సులువైన ఆరోగ్య విధానాలు, ఆరోగ్య కరమైన ఆహార పద్ధతులు, ఆహార అలవాట్లు, విస్తృత శ్రేణిలో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లకు దూరంగా ఉంటూ , తగిన శారీరక వ్యాయామం చేస్తూ , చక్కటి ఆహార అలవాట్లు పాటిస్తూ , పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల నిత్యం శారీరకంగా ఎంతో చురుకుగా ఉండవచ్చని , ఆహార అలవాట్లు, జీవన శైలి జీవిత కాలాన్ని పెంచడంలో కీలకం కాగలవని పరిశోధకులు అంటున్నారు. 

ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త ఐటమ్స్ తీసుకోదగ్గ ఆహార పదార్థాల జాబితాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖంగా వినబడుతున్న అవిసె గింజలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇవాళ కొత్తగా వినిపిస్తున్నా నిజానికి అవిసె గింజలకు వేన వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. ఆవిసెలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయ గలవని ఇటీవలి పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 

ఎక్కడైతే అవిసె గింజలను ప్రజలు తమ దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటారో అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లివిరుస్తుంది అని మహాత్మా గాంధీ ఏనాడో అన్నారు. నిజమే.. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అవిసె అత్యంత శక్తివంతమైనది. 

భారత దేశంలోని గ్రామాలలో అవిసె గింజలను కీళ్ల నొప్పులు , దగ్గు, జలుబు నయం చేయడానికి పచ్చళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు. స్థానిక పచారీ కొట్టులన్నీ అద్భుతమైన ఈ అవిసె గింజలను నిల్వ చేసుకుంటాయి. మన పూర్వీకులు ఈ అవిసె గింజల తో ఎన్నో రకాలుగా వైద్యం చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు వీటితో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. 

ఈ అవిసె గింజల తో చట్నీలు, చెక్కీలు,పొడులు , లడ్డూలు చేస్తుంటారు. వాటిని తీయగానో, ఉప్పగానో పొడి రూపంలో తినవచ్చు. అవిసె గింజలను స్వల్ప పరిమాణంలో ఉపయోగించినప్పటికీ అవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. ఆవిసెలు జీవక్రియ రేటు ను పెంచి ఆక్సీకరణను చైతన్య పరుస్తాయి. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీని వలన శరీరంలో వేడి పడుతుంది. చలి కాలం, వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గులను నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. 

అవిసె గింజల లో పీచు,ఖనిజాలు , విటమిన్ లతో పాటు మాంస కృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి మాంస కృత్తులు దోహదం చేస్తాయి. పీచు పదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. కొలోన్ ఆరోగ్యాన్ని క్రమ బద్ధం చేస్తాయి. మల బద్ధకం సమస్య తలెత్తదు. అవిసెలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను నివారించడం ద్వారా గుండె రోగాలు, కీళ్ల వాతం, ఉబ్బసం, షుగర్, ఇంకా కొన్ని క్యాన్సర్ల( ప్రత్యేకించి పౌరుష గ్రంధి క్యాన్సర్) నుంచి శరీరాన్ని కాపాడతాయి. 

లైంగిక దుర్భలతతో బాధ పడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల మేలు చేకూరుతుంది. ఈ గింజలలోని ఫోలిక్ యాసిడ్ వ్యంధ్య మహిళలకు తోడ్పడతాయి. అవిసె గింజల లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని క్షాళన చేస్తాయి. రక్తాన్ని శుద్ధి గావిస్తాయి. 

చర్మం, శిరోజాల పరిస్థితిని మెరుగు పరుస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. మామూలు జలుబు, దగ్గులనుంచి రక్షణ ఇస్తాయి. 

ఈ గింజల నుంచి తీసే అవిసె నూనె చుండ్రు, పొడి చర్మం, సూర్య రష్మి వేడిని తట్టుకోలేని సున్నితమైన చర్మాలకు బాగా పనిచేస్తుంది. ఎగ్జిమా లను నయం చేస్తుంది. ఎండ వల్ల చర్మం పేలడం , చెమట కాయలు రావడం లాంటి వాటిని నివారిస్తుంది. 

ఇబ్బందికరమైన రుతుచక్రం నిలిచి పోయే దశలో ఈ గింజలలోని ఫైటో ఈస్ట్రోజన్స్ స్త్రీలకు సహాయపడతాయి. మహిళల్లో రుతు క్రమానికి ముందు తలెత్తే ( పిలిమిలిన్ ) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి. 

