Thursday 3 December 2015

CHEVI POTU / KARNA SHOOLA - AYURVEDAM

శరీరంలో చెవి చాలా సున్నితమైన
భాగం కావడం వల్ల అనేక సమస్యలు
వస్తాయి. ఎక్కువగా చెవిలో ఇన్ఫెక్షన్
వచ్చినప్పుడు చెవిపోటు వస్తుంది. ఇది
వచ్చినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా
ఉంటుంది. అయితే సాధారణంగా ఇది
చిన్న పిల్లలకు వస్తుంటుంది. ఇది
వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుంది.
కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే
వైద్యం చేయించకపోతే చెవుడు కూడా వచ్చే
అవకాశం ఉంటుంది.
ఎక్కువ సేపు నీటిలో నానడం, ఈత
కొట్టడం, దాని వల్ల చెవిలోకి నీరు పోవడం,
మనిసి
నీటిలో బాక్టీరియా ఉండి ఇన్ ఫెక్షన్ రావడం,
జలుబు, ఒత్తిడి, సరైన ఆహారాన్ని తీసుకోక
పోవడం మున్నగు వాటి వల్ల చెవిపోటు
వస్తుంది.
తులసి రసాన్ని కొద్దిగా వేడిచేసి, ఆ
రసం రెండు మూడు చుక్కలు చెవిలో
వేస్తే నొప్పి తగ్గుతుంది.
ఉల్లిగడ్డను వేయించి, దాని రసాన్ని తీసి,
ఆ రసం రెండు మూడు చుక్కలను
చేవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది.
నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలను
వేసి, కాచి వడబోసి మూడు నాలుగు
చుక్కలను చెవిలో వేస్తే నొప్పి
తగ్గుతుంది. లేదా వేపాకుల రసం తీసి
రెండు చెక్కలను చెవిలో వేసినా నొప్పి
తగ్గుతుంది.