Thursday 3 December 2015

SUGAR VYADHI - NALLA PACHADI - AYURVEDIC USE

 

shuగరు వ్యాధి ఉన్న వారికి నల్లపచ్చడి పెట్టవచ్చా?"

* షుగరు వ్యాధి ఉన్నవారికి ఉసిరి అమోఘమైన ఔషధం. ఆమలకి అని పిలిచే
ఉసిరికాయని తొక్కి గింజ తీసి
ఉప్పు కలిపి తాలింపు పెట్టిన
నిల్వ పచ్చడి కొద్దిగా నల్లగా
ఉంటుంది. కాబట్టి దాన్ని నల్లవు
చ్చడి అన్నారు. ఉసిరితొక్కు
పచ్చడి అని కూడా అంటారు.
రోజూ కనీసం ఒక చెంచా పచ్చ
దినైనా తినటం అవసరం. నిల్వ
పచ్చడి అయినా సాధారణంగా
కడుపులో మంటను తీసుకు
రాదు. ఊరగాయ మాదిరి తయారు చేసింది ఇబ్బంది పెడుతుంది. ఈ తేడాని
మొదట గమనించాలి. ఉసిరికాయ శరీరంలో విషదోషాలను హరించే యాంటీ
ఆక్సిడెంట్ ఔషధంగా అందరికీ తెలిసిందే! కానీ ఆయుర్వేద శాస్త్రం ఈ ఉసిరికాయ
పొదిలో ఎత్తుకు ఎత్తు మంచి పసుపును కలిపి షుగరు వ్యాధిలో శక్తి ఉత్పత్తికి,
తోడ్పడే ఒక గొప్ప ఔషధం తయారుచేసింది. దాన్ని నిశామలకి చూర్ణం అన్నారు.
రోజూ ఒక చెంచా మోతాదులో ఈ పొడిని ఏదో ఒక విధంగా కడుపులోకి తీసు
కుంటే మంచి సహాయకారి. ఉసిరి నల్లపచ్చడిలో కూడా పసుపు కలిపి కొత్తిమీర
వేసి తాలింపు పెట్టుకుని తింటే షుగరు వ్యాధికి మంచి ఔషధం వాడుతున్నట్టేనని
గమనించాలి.