Saturday 12 December 2015

LIVER VYADHULU - AHARAM

లివరు వ్యాధులు-ఆహారం...

కామెర్ల వ్యాధి వచ్చింది. లివర్ దెబ్బతింటోందనీ, ఫుడ్ విషయంలో
జాగ్రత్తగా వుండాలన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా?

* ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో లివరు ముఖ్య పాత్ర వహిస్తుంది.
అందుని కాలేయం పైన వత్తిడి పడకుండా తేలికగా అరిగే ఆహారం తీసుకో
వాలి. మెతుకు తగలకుండా ఆహారం ఇవ్వాలనే రూలేమీ లేదు.
రోగికి ఇచ్చే
ప్రతి మెతుకూ అరిగేదిగా ఉండాలి. పాత బియ్యాన్ని వేయించి, మెత్తగా వండు
కుని తినవచ్చు.
బార్లీ, సగ్గుబియ్యం, రాగి, జావలు మంచివి. బాగా చిలికి వెన్న
తీసిన మజ్జిగ, ఎక్కువగా తాగాలి. బీర, పొట్ల, సొర, గలిజేరు, గుంటగలగర
ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, చిర్రికూర, వీటితో పప్పు
గానీ, పొడికూరగానీ వండుకుని తినవచ్చు. మినప్పప్పు, శనగలు, బరా
ణీలు, నూనెలు, చింత
పండు, పులుసుకూ
రలు, ఆవపిండి కలి
సినవి, వేడి చేసేవి
మానాలి. చలవచేసే
వితింటే లివరు వ్యాధులను
అదుపు చేయటం తేలిక.