Thursday 3 December 2015

SHIREESHA KASHAYAM - VEGETABLES CLEANING - AYURVEDAM



కూరగాయలపై ఉండే పెస్టిసైడ్ అవశేషాలు తొలగించే
శిరీష కషాయం
కూరగాయలను పండించడంలో రైతులు అనేక రకాల క్రిమి, తెగుళ్ళ
నివారణ మందులు వాడుతున్నారు. వాటివల్ల కాపు కూడా బాగా
ఉంటుంది. కాయలు ఏపుగా పెరుగుతాయి. కాని వాటిపై
రసాయనిక అవశేషాలు ఉండిపోయి, త్వరగా పోవు.
వాటిని ఎంతగా కడిగినప్పటికీ, రసాయనిక అవశేషాలు కొన్ని అలాగే
ఉంటాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా
దెబ్బతింటుంది. ఇలాంటి తెగుళ్ళ మందులలో ఎక్కువగా ఆర్గనో
ఫాసర (మలాథియాన్) ఉంటుంది.
కాయగూరలను ఎంతగా కడిగినప్పటికీ, ఈ కెమికల్ అవశేషాలు
పూర్తిగా పోవు. అయితే దీన్ని పూర్తిగా తొలగించే అవకాశం కూడా
ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లోని షెకావటి
ఆయుర్వేద కాలేజిలో ఒక అధ్యయనం జరిగింది.




వాటిని శిరీష క్వాతతో ధావన (కడ
గడం) చేసి ఫలితం తెలుసుకోవడం వారి
-లక్ష్యం. మంచినీటితో ఆనపకాయను కడ
గడం, శిరీష క్వాతతో ఆనపకాయను కడగడం
వల్ల కనిపించే తేడా ఏమిటి? ఫ్రిజ్ లో ఆనప
కాయలను ఉంచినందువల్ల వాటిలోని రసాయ
నిక అవశేషాలు తొలగుతాయా? లేదా? అనే
దానిని పరిశీలించడం ముఖ్య ఉద్దేశ్యం.
పద్ధతి
పరిశోధకులు అప్పటికప్పుడు కొన్ని
ఆనపకాయలను (సొరకాయలు) తెప్పించి
వాటిని రెండుగా విభజించారు. ఒకటి
కంట్రోల్ గ్రూపు, రెండవది. ప్రయోగాత్మక

గ్రూపు రెందవగ్రూపును మళ్ళీ నటి
గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూపులోని
కాయలపై మలథాన్ వేశారు. రెండో గ్రూపు
లోని కాయలను మంచినీటితో కడిగారు..
మూడో గ్రూపులోని కాయలను శిరీష క్పాతతో
ఉంచారు. దీని తర్వాత అన్ని ఆనపకాయలపై
శుభ్రం చేశారు. నాలుగో గ్రూపులోని
కాయలను నాలుగు రోజులపాటు ఫ్రీజ్ లో
రసాయనిక పరీక్షలు చేశారు.
ఫలితం
మంచినీటితో కడిగిన వాటికంటే
ఫ్రిజ్ లో ఉంచిన వాటికంటే శిరీష క్వాతతో
శుభ్రంచేసిన కాయలలోని రసాయనిక
అవశేషాలు చాలావరకు తొలగిపోయాయి.
ముగింపు
ఈ ప్రయోగాన్నిబట్టి కాయగూరలను
మంచినీటితో కాకుండా శిరీష క్వాథతో పరిశు
భ్రం చేయడం చాలా మంచిదని రుజువైంది.