డిటాక్స్ చేయడం అంటే?
శరీరానికి సంబంధించి డిటాక్సిఫికేషన్ అంటే క్యాలరీ లోడ్‌ను తగ్గించుకోవడం. ముఖ్యంగా కొవ్వు, ఆల్కాహాల్, ప్రాసెస్ట్ పదార్థాల తాలూకూ భారాన్ని తగ్గించడం.ఈ డిటాకు ఫేడ్ డై గానో లేక వెయిట్లాస్టెక్నిక్గానోఏమాత్రంభావించకూడదు.
డిటాక్సిఫికేషన్ వెనుకగల ఆలోచన శరీరంలోకి
టాక్సిన్లు లేదా విషతుల్యాలు ప్రవేశించకుండా అడ్డు
కోవడం. కాబట్టి చెడు ఆహార అలవాట్లకు స్వస్తి చెప్పి,
కొత్త అలవాట్లు సృష్టించుకోవాలి.ఇందుకోసం ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి21 రోజులనుంచి 62 రోజులదాకా పట్టవచ్చు.కాబట్టి వీటిని ఓపిగ్గా అనుసరించాలి. రెగ్యులర్ ఆహారాన్ని పూర్తిగా మానేసి రోజు మొత్తం గ్రీన్
జ్యూస్‌లు తాగుతూ బ్రతికేయాలని అర్థం కాదు. సింపుల్
గా ఆరోగ్యవంతమైన ఆహారం తింటే చాలు.
రోజుకు మూడు భోజనాలు,ఒక స్నాక్ సరిపోతాయి.
చక్కెర పదార్థాలన్నింటినీ కట్చేసేయాలి. అలాగే ఆల్కా
హాల్, డిజర్టులూనూ, పండ్లు వీలయినంత ఎక్కువగా
తినాలి. దీనివల్ల శరీరానికి ఇతర పోషకాలతోపాటు
మంచి చక్కెరలు కూడా లభిస్తాయి.మధ్యమధ్యలో రోజుకు కనీసం ఎనిమిదినుంచిపదిగ్లాసుల నీరు తాగాలి. వేయించిన పదార్థాలు అవిచిప్స్ అయినా సరేతినవద్దు. ఏది తినాలనిపించినా శరీరాన్ని డిటాక్సింగ్ చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పప్పు,మొలకలు, నుంచి ప్రొటీన్లుఅందే మాదిరి చూసుకోవాలి.స్టీమ్ చేసిన లేదా ఉడికించినపదార్థాలు తినాలి. ఇక్కడ ఆహారంతినడం మానేయమని అర్థం కాదు చెడు ఆహారాన్ని పూర్తిగా మానేయాలన్నది కీలకాంశం.