16, జనవరి 2012, సోమవారం

గురివిందతో డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు




COMMON NAMES -


telugu - గురివింద, గురి గింజ
english - indian liquorice
hindi - గుంచీ
sanskrit - గుంజ,శిఖండి, చూడామణి 

1 . బట్ట తల పై వెంట్రుకలు రావడానికి ( FOR BALD HEAD )

గురివింద ఆకులు 
నీరు

ఆకులను నీటితో మెత్తగా నూరి , ఆ ముద్దను బట్ట తలపైన రోజూ రుద్దుతుండాలి

uses - కొంత కాలానికి వెంట్రుకలు మొలుస్తాయి

2 . చెవి తమ్మెల పుండ్లు తగ్గుటకు ( FOR WOUNDS ON THE OUTER EAR )

గేదె పాలు 
గురివిందల పొడి

పాల లో పొడి కలిపి తోడు పెట్టి తర్వాత చిలికి వెన్న తీయాలి. ఈ వెన్నను నిలువ చేసుకొని చెవి తమ్మెలకు వచ్చిన పుండ్ల పైన రెండు పూటలా రాయాలి.

uses - చెవి తమ్మెల పుండ్లు తగ్గిపోతాయి

3 . చర్మం పైన పుట్టిన పైత్యపు సర్పి పుండ్లు తగ్గుటకు ( FOR SMALL BOILS ON THE SKIN )

గురివింద ఆకు 
నీరు

ఆకును నీటితో మెత్తగా నూరి సర్పి పుండ్ల  పైన లేపనం చేస్తుండాలి.

uses - paithyam prakopinchadam valla charmampaina puttina chinna chinna gudla lanti sarpi pokkulu thaggipothayi. పైత్యం ప్రకోపించడం వల్ల చర్మం పైన పుట్టిన చిన్న చిన్న గుడ్ల లాంటి సర్పి పొక్కులు తగ్గి పోతాయి.

4 . లింగ బలహీనత తగ్గడానికి( FOR WEAK PENIS TO BECOME STRONG )

తెల్ల గురివిందల పొడి - 2 gm
పొంగించిన  వెలిగారం - 2 gm
దొండ ఆకులు - 2
నిమ్మ రసం - కొంచెం 

పై అన్నింటినీ కలిపి మెత్తగా నూరి నిద్రించే ముందు లింగానికి లేపనం చేసుకొని ఉదయమే కడుగుతుండాలి.

uses - లింగ బలహీనత 7 రోజుల్లో తగ్గిపోతుంది

*  ఈ యోగాన్ని అనుభవ ఆయుర్వేద వైద్యుల ద్వారా తయారు చేయించుకొని వాడుకోవాలి *

5 . శరీరపు పాత నొప్పులు తగ్గడానికి ( FOR OLD PAINS OF THE BODY )

గురివిందలు 
నీరు 

గురివిందలను ఒక రోజు నీటిలో నానబెట్టి మెత్తగా గంధం లాగా నూరి దానిని పైన పట్టువేయాలి.

uses - శరీరంలోని పాత నొప్పులు తగ్గిపోతాయి.

6 . గజ్జి , చిడుము , కుష్టు తగ్గుటకు ( SCABIES , LEPROSY ETC SKIN DISEASES )

గురివింద గింజలు  -  100 gm
గుంటగలగర ఆకు రసం  - 100 gm
నువ్వుల నూనె ( gingelly oil )  - 100 gm

గింజలను నీటిలో రెండు రోజులు నానబెట్టి దంచి రసం తీయాలి. ఈ రసానికి గుంటగలగర ఆకు రసం ,నువ్వుల నూనె కలిపి చిన్న మంట పైన రసాలు ఇగిరిపోయి తైలం మిగిలే వరకు మరిగించి దించి వడపోసి నిలువ ఉంచుకోవాలి. ఈ తైలాన్ని రోజు రెండు పూటలా చర్మం పైన లేపనం చేస్తుండాలి.

uses  -  పైన తెలిపిన చర్మవ్యాధులు తగ్గిపోతాయి

7  . తల నొప్పి తగ్గడానికి ( FOR HEADACHE )

గురివింద గింజలు
కుంకుడు కాయ రసం

గింజలను కుంకుడుకాయ రసంతో అరగదీసి ఆ గంధాన్ని కనతలకు పట్టువేస్తుండాాలి.

uses  - తల నొప్పి తగ్గిపోతుంది

8 . వాపులు, నొప్పులు  తగ్గడానికి  (  FOR SWELLINGS AND  PAINS )

గురివింద  ఆకు 
ఆముదం

ఆకును నలగగొట్టి కొంచెం ఆముదంతో వేయించి, బట్టలో వేసి వాపులపైన ,నొప్పుల పైన రాత్రిపూట కట్టు కడుతుండాలి.

uses  -  వాపులు , నొప్పులు తగ్గిపోతాయి. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...