Tuesday 22 December 2015

THAVUDU THO SWEET - AYURVEDAM



12 కీళ్లవాతం వ్యాధులు రావడానికి బియ్యంలో చిట్టు తవుడు తీసేయటమే కారణం
అంటున్నారు కదా! చిట్టు, తవుడులతో ఏదైనా వంటకం చేసుకోవచ్చా?

* చేసుకోవచ్చు. అలాంటి ఆలోచన చేయటం తప్పేమీ కాదు. ఇంకొంచెం లోతుగా
ఆలోచిస్తే గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఆరికల్లాంటి ప్రత్యామ్నాయ ధాన్యాల్లో చిట్టు,
తవుడు తీసేయకుండా
పూర్తి ధాన్యాన్ని పిండి
లేదా రవ్వగా తయారు
చేసుకుంటున్నాం. కాబట్టి,
రోజువారీ అవసరానికి
సరిపడగా ఈ ప్రత్యా
మ్నాయ ధాన్యాలను
కూడా తింటూ ఉంటే,
తవుడుని కోల్పోయిన
లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఎల్లకాలం ఒకే ధాన్యం మీద ఆధారపడి పోవటం కూడా
మంచిది కాదు. అన్నంలో రాగి పిండి కలిపి చేసే సంకటిలాంటి ప్రత్యామ్నాయ వంట
కాలను తినటం కూడా అలవాటు చేసుకోవాలి. మొదట మనం తినటం మొదలెడితే,
మనల్ని చూసి ఇతరులు కూడా తింటారు. ఇతరులు తినటం చూసి మనం అనుసరిం
చటంలో గొప్పేమీ ఉండదు.
అయినా, చిట్టు, తవుడుతో ఏదైనా వంటకం గురించి అడిగారు. బాగుచేసిన తవు
డుని నేతితో కమ్మగా వేయించి బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకులు వగైరా వేసి సున్ని
ఉండలు కట్టుకోవచ్చు. కావాలంటే కొద్దిగా మినప్పిండి కలుపుకోవచ్చు కూడా!
ఆహారం విషయంలో ఆరోగ్యం కోసం కొత్తగా ఆలోచించాలనే మీ తపనకు
అభినందనలు.