Saturday, 12 December 2015

GASTRITIS - AHARA VAIDYAM


. తరచూ గ్యాస్ట్రయిటిన్ కారణంగా మాటిమాటికీ
ఎక్కువ మందులు వాడవలసి వస్తోంది. ఇలా తిరగటి
ట్టకుండా ఏదైనా సలహా చెస్తారా?

* గ్యాస్ట్రయిటిస్ వ్యాధి కేవలం నోటి ద్వారా మాత్రమే కదు
పులోకి ప్రవేశిస్తోంది. దొంగ ఏదారిన వస్తున్నాదో ఆ దారిని ముందు
మూసేయాలి కదా! కాబట్టి ఆహార పానీయాల విషయంలో తగిన
జాగ్రత్తలు తీసుకోండి. హోటళ్ళలోనూ అలాగే, రోడ్డు పక్కన బళ్ళ
మీదవి తినటం పూర్తిగా మానేయండి. ఇంట్లో శుచిగా వండినవి
మాత్రమే తినండి. త్రాగు నీరుస్వచ్ఛంగా ఉండాలి. వ్యక్తిగత పరిశు
భ్రత అవసరం.
పుల్లనివి, పులిసినవి, ఊరబెట్టినవి గ్యాస్ట్రయిటిస్ వ్యాధిని తీర
గబెడతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ ఈ వ్యాధిని పెంచు
తాయి. తేలికగా అరికేవి
తినాలి. పాలకు బదులు మజ్జిగ
ఎక్కువగా
తీసుకోండి. పెరుగు
కన్నా చిలికిన మజ్జిగ మంచిది.
ఫ్రిజు చల్లదనం తగ్గాకే మజ్జిగ
తాగండి. ఇడ్లీ, అట్టు, పూరీ,
ఉప్మాలకు బదులు, రాత్రి
వండిన అన్నంలో పాలుపోసి
తోడు పెట్టి ఉదయాన్నే పులవక
ముందే తినటం ఉత్తమం. మజ్జి
గలో నానబెట్టి కూడా తినవచ్చు. తాలింపు పెట్టి రుచిగా చేసుకోవచ్చు. రోజూ
బార్లీ జావగానీ, సగ్గుబియ్యం జావగానీ, మరమరాలు లేదా బొరుగులతో జావ
గానీ కాచుకుని పెరుగు వేసి చిలికిన చిక్కని మజ్జిగ తాగండి. చలవ చేసే వన్నీ
ఈ వ్యాధిని తగ్గిస్తాయి. వేడి చేసేవి పెంచుతాయి. కందికట్టు లేదా పెసరకట్టు
(చింతపండు వేయని పప్పుచారు) అన్నంలో తినండి. అన్ని కూరలు తినదగినవే
పులుపు లేనివి, పులుపు కలపకుండా వండినవీ ఈ వ్యాధిని తగ్గిస్తాయి. పులుపు
కోసం దానిమ్మగింజలు, వెలగపండు, ఉసిరికాయ నల్లపచ్చడి పరిమితంగా
తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మసాలాలు అతిగా తినటం వలన, వేపుడు కూరల
వలన, ఊరగాయల వలన ఈ వ్యాది తిరగబెడ్తోంది.