తాగితే మేలే!
రోజులో
ఎన్ని
గ్లాసుల నీళ్లు
తాగితే అంత
మంచిది.
అయితే ఓ
గ్లాసు వేణ్నీళ్లు
కూడా ప్రతి
రోజూ తీసుకుంటే మరింత మంచిదంటు
న్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం
వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని
నీళ్లు తాగుతారు. నిజానికి భోంచేశాక తాగడం
వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అరుగుదలలో
ఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుం
టుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది.
చిన్నారులకు కూడా వేణ్నీళ్లు తాగే అలవాటు
చేయడం మంచిది. చురుగ్గా ఉంటారు.
ఆ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు
రకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చని
నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకో
వచ్చు. చర్మ సంబంధిత
సమస్యలు తగ్గు
ముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే ఈ
గ్లాసు వేణ్నీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసం
కలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది.
శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ
పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని
చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా
త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి
బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే
సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట
తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందు
తుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా
నిద్రపడుతుంది.