తెలుగు - తెల్ల గరిక,నల్ల గరిక,తెల్ల తీగ గరిక,నల్ల తీగ గరిక
english - huriallee grass,couch grass,creeping panic grass
హిందీ - డూబ్
సంస్కృతంలో - శత వీర్య , సహస్ర వీర్య , దూర్వ
అనేక రకాలలో సర్వత్రా లభ్యమౌతుంది. దీని రసం లేక కషాయం చలువ చేస్తుంది. తెల్ల గరిక శ్రేష్ఠమని పెద్దల మాట.
1 . ముక్కు నుండి కారే రక్తం ఆగిపోవుటకు ( FOR NOSE BLEEDING )
గరిక వేళ్ళ రసం - 5,6 చుక్కలు
గరిక వేర్లను దంచి రసం తీసి ,5 ,6 చుక్కలు రెండు ముక్కుల్లో వేయాలి.
uses - పిల్లలకు ,పెద్దలకు గానీ అధిక పైత్యం వల్ల ,ముక్కు బెదరడం వల్ల ,దెబ్బ తగలడం వల్ల ముక్కు నుండి కారే రక్తం ఆగిపోతుంది.
* గరిక రసాన్ని 20 gm లోపలికి సేవిస్తుంటే రక్త విరేచనాలు, రక్త మొలలు, మూత్రంలో రక్తం పోవడం, నోటి నుండి రక్తం పడడం వంటి రక్త పైత్య వికారాలు తగ్గిపోతాయి.
2 . మూత్ర పిండ రాళ్లు కరిగిపోవుటకు ( FOR KIDNEY STONES )
గరిక రసం - 2,3 స్పూన్స్
రసాన్ని రెండు పూటలా సేవిస్తుండాలి.
uses - 20 రోజుల్లో మూత్ర పిండాలలోని రాళ్లు కరిగి పడిపోతాయి.
3 . బహిష్టు ఆగిన స్త్రీలకు ( FOR ABSENT MENSUS )
గరిక వేర్ల రసం - 5 gm
రసాన్ని రెండు పూటలా సేవిస్తుండాలి.
uses - ఆగిపోయిన బహిష్టు మరలా వస్తుంది.
4 . ఆగిపోయిన మూత్రం మరలా వచ్చుటకు ( FOR ABSENT URINATION )
గరిక వేర్లు దంచిన ముద్ద - 30 gm
నీరు - 1 గ్లాస్
పటిక బెల్లం - 1 స్పూన్
వేర్ల ముద్దను నీటిలో వేసి ,1 కప్ కషాయానికి మరిగించి ,వడపోసి ,1 స్పూన్ పటికబెల్లం కలిపి చల్లగా తాగుతుండాలి.
uses - ఆగిన మూత్రం సాఫీగా వస్తుంది.
5 . తెగిన గాయాలు తగ్గడానికి ( FOR CUT WOUNDS )
పచ్చి గరిక గడ్డి - 1 భాగం
ఉత్తరేణి ఆకు - 1 భాగం
చిన్న ఇలాయిచి - 1 భాగం
పై అన్నింటిని కలిపి మెత్తగా నూరి తెగిన గాయాల పై పట్టిస్తుండాలి.
uses - మరుక్షణమే రక్తం ఆగిపోయి గాయం మాడిపోతుంది.
6 . వాత నొప్పులు తగ్గడానికి ( FOR BODY PAINS )
గరిక రసం - 1 భాగం
మంచి నువ్వుల నూనె - 1 భాగం
కణుపులుగా నేలమీద పాకే తీగ గరికను తీసుకొచ్చి కత్తిరించి ఆ కణుపులు తీసివేసి మిగిలిన భాగాలను వేళ్లతో సహా మెత్తగా రుబ్బి రసం తీయాలి. దీనికి నువ్వుల నూనె కలిపి చిన్న మంట పైన మరిగించి వడపోసి నిలువచేసుకోవాలి. ఈ తైలాన్ని రోజూ రెండు పూటలా నొప్పుల పైన గోరు వెచ్చగా మర్దన చేస్తుండాలి.
uses - అన్ని రకాల వాత నొప్పులు తగ్గిపోతాయి.