ఒక టీ స్పూన్ అవిసె గింజలను చప్పరించడం , నమలడం వలన ఉదర సంబంధిత సమస్యలు రావు. పెప్టిక్ అల్సర్లు నయమవుతాయి. శరీరం ముడతలు పడకుండా వాడే రసాయనిక క్రీములకు బదులుగా అవిసె నూనెను వాడవచ్చు. అవిసెలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని మృదువుగా , ముడతలు లేకుండా ఉంచుతాయి. అన్ని రకాల మైగ్రేన్ నొప్పులకు అవిసె నూనె బాగా పనిచేస్తుంది. ఆస్తమా , ఎలర్జీ లనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

గోళ్లను, గోళ్ళ అందాలను ,ఆరోగ్యాన్ని కాపాడడంలో అవిసె గింజలు ఎంతో ఉపకరిస్తాయి. అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే కొవ్వు ఆమ్లాల పరిమాణం పెంచితే .. గోళ్లు పెళుసు బారడం, చిట్లడం , చిన్న చిన్న ముక్కలుగా విరగడం వంటి సమస్యలు చోటు చేసుకోవు. 

వార్ధక్య లక్షణాలను అరికట్టడం... యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు అవిసెలో మెండుగా ఉంటాయి. ఈ సుగుణాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. 

మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా తలెత్తే హాని కారక ప్రభావాలను అవిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. 

చర్మం పై రంధ్రాలు మూసుకుపోకుండా , చర్మం ఎర్ర భారనీయకుండా నివారించడానికి రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె నూనె తీసుకోవాలి. అవిసె గింజల లోని అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు కుంగుబాటు, వార్ధక్య లక్షణాలను అరికట్టడం లో ఎంతగానో ఉపకరిస్తాయి. 

వంటకాలలో....

ఎన్నో పౌష్టిక విలువలు, అపార ఔషధ సుగుణాలు ఉన్న అవిసె గింజలను ఆకు కూరలు , కాయ గూరలు, చేపలతో పాటు ఆహారంలో చేర్చుకోవాలి. ఏ రూపంలో తీసుకున్నా అవిసె గింజలు ఎన్నో కారణాల దృష్ట్యా ఎంతో విలువైనవి.అవిసెలను చట్నిగా, చెక్కీలుగా,లడ్డూలుగా ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఈ గింజలను బెల్లంతో కలిపి చక్కీలు చేసుకోవచ్చు. సలాడ్స్ పై వీటిని చల్లుకోవచ్చు. ఇవి శక్తిని,ఓపికను మెరుగు పరుస్తాయి.

పండ్ల రసాలు,షేక్స్,ఇతర మృదు పానీయాలలో వాడుకోవచ్చు.అవిసెలను కూరలకు, పానీయాలకు చేర్చడం వలన వాటికి అదనపు రుచి వస్తుంది. ఇంట్లో తయారు చేసిన జున్ను,యోగర్ట్ ఇంకా ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు.

వంటకాల తయారీలో అవిసె గింజల లోని పౌష్టిక విలువలు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవిసె నూనెను మీ వంటకాలలో, ఆహార పదార్థాలలో చేర్చుకోండి. అవిసెల వాడకంతో మీ ఆరోగ్యంలో చోటు చేసుకునే అద్భుత ఫలితాలను ,పరిణామాలను గమనించండి .ఆరోగ్యం,ఆయుర్దాయం పెరిగే ప్రయత్నాన్ని ప్రారంభించండి.


30, ఆగస్టు 2026, ఆదివారం

కాసర కాయలు.. మినీ కాకర కాయలు..

 చూడడానికి చిన్న కాకర కాయల మాదిరిగా కనిపిస్తుంటాయి ఈ కాసర కాయలు. తెలుగు రాష్ట్రాల్లో రాయల సీమ ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇది అడవులు , చేల గట్ల వెంబడి సహజంగా పెరిగే ఒక రకమైన అడవి కూర గాయ. కాకర కాయల మాదిరిగా మహా చేదుగా ఉంటాయి. అందువల్ల నూనెలో బాగా వేయించి , ఉప్పు, కారం చల్లి రాగి సంకటి, జొన్న రొట్టెలతో ఇష్టంగా తింటారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయని , యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయని అనంతపురం ఆర్ట్స్ కళాశాల బోటనీ లెక్చరర్ డాక్టర్ రఘు రాములు చెప్పారు. అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో రూ. 300 పలుకుతున్నాయి. ఇవి మార్కెట్ లో ఎల్లప్పుడూ దొరకవు. వానాకాలంలో మాత్రమే అక్కడక్కడా లభిస్తాయి. 



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...