7 . దురదలు, దద్దుర్లు, గజ్జి, క్రిములు తగ్గడానికి ( FOR URTICARIA, ITCHINGS, SCABIES, WORMS )
గరిక గడ్డి - 1 భాగం
మంచి పసుపు - 1 భాగం
నీరు - కొంచెం
పై అన్నింటిని కలిపి మెత్తగా నూరి పైన రుద్దుతుండాలి.
uses - దురదలు, దద్దుర్లు, గజ్జి మొదలైన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి.
8 . సమస్త చెవి రోగాలు తగ్గడానికి ( FOR VARIOUS EAR DISEASES )
తెల్ల గరిక సమూల రసం - 80 gm
ముల్లంగి రసం - 60 gm
సైంధవ లవణం - 10 gm
నువ్వుల నూనె - 60 gm
పై అన్నింటిని కలిపి నూనె మిగిలే వరకు మరిగించి దించి రెండు పూటలా నాలుగు లేక ఐదు ( 4 or 5 ) చుక్కలు చెవులలో వేస్తుండాలి.
uses - చెవి హోరు , చీము కారడం, చెవుడు ( sounds in the ear , ear pus, deafness ) తగ్గిపోతాయి.
------------------------------------------------------------------------------------------------------------------------------
పచ్చి గడ్డి / గరిక తో డా కొండపల్లి నరసింహా రెడ్డి గారి ఆయుర్వేద పరిష్కారాలు.
1 . గాయాలు తగ్గడానికి ( RECIPE FOR WOUNDS )
పచ్చి గరికను దంచి ముద్దగా చేసి గానీ , లేక ఎండు దానిని చూర్ణం చేసి గాయం పై అంటించించాలి.రక్తం కారడం ఆగిపోయి , గాయం త్వరగా మానుతుంది.
2 . చర్మ వ్యాధులు తగ్గడానికి ( FOR SKIN DISEASES )
గరిక రసం - 1 gm
రోజూ ఉదయం, సాయంత్రం రసాన్ని త్రాగాలి.
3 . మూత్రంలో మంట తగ్గడానికి ( FOR URINE BURN )
గరిక వేర్ల కషాయం 1/2 ఔన్స్ త్రాగాలి.
4 . తెల్ల బట్ట తగ్గడానికి ( FOR WHITE DISCHARGE )
గరిక వేర్లు
పెరుగు
వేర్లను దంచి , పెరుగులో కలిపి 1 కప్ తాగాలి. తెల్ల బట్ట తగ్గుతుంది.
5 . మూత్రంలో రక్తము తగ్గడానికి ( FOR BLEEDING THROUGH URINE )
గరిక ఆకుల రసం - 1 or 2 స్పూన్స్
or
గరిక వేర్ల కషాయం - 1/2 ఔన్స్
పై దానిని తాగించాలి.
6 . అర్శ మొలలు తగ్గడానికి ( FOR PILES )
గరిక కషాయం
గరిక ఆకు ముద్ద
మొలలు బయటికి వచ్చి బాధించుచున్నప్పుడు గోరు వెచ్చని గరిక కషాయం లో కూర్చుండబెట్టాలి. గరిక ఆకును దంచి ముద్ద చేసి మొలల పై వేసి కట్టు కట్టాలి.
----------------------------------------------------------------------------------------------------------------------
* మడగాస్కర్ లో గరికను మెత్తగా నూరి నొప్పి ఉన్న కీళ్లపైన లేపనం చేస్తారు.
* తెల్ల గరిక రసాన్ని సాధువులు కామశక్తి నశించడానికై సేవిస్తారు.
1 . చర్మం పైన పొక్కులు తగ్గడానికి
గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి సిద్ధఘృతం తయారు చేసి చర్మం పై ప్రయోగించాలి
2 . దద్దుర్లు తగ్గడానికి -
గరిక గడ్డి ముద్ద,పసుపు మిశ్రమాన్ని చర్మం పై రాసుకుంటే దద్దుర్లు,గజ్జి,తామర,ఎగ్జిమా వంటివి తగ్గుతాయి.
3 . సంతాన లేమి సమస్య నివారణకు -
ప్రతిరోజూ అరకప్పు గరిక కషాయాన్ని తీసుకోవాలి.
4 . తలనొప్పి తగ్గడానికి -
గరిక గడ్డి ముద్దకు సమానంగా మినప్పిండి కలిపి నుదుటిమీద లేపనం చేసుకోవాలి.
5 . వాంతులు తగ్గడానికి -
గరిక గడ్డి స్వరసాన్ని బియ్యపు కడుగు నీటితో తీసుకోవాలి.
6 . గర్భాశయ వ్యాధులు తగ్గడానికి -
గరిక కషాయాన్ని అరకప్పు కాని, లేదా గరిక గడ్డి వేళ్ళ ముద్దను 2 టీ స్పూన్ లు గాని ,లేదా గరిక స్వరసం 1 - 3 టీ స్పూన్ లు గాని 2 నెలలపాటూ తీసుకోవాలి.
7 . నోటి పుండ్లు తగ్గడానికి -
గరిక గడ్డి కషాయంతో పుక్కిట పడుతుంటే నోటి పూత తగ్ఫ్గుతుంది.
8 . చుండ్రు తగ్గడానికి -
2 లీటర్ల గరిక గడ్డి రసాన్ని 1 లీటర్ కొబ్బరి నూనెలో వేసి నీరంతా ఆవిరయ్యేలా మరిగించి నిల్వ చేసుకొని తల నూనెగా వాడుకోవాలి.
9 . స్త్రీలలో తెల్లబట్ట తగ్గడానికి -
గరిక వేళ్ళ ముద్ద 2 టీ స్పూన్ లు 1 కప్పు పెరుగుకు కలిపి తీసుకోవాలి.
10 . రక్త స్రావాలు తగ్గడానికి -
గరిక రసాన్ని రక్తం కారే చోట రాయాలి.అలాగే 4 స్ప్పొన్ ల గరిక రసాన్ని అరకప్పు చల్లని పాలతో కలిపి లోపలకు కూడా తీసుకోవాలి.
11 . అనార్తవం తగ్గడానికి -
గరిక గడ్డి ముద్దను 2 చిన్న చెంచాల మోతాదులో అనునిత్యం తీసుకుంటూ ఉండాలి.
12 . దద్దుర్లు,బెందులు ,ఎగ్జిమా తగ్గడానికి -
గరికకు పసుపు కలిపి దంచి ముద్ద చేసి చర్మం పైన లేపనం చేయాలి.
13 . గాయాలు తగ్గడానికి -
పచ్చి గరికను దంచి ముద్దను గాయాలపై రాయాలి.
14 . చర్మ వ్యాధులు తగ్గడానికి -
ప్రతిరోజూ కనీసం 40 రోజులపాటు 2 పూటలా
విడతకు 1 టీ స్పూన్ మోతాదుగా గరిక రసాన్ని ఉదయం,సాయంత్రం సేవిస్తుండాలి.
15 . జీర్ణాశయంలో అల్సర్ తగ్గడానికి -
గరిక ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకొని 1 టీ స్పూన్ మోతాదుగా అరకప్పు నీళ్ళతో కలిపి తీసుకోవాలి.
16 . జ్వరం,ఫ్లూ తగ్గడానికి -
పిడికెడు గరిక గడ్డి,2 టీ స్పూన్ ల జీలకర్ర 1 టీ స్పూన్ మిరియాలు,2 గ్లాసుల నీటిలో వేసి చిన్న మంట మీద అర గ్లాసు కషాయం మిగిలేంత వరకు మరిగించి ప్రతిరోజూ ఉదయం 4 - 5 రోజుల పాటు తీసుకోవాలి.
17 . చర్మవ్యాధులు తగ్గడానికి -
ఒక భాగం గరిక గడ్డి ముద్ద,4 భాగాలు నువ్వుల నూనె,16 భాగాలు గరిక గడ్డి స్వరసం కలిపి ద్రవాంశం ఆవిరయ్యే విధంగా నూనె మాత్రమే మిగిలే విధంగా మరిగించి నిల్వ చేసుకోవాలి.దీనిని బాహ్యంగా చర్మవ్యాధుల మీద ( ఎగ్జిమా,గజ్జి ) ప్రయోగించాలి.
18 . వాపు ,ఉబ్బువ్యాధి తగ్గడానికి --
పూటకు 3 స్పూన్ ల చొప్పున 2 పూటలా గరిక గడ్డి స్వరసాన్ని తీసుకోవాలి.
19 .వాత రోగాలకు గరిక తైలం -
కణుపులుగా నేలమీద పాకే తీగ గరికను తీసుకొచ్చి కత్తిరించి ,కణుపులు తీసివేసి మిగిలిన భాగాలను వేళ్ళతో సహా మెత్తగా రుబ్బి రసం తీయాలి.ఈ రసంతో సమానంగా మంచి నువ్వుల నూనెను కలిపి చిన్నమంటపైన మరిగించి వడపోసి నిల్వ చేసుకోవాలి.ఈ తైలాన్ని రోజూ 2 పూటలా గోరువెచ్చగా నొప్పులపైన మర్దనా చేస్తుంటే అన్ని రకాల వాతనొప్పులు తగ్గిపోతాయి.
20 . ముక్కు నుంచి కారే రక్తం తగ్గడానికి -
పిల్లలకు,పెద్దలకు,ముక్కుకు దెబ్బ తగిలి,లేదా అధిక పైత్యం చేసి ముక్కు బెదిరి రక్తం కారుతుంటే వెంటనే గరిక వేర్లను దంచి రసం తీసి 5 , 6 చుక్కలు రెండు ముక్కులలో వేస్తే వెంటనే రక్తం కట్టుకుంటుంది.
గరిక రసాన్ని 20 గ్రాములు లోపలికి సేవిస్తుంటే రక్త విరేచనాలు,రక్త మొలలు ,మూత్రంలో రక్తం పోవడం ,నోటి నుంచి రక్తం పడటం వంటి సమస్త రక్త పైత్య వికారాలు తగ్గిపోతాయి.
21 . మూత్ర పిండ రాళ్ళకు గరిక -
గరిక రసం 2, 3 చెంచాల మోతాదుగా 2 పూటలా సేవిస్తుంటే 20 రోజుల్లో మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపడిపోతాయి.
22 . బహిష్టు ఆగిన స్త్రీలకు గరిక వేర్లు -
గరిక వేర్లు దంచి తీసిన రసం పూటకు 5 గ్రాముల 2 పూటలా సేవిస్తుంటే ఆగిపోయిన బహిష్టు మరలా వస్తుంది.
23 . మూత్రం ఆగిపోతే - గరిక వేర్లు
గరిక వేర్లు దంచిన ముద్ద 30 గ్రాముల మోతాదుగా 1 గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు మిగిలేవరకు మరిగించి వడపోసి 1 చెంచా కండ చక్కెర కలిపి చల్లగా తాగుతుంటే ఆగిన మూత్రం సాఫీగా వస్తుంది.
24 . తెగిన గాయాలకు గరిక -
పచ్చి గరిక గడ్డి ,ఉత్తరేణి ఆకు,చిన్న ఏలకులు సమంగా కలిపి నూరి తెగినగాయాలపై పట్టిస్తే రక్తం ఆగిపోయి గాయం మానిపోతుంది.
25 . సమస్త చెవి రోగాలకు గరిక తైలం -
తెల్ల గరిక సమూల రసం 80 గ్రాములు ,ముల్లంగి రసం 60 గ్రాములు ,సైంధవ లవణం 10 గ్రాములు ,నువ్వుల నూనె 60 గ్రాములు కలిపి నూనె మిగిలే వరకు మరిగించి దించి 2 పూటలా 4,5 చుక్కలు చెవులలో వేస్తుంటే చెవి హోరు,చీము కారడం,చెవుడు తగ్గిపోతాయి